Switch to English

‘మా’లో ప్రకంపనలు..! గెలిచిన ప్రకాశ్ రాజ్ ప్యానెల్ సభ్యులు రాజీనామా

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,467FansLike
57,764FollowersFollow

‘మా’ ఎన్నికల ఘట్టం జరిగినంతవరకూ ఎంత రచ్చ జరిగిందో తెలిసిందే. ఎన్నికలు ముగిసాయి.. అంతా సద్దుమణిగిందని అనుకుంటున్న పరిస్థితుల్లో ఇప్పుడు మా ఎన్నికల అంశం మరో సంచలనానికి తెర తీసింది. తన ప్యానెల్ నుంచి గెలిచిన 11 మంది సభ్యులు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి ప్రకంపనలు రేపారు ప్రకాశ్ రాజ్. మంగళవారం ఏర్పాటు చేసిన ఆయన మీడియాతో ఆయన మాట్లాడారు. ‘రెండు మూడు రోజుల నుంచి జరుగుతున్న సంఘటనలపై కూర్చొని చర్చించాం. ‘మా’ మంచి కోసమే పోటీలో నిలిచాం. తొలి నుంచీ ఒకే ప్యానెల్ వుండాలని ప్రచారం చేశాం. కానీ క్రాస్ ఓటింగ్  జరిగింది. ఎన్నికలు జరిగిన విధానంపై గెలిచిన, ఓడిపోయిన సభ్యులతో చర్చించాం. చాలా రౌడీయిజం జరిగింది. మాటల యుద్ధం, పోస్టల్ బ్యాలెట్స్‌ కౌంటింగ్ లో అన్యాయం జరిగింది.

అయినా ఎన్నికలు అపకూడదనే ముందుకు వెళ్లాం. వేరే వూళ్ల నుంచి మనుషులను తీసుకొచ్చారు. డీఆర్‌సీ చీఫ్‌గా వున్న మోహన్ బాబు కౌంటింగ్‌కు వచ్చారు. క్రమశిక్షణ లేకుండా సీనియర్ నటుడు బెనర్జీపై చేయి చేసుకున్నారు. అసభ్య పదజాలంతో మాట్లాడారు. నరేశ్ ప్రవర్తన బాలేదు. ఈసీ రిజల్ట్స్ పక్కనబెట్టారు. మరుసటి రోజు పోస్టల్ బ్యాలెట్లు కలపడం వంటి చర్యలతో లెక్కలు మారాయి. ఆదివారం గెలిచినవారు.. సోమవారం ఎలా ఓడిపోయారు..? అందరినీ కలుపుకుని వెళ్తామన్న విష్ణు.. జనరల్ సెక్రటరీ, ట్రెజరీ మనవాడేనని.. ఎవడు అడ్డొచ్చినా మాదే మెజార్టీ అని ఎలా అన్నారు. విష్ణు మాటలకు చాలా బాధేసింది. మీరూ.. మేమూ అంటే కలిసి పనిచేయగలమా..? సగం సగం ప్యానెల్ వస్తే ఏం జరిగిందో గడిచిన రెండేళ్లలో చూస్తూనే వున్నాం.

‘మా’ అసోసియేషన్ మసకబారిందనే వరకు పరిస్ధితి వచ్చేసింది. నాకు కావాల్సింది అది కాదు. ఇలా వుంటే మీతో కలిసి పని చేయగలమా..? అని నా ప్యానెల్ సభ్యులు అడిగారు. ‘మా’ సంక్షేమ కార్యక్రమాలు ఆగిపోతాయా అన్న భయం వేసింది. విష్ణు బాగా పనిచేయాలనే ఉద్దేశంతో.. ఆయన హామీలకు అడ్డు రాకూడదని.. ఒకవేళ ఎలాంటి పని జరగకపోయినా తమపై నిందలు వేయకుండా ఈ నిర్ణయం తీసుకున్నాం. ఎంతో ఆలోచించిన తర్వాత సినిమా బిడ్డలు ప్యానెల్ నుంచి గెలిచిన 11 మంది రాజీనామా చేస్తున్నాం. మీకు కావాల్సిన వాళ్లని పెట్టుకుని ఫ్రీగా పనిచేయండి. ఓటేసిన మా సభ్యులకు న్యాయం జరగాలనేదే మా ఆకాంక్ష. వారికి ఎలాంటి సంక్షేమం అందుతుందో చూస్తూ వుంటాం.

ఒకవేళ మీరు పనిచేయకపోతే వారి తరపున మేము ప్రశ్నిస్తాం. అలాగని.. మీ పనులకు అడ్డురాము. అసోసియేషన్ లో ఉండి పనిచేయడం కంటే.. గొప్ప పనిని చేయించడమే ఉత్తమం. నా రాజీనామాను ఆమోదించనని విష్ణు చెప్పారు. కానీ.. ‘మా’ నిబంధనల్లో తెలుగువాడు కానీ వాడు ఓటు వేసేందుకు, మరొకరిని గెలిపించేందుకు మాత్రమే అని.. పోటీ చేసేందుకు వీలు లేదనే నిబంధనను మారిస్తే నా రాజీనామాను వెనక్కి తీసుకుంటాను’ అని అన్నారు.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Nani: ‘జెర్సీ’ @5..! ధియేటర్లో సినిమా చూసిన నాని.. ఎమోషనల్ పోస్ట్

Nani: నాని (Nani) హీరోగా గౌతమ్ తిన్ననూరి (Gowtham Thinnanuri) దర్శకత్వంలో వచ్చిన ‘జెర్సీ’ (Jersey) విడుదలై నిన్నటికి 5ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సినిమాను...

Upasana: ఆవకాయ పట్టిన అత్తమ్మ.. ఆటపట్టించిన ఉపాసన.. వీడియో వైరల్  

Upasana: టాలీవుడ్ (Tollywood) లో మెగా ఫ్యామిలీ (Mega Family) అంటే ఒక సందడి. ఒక బ్రాండ్. ముఖ్యంగా చిరంజీవి (Chiranjeevi). ఆయనొక ఇన్ స్పిరేషన్...

Puri Jagannadh: ఎవరు కొడితే బొమ్మ బ్లాక్ బస్టరవుద్దో.. అతనే ‘పూరి...

Puri Jagannadh: సినిమాకి హీరోకి ఉండే క్రేజే వేరు. సరైన సినిమాపడి స్టార్ స్టేటస్ వస్తే ఫ్యాన్స్ పెరుగుతారు.. డెమీ గాడ్ కూడా అయిపోతాడు. హీరో...

Harish Shankar: చోటా కె.నాయుడుపై హరీశ్ శంకర్ ఆగ్రహం.. బహిరంగ లేఖ

Harish Shankar: టాలీవుడ్ (Tollywood) సీనియర్ స్టార్ సినిమాటోగ్రాఫర్ చోటా కె.నాయుడు (Chota K Naidu) పై బ్లాక్ బస్టర్ దర్శకుడు హరీశ్ శంకర్ (Harish...

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్...

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad...

రాజకీయం

ఏపీలో బీజేపీని ఓడించేయనున్న బీజేపీ మద్దతుదారులు.!

ఇదో చిత్రమైన సందర్భం.! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి, ఆ పార్టీ మద్దతుదారులే శాపంగా మారుతున్నారు. అందరూ అని కాదుగానీ, కొందరి పైత్యం.. పార్టీ కొంప ముంచేస్తోంది.! టీడీపీ - బీజేపీ...

వ్యూహకర్తల మాటే శాసనం.. వారిదే పెత్తనం

దేశ రాజకీయాల్లో వ్యూహకర్తల పాత్ర రోజురోజుకి పెరిగిపోతోంది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించి ఎత్తుకు పై ఎత్తులు వేసే రోజులు పోయాయి. మరి ముఖ్యంగా ప్రచార పర్వాన్ని వ్యూహకర్తలే శాసిస్తున్నారు....

కులాంతరంలో కూడా రాజకీయ క్రీడ.!

ప్రజల నుంచి ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోవాలి అంటే.. ప్రజలందరికి మంచి చెయ్యటం వ్యక్తులకి సాధ్యం కాదు. అందుకని మనుషులని ఎదో ఒకరకంగా కూడగట్టాలి. ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలు, రైతులు, కార్మికులు, విద్యార్థులు,...

ఎన్డిఏ కూటమి అభ్యర్థులను గెలిపించండి.. అభిమానులకు మెగాస్టార్ పిలుపు

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు సీఎం రమేష్, పంచకర్ల రమేష్ బాబును గెలిపించాలంటూ మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi) తన అభిమానులకు పిలుపునిచ్చారు. ఏపీలో చంద్రబాబు నాయుడు,...

నర్సాపురం అసెంబ్లీ గ్రౌండ్ రిపోర్ట్: ఎడ్జ్ జనసేన పార్టీకే.!

2024 ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నర్సాపురం కూడా ఒకింత హాట్ టాపిక్ అవుతున్న నియోజకవర్గమే. నర్సాపురం లోక్ సభ నియోజకవర్గం అలాగే, ఆ పరిధిలోని నర్సాపురం అసెంబ్లీ నియోజకవర్గం.. ఈ...

ఎక్కువ చదివినవి

‘గులక రాయి’ ఘటనలో సమాచారమిస్తే రెండు లక్షల బహుమతి.!

ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ శాఖ, రెండు లక్షల రూపాయల నజరానా ప్రకటించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విజయవాడ నగరంలో జరిగిన దాడికి సంబంధించి సరైన సమాచారం ఇచ్చినవారికి ఈ...

గ్రౌండ్ రిపోర్ట్: నగిరిలో రోజా పరిస్థితేంటి.?

ముచ్చటగా మూడోసారి నగిరి నియోజకవర్గం నుంచి రోజా గెలిచే అవకాశాలున్నాయా.? అంటే, ఛాన్సే లేదంటోంది నగిరి ప్రజానీకం.! నగిరి వైసీపీ మద్దతుదారులదీ ఇదే వాదన.! నగిరి నియోజకవర్గంలో రోజాకి వేరే శతృవులు అవసరం...

ఎన్డిఏ కూటమి అభ్యర్థులను గెలిపించండి.. అభిమానులకు మెగాస్టార్ పిలుపు

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు సీఎం రమేష్, పంచకర్ల రమేష్ బాబును గెలిపించాలంటూ మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi) తన అభిమానులకు పిలుపునిచ్చారు. ఏపీలో చంద్రబాబు నాయుడు,...

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై సందీప్ రెడ్డి ఆగ్రహం.. కారణం ఇదే

Sandeep Reddy Vanga: 5ఏళ్ళ క్రితం సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘కబీర్ సింగ్’ (Kabir Singh). సినిమాలో డీన్ పాత్ర పోషించిన బాలీవుడ్...

కూలీలపై హత్యా నేరం మోపుతారా.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విజయవాడ నగరం నడిబొడ్డున హత్యాయత్నం జరిగిందంటూ వైసీపీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారం సందర్భంగా, గుర్తు తెలియని వ్యక్తి విసిరిన...