నటుడు, రాజకీయ నాయకుడు ప్రకాష్ రాజ్ గత రెండు రోజులుగా ఎర్రవెల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్ లో ముఖ్యమంత్రిని కలుస్తుండడం చర్చనీయాంశం అవుతోంది. నిన్న ఎర్రవెల్లిలో కొంత సమయం గడిపిన ప్రకాష్ రాజ్, ఈరోజు కూడా కలిసినట్లు తెలుస్తోంది.
రాజ్యసభ ఎన్నికలు నిర్వహించడానికి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెల్సిందే. దీని ప్రకారం తెలంగాణలో 3 రాజ్యసభ సీట్స్ ను ఫిల్ చేయాల్సి ఉంది. ఇందులో ఒక సీట్ కు ప్రకాష్ రాజ్ ను నామినేట్ చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. గత కొంత కాలంగా తెలంగాణ ముఖ్యమంత్రితో ప్రకాష్ రాజ్ సన్నిహితంగా ఉంటున్నారు.
రెండు నెలల క్రితం కూడా కేసీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రిని కలవడానికి కేసీఆర్ వెళ్ళినప్పుడు కూడా కూడా ప్రకాష్ రాజ్ ఉన్నారు. అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.