ఇదివరకంటే హీరోయిన్లు పెళ్లి అవ్వగానే తమ కెరీర్లకు స్వస్తి చెప్పేసేవారు కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. పెళ్ళైనా కానీ ఆఫర్లు బాగానే అందుకుంటున్నారు ఈ ముద్దుగుమ్మలు. పెళ్ళైనా కూడా ఇంకా అందాలు ఆరబోస్తూ కనువిందు చేస్తున్నారు. అలియా భట్ వంటి కథానాయికలు తల్లైనా కూడా గ్లామరస్ ఫోటోషూట్ లు చేస్తున్నారు.
పెళ్లయ్యాక నటన విషయంలో సౌత్ ఇండస్ట్రీ కూడా పురోగమించింది కానీ పెళ్లయ్యాక గ్లామర్ ఒలకబోయడం విషయంలో మాత్రం అంత ఓపెన్ అవ్వలేకపోతున్నారు. రీసెంట్ గా ప్రణీత ఉదంతాన్ని తీసుకోండి. ఇటీవలే ప్రణీత బాత్ టబ్ లోకి దిగి ఫోటోషూట్ చేసింది.
నిజానికి అదేమంత ఇబ్బందికరమైన ఫోటోషూట్ కాదు. ప్రణీత అందులో క్యూట్ గా కూడా ఉంది. ఐతే ఇటీవలే తల్లైన ప్రణీత గ్లామర్ ఫోటోషూట్ చేయడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఒక వర్గం మాత్రం పెళ్ళైతే ఏంటి. తల్లయితే ఏంటి? బాత్ టబ్ లో దిగకూడదా అంటూ కౌంటర్ ఎటాక్ ఇస్తున్నారు.