Switch to English

రాజ్యసభకు ప్రశాంత్ కిశోర్ ..?

ప్రముఖ రాజకీయ వ్యూహకర్త, ఎన్నికల్లో పార్టీలకు సలహాలు సూచనలు ఇచ్చే ఐప్యాక్ అధినేత ప్రశాంత్ కిషోర్ రాజ్యసభకు వెళ్లనున్నారా? అంటే ఔననే సమాధానాలు వినిపిస్తున్నాయి. 2014లో బీజేపీ తరఫున పనిచేసిన పీకే.. తాజాగా అదే బీజేపీకి వ్యతిరేకంగా కూటమిని కూడగట్టే ప్రయత్నాల్లో తలమునకలై ఉన్న సంగతి తెలిసిందే. పౌరసత్వ సవరణ చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకించడంతో జేడీ(యూ) నుంచి ఆయన బహిష్కరణకు గురయ్యారు.

ఈ నేపథ్యంలో బీజేపీకి వ్యతిరేకంగా కలిసి వచ్చే పార్టీలను ఒక తాటిపైకి తీసుకొచ్చేందుకు ఆయన ప్రణాళిక ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఆయన్ను తమ పార్టీ కోటాలో రాజ్యసభకు పంపించాలని తృణమూల్ కాంగ్రెస్ భావిస్తున్నట్టు సమాచారం. పైగా త్వరలో బెంగాల్ లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ తరఫున పనిచేయడానికి పీకే ఒప్పందం కుదుర్చుకున్నారు.

ఇప్పటికే తృణమూల్ నేతలతో కలిసి పని చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రశాంత్ కిషోర్ ను టీఎంసీ కోటాలో రాజ్యసభకు పంపిస్తే బావుంటుందని ఆ పార్టీ అధినేత్రి, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ యోచిస్తున్నట్టు సమాచారం. ప్రధాని మోదీని తీవ్రంగా వ్యతిరేకించేవారిలో ముందుంటే మమత.. తమ పార్టీ వాయిస్ జాతీయ స్థాయిలో బలంగా వినిపించగల నేతల కోసం అన్వేషిస్తున్నారు. ఎన్నికల వ్యూహాలలో ఆరితేరిన పీకే తమకు మంచి ఆప్షన్ అని ఆమె నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.

పైగా ఆయన కూడా మోదీని, ఆయన విధానాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీంతో పీకేను రాజ్యసభకు పంపించాలని మమత నిర్ణయించారు. మార్చి 26న జరగబోయే రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల్లో టీఎంసీకి నాలుగు సీట్లు దక్కనున్నాయి. కాంగ్రెస్ లేదా సీపీఎం సహకారం తీసుకుంటే ఐదో సీటును కూడా ఖాతాలో వేసుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అందులో ఒక సీటును పీకేకి ఇచ్చి రాజ్యసభలో బీజేపీకి వ్యతిరేకంగా తమ గళం వినిపించడం ఖాయంగా కనిపిస్తోంది.

సినిమా

తన పిరియడ్స్ ఎక్స్ పీరియన్స్ ను చెప్పిన అనసూయ

జబర్దస్త్ ప్రోగ్రామ్ ద్వారా టీవీలో.. రంగస్థలం సినమా ద్వారా సినిమాల్లో చాలా పాపులర్ అయిన నటి అనసూయ. నటిగానే కాకుండా సోషల్ మీడియాలో కూడా అంతే...

‘ఓటీటీ’ దుమ్ము దులిపే ‘సినిమా’ కావాలి

లాక్ డౌన్ కారణంగా రెండు నెలలుగా థియేటర్లు మూతబడ్డాయి. ఇప్పటికీ థియేటర్ల పునఃప్రారంభంపై అనిశ్చితి కొనసాగుతూనే ఉంది. ఒకవేళ తెరిచినప్పటికీ ప్రేక్షకులు మునుపటిలా థియేటర్లకు వస్తారో,...

‘కరోనా వైరస్’ సినిమా ఓటీటీ కోసమే..

ప్రపంచమంతా కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ అంటూ కూర్చుంటే వర్మ మాత్రం అదే ‘కరోనా వైరస్’ నేపధ్యంలో సినిమా తీసేసాడు. లాక్ డౌన్ సమయంలో...

జుంబారే ..జుజుంబరే… తాతకి మనవడి బర్త్ డే గిఫ్ట్

అమరరాజా ఎంటర్టైన్మెంట్ పతాకంపై గల్లా జయదేవ్ కుమారుడు గల్లా అశోక్ హీరోగా శ్రీరాం ఆదిత్య దర్శకత్వంలో ఒక చితం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో...

పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్న చిరంజీవి ఫ్యామిలీ

మెగాస్టార్ చిరంజీవి తేనెటీగల దాడి నుంచి తృటిలో తప్పించుకున్నారు. తెలంగాణలోని కామారెడ్డి జిల్లా దోమకొండలో ఈ ఘటన జరిగింది. ఇటివల రామ్ చరణ్ భార్య ఉపాసన...

రాజకీయం

‘సుమోటో’ అంటూ ఈ కెలుకుడేంది ‘రెడ్డి’గారూ.!

సోషల్‌ మీడియాలో వైఎస్సార్సీపీ ముఖ్య నేత, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి చాలా యాక్టివ్‌గా వుంటారన్నది అందరికీ తెల్సిన విషయమే. కుప్పలు తెప్పలుగా ట్వీట్స్‌ వేస్తుంటారాయన. ప్రత్యర్థులపై ఎడాపెడా సెటైర్లు వేయడంలో...

జనసేనాని ప్రశ్న: లాక్‌డౌన్‌లో ‘ఇసుక’ మాయమైందెందుకు.?

‘లాక్‌డౌన్‌లోనూ ఇసుక లారీలు తిరిగాయి.. కానీ, డంపింగ్‌ యార్డులకి చేరలేదని భవన నిర్మాణ రంగ కార్మికులు చెబుతున్నారు. మరి, ఇసుక ఏమయినట్లు.? చంద్రబాబు హయాంలో ఎలాగైతే ఇసుక పేరుతో దోపిడీ జరిగిందో.. ఇప్పుడే...

కృష్ణాజిల్లా నందిగామలో చంద్రబాబు పై కేసు నమోదు

మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పై నందిగామ పోలీస్ స్టేషను లో కేసు నమోదు. కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయంలో హైదరాబాదు నుండి విజయవాడ కు రోడ్డు మార్గాన వస్తూ జగ్గయ్యపేట, నందిగామ,కంచికచర్ల...

సుధాకర్ కు వైద్యం అందిస్తున్న డాక్టర్ మార్పు

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన డా.సుధాకర్ కేసును హైకోర్టు ఆదేశాలతో సీబిఐ విచారణ చేస్తున్న సంగతి తెలిసిందే. రోజురోజుకీ ఈ కేసు కీలక మలుపులు తీసుకుంటోంది. ఇప్పుడు సుధాకర్ విషయంలో మరో అంశం సంచలనమైంది....

కరోనా వైరస్‌.. జనానికి ఇకపై ఆ దేవుడే దిక్కు.!

కరోనా వైరస్‌ విషయంలో కేంద్రం చేతులెత్తేసింది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చేయడానికేమీ లేదు. దశలవారీగా లాక్‌డౌన్‌ని ఎత్తేవేసేందుకు ప్రణాళికని కూడా కేంద్రం ప్రకటించేసింది. కేంద్రం నుంచి రాష్ట్రాలకు అందాల్సిన స్థాయిలో ఆర్థిక అండదండలు...

ఎక్కువ చదివినవి

కరోనా కలకలంతో ఏపీ సచివాలయంలో భయాందోళన.!

ప్రస్తుతం మంగళగిరి ఏపీ సచివాలయంలో కరోనా కలకాలంతో భయాందోళనలో అధికారులు. మంగళగిరి మండలం నవులూరు గోలివారితోట లో ఓ అపార్ట్మెంట్ లో నివాసం ఉంటూ, ఏపీ సచివాలయంలో పనిచేసే ఉద్యోగికి కరోనా పాజిటివ్...

క్రైమ్ న్యూస్: కన్న తల్లిని కిరోసిన్ పోసి కాల్చి చంపిన కొడుకు

నల్లగొండ జిల్లాలో సభ్య సమాజం తలదించుకునే సంఘటన జరిగింది. వృద్ధురాలు అయిన తల్లిని సాకలేక ఆమె బాగోగులు చూసుకోలేక కిరోసిన్ పోసి నిద్రలో ఉండగానే చంపేశాడు. పాపం ఆ పిచ్చి తల్లి చనిపోయిన...

మోడీ 2.0 పాలనకి ఏడాది: విజయాలే కాదు, వైఫల్యాలు కూడా.!

ప్రధాని నరేంద్ర మోడీ వరుసగా రెండోసారి ప్రధాని అయ్యారు.. 2019 ఎన్నికల్లో ఘన విజయం సాధించాక.. తన ఖ్యాతిని మరింతగా పెంచుకున్నారు ప్రధాని మోడీ. అలా ‘మోడీ 2.0’ పాలనకి నేటితో ఏడాది...

పోతిరెడ్డిపాడుపై స్పందించిన చంద్రబాబు.. ఏమన్నారంటే..

కొన్ని రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారిన అంశం పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు. రాయలసీమ కరువు పోగొట్టడానికి పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు సామర్ధ్యం పెంచుతామని సీఎం జగన్ చెప్పడంతో రెండు రాష్ట్రాల్లో...

పిక్ ఆఫ్ ది డే: అన్నగారు – మెగాస్టార్ @ ఓ మధుర జ్ఞాపకం.!

నేడు స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి జయంతి. ఈ సందర్భంగా తెలుగు వారందరూ ఆయనకి సోషల్ మీడియా ద్వారా జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం తెలుగు సినిమా పెద్దగా అన్నీ తానై, అందరి...