సినీ నటుడు ప్రకాష్ రాజ్, మెగాస్టార్ చిరంజీవికి అత్యంత సన్నిహితుడు. పవన్ కళ్యాణ్‌కి కూడా అత్యంత సన్నిహితుడే. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల్లో, ప్రకాష్ రాజ్ తరఫున బలంగా నిలబడ్డారు నాగబాబు.
మరి, ప్రకాష్ రాజ్ ఎందుకు ఎప్పుడూ పవన్ కళ్యాణ్‌కి వ్యతిరేకంగా మాట్లాడుతుంటాడు.? పైగా, సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ ఎక్కడ ఏం మాట్లాడినా, ప్రకాష్ రాజ్ ఎందుకు ఒళ్ళు మండించుకుంటుంటాడు.? అసలేంటి ప్రకాష్ రాజ్ సమస్య.?
ప్రకాష్ రాజ్, నిన్న మొన్నటివరకూ బెంగళూరు రాజకీయాలపై ఆసక్తి ప్రదర్శించేవాడు. ఆయన గతంలో లోక్ సభకు పోటీ చేసి ఓడిపోయాడు కూడా. తెలంగాణ రాజకీయాల్లోనూ ఆ మధ్య చురుగ్గా వుండేవాడు. ఇప్పుడైతే, తమిళ రాజకీయాలకి అతుక్కుపోయాడు ప్రకాష్ రాజ్.
నిజానికి, ప్రకాష్ రాజ్ వల్ల తెలంగాణలో గులాబీ పార్టీకి ఏమీ ఒరగలేదు.. పైగా, నష్టం జరిగింది కూడా. గులాబీ పార్టీ మునిగిపోయాక, ప్రకాష్ రాజ్ ‘ఔట్’ అయిపోయాడు. ప్రకాష్ రాజ్ అంటే, ఐ-ప్యాక్ టీమ్‌లో ఓ కూలీ.. అనుకోవచ్చని కొందరు అంటుంటారు.
ప్రస్తుతం ప్రకాష్ రాజ్, ట్విట్టర్ వేదికగా పవన్ కళ్యాణ్ మీద వేస్తున్న ట్వీట్లు చూస్తోంటే, ఔను కదా, పేటీఎం కూలీనే కదా.. అనే భావన మరింత బలపడుతుంది. మాతృ భాషతోపాటు మరిన్ని భాషలు నేర్చుకుంటే మంచిది.. అని ‘జనసేన ఆవిర్భావ సభ జయకేతనం’లో పవన్ కళ్యాణ్ చెప్పారు. ఇందులో ప్రకాష్ రాజ్‌కి చాలా తప్పు కనిపించింది.
హిందీని, బలవంతంగా రుద్దడమేంటి.? మా మాతృ భాష, మా మాతృ భూమి.. అందుకు ఒప్పుకోదంటూ ట్వీటేశాడు. ప్రకాష్ రాజ్ మాతృ భాష ఏంటి.? మాతృ భూమి ఏంటి.? తమిళ రాజకీయ పార్టీల తరఫున ప్రకాష్ రాజ్ ఎందుకు వకాల్తా పుచ్చుకుంటున్నాడు.? హిందీని, బలవంతంగా రుద్దడంపై పవన్ కళ్యాణ్ కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తారు. ఆ విషయం ప్రకాష్ రాజ్‌కీ తెలుసు.. తెలిసీ, ప్రకాష్ రాజ్ వక్రీకరణలకు దిగుతున్నాడు.
యాక్టివ్ పాలిటిక్స్‌లో ప్రకాష్ రాజ్ ప్రభావం జస్ట్ జీరో.! కానీ, పవన్ కళ్యాణ్‌కి వ్యతిరేకంగా ఏదన్నా వాగితే, ఏదన్నా ట్వీటేస్తే.. తనకు కొన్ని పనికిమాలిన రాజకీయ పార్టీల నుంచీ, పనీ పాటా లేని సోషల్ కూలీల నుంచీ మద్దతు లభిస్తుందనే పిచ్చితనంలో బతికేస్తుంటాడు ప్రకాష్ రాజ్. సోషల్ మీడియా పరిజ్ఞానంలో చెప్పాలంటే, ఇవి రీచ్ కష్టాలు.!
సనాతన ధర్మాన్ని భారత దేశంలో లేకుండా చేస్తానని డీఎంకే నేత, తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయ నిధి స్టాలిన్ ఓ సందర్బంలో చెప్పాడు. కానీ, వేల ఏళ్ళుగా భారతావనిలో వర్ధిల్లుతున్న సనాతన ధర్మానికి జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బ్రాండ్ అంబాసిడర్‌గా మారుతున్నారు.
హిందూ మతంపై నరనరానా ద్వేషం పెంచేసుకోవడం వల్ల ప్రకాష్ రాజ్, సహజంగానే సనాతన ధర్మ పరిరక్షకుడిగా మారిన పవన్ కళ్యాణ్ మీద ద్వేషం పెంచేసుకున్నారు. అదే సమయంలో, ఆ సనాతన ధర్మాన్ని నాశనం చేస్తానన్న ఉదయ నిధి స్టాలిన్ పంచన చేరిపోయాడు ప్రకాష్ రాజ్.
హిందీ జాతీయ భాష కాదు.! ఇంగ్లీషు ఏమైనా జాతీయ భాషా.? కాదు కదా.! నేర్చుకుంటున్నాం కదా.? మాతృ భాష సహా, వీలైనన్ని ఎక్కువ భాషలు నేర్చుకుంటే, ప్రాంతాలకతీతంగా కమ్యూనికేషన్ పెరుగుతుందంతే. ఇదే పవన్ కళ్యాణ్ చెప్పింది.
ఎక్కువ భాషల్లో అనర్గళంగా మాట్లాడటం అనేది సినీ నటుడిగా ప్రకాష్ రాజ్‌కి ఎంతో అడ్వాంటేజ్ అయ్యింది. ఆ విషయం తెలియనంత అమాయకుడా ప్రకాష్ రాజ్.? పవన్ కళ్యాణ్‌కి వ్యతిరేకంగా కామెంట్లు పోస్ట్ చేస్తే, రీచ్ పెరుగుతుందనే పిచ్చి భ్రమల్లో వున్న ప్రకాష్ రాజ్ తెలుసుకోవాల్సింది ఏంటంటే.. వీటి వల్ల ప్రకాష్ రాజ్ తన స్థాయి తానే తగ్గించేసుకుంటున్నాడని.!
తమిళనాడు – కర్నాటక మధ్య నీటి పంపకాల విషయమై వివాదం వుంది. కన్నడిగుడిగా, తమిళనాడు ప్రభుత్వాన్ని నడుపుతున్న ఉదయ నిధి స్టాలిన్‌తో మాట్లాడి, ఆ సమస్యని పరిష్కరించడంపై ప్రకాష్ రాజ్ ఫోకస్ పెట్టొచ్చు కదా.? ఇంకా నయ్యం.. అంత సీన్, ప్రకాష్ రాజ్‌కి ఎక్కడిది.?
పనికిమాలిన వ్యవహారాల మీద పాండిత్యం చూపించడానికి మాత్రం ఎగేసుకుంటూ వచ్చేస్తాడాయన.