మా పేరెంట్స్ నన్ను షూటింగ్‌లో చూసిన క్షణం మరచిపోలేను: ప్రదీప్ కొట్టె

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

92,669FansLike
57,764FollowersFollow
హీరో కిరణ్ అబ్బవరం సమైరా స్టూడియోస్‌తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మించిన ‘తిమ్మరాజుపల్లి టీవీ’ సినిమా ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందిన విషయం తెలిసిందే. గ్రామీణ నేపథ్యంలో రూపొందిన ఈ పీరియాడిక్ డ్రామాకు వి. మునిరాజు దర్శకత్వం వహించగా, తేజ వేల్పుచర్ల సహ నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమా మే 15 నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్‌కు రానున్న సందర్భంగా ఇందులో రాజప్ప పాత్రలో నటించిన ప్రదీప్ కొట్టె తన సినీ ప్రయాణం, వ్యక్తిగత అనుభవాలు, కెరీర్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
మా పేరెంట్స్ నన్ను షూటింగ్‌లో చూసిన క్షణం మరచిపోలేను: ప్రదీప్ కొట్టె

చిత్తూరు జిల్లా పలమనేరు తన స్వస్థలం అని చెప్పిన ప్రదీప్ కొట్టె.. మొదట చెన్నైలో ఉద్యోగం చేసి, తర్వాత హైదరాబాద్‌కు వచ్చానన్నారు. హైదరాబాద్‌కు వచ్చిన తర్వాత షార్ట్ ఫిల్మ్స్ ద్వారా నటన వైపు అడుగులు పడ్డాయని తెలిపారు. బీ స్టూడియోలో బషీర్ మాస్టర్ ఆధ్వర్యంలో నాటకాలు వేసిన సమయంలో దర్శకుడు వి. మునిరాజు తన నటనను గమనించారని చెప్పారు. ‘తిమ్మరాజుపల్లి టీవీ’లో రాజప్ప పాత్ర కోసం ఆడిషన్ నిర్వహించారని, తర్వాత ఈ సినిమాకు కిరణ్ అబ్బవరం నిర్మాత అని తెలిసినప్పుడు మరింత నమ్మకం వచ్చిందని అన్నారు.

‘తిమ్మరాజుపల్లి టీవీ’లో చేసిన రాజప్ప పాత్ర తనకు మంచి గుర్తింపు తీసుకొచ్చిందని ప్రదీప్ చెప్పారు. ఆ పాత్రలో ఎన్నో వేరియేషన్స్ ఉండటంతో నటుడిగా తన ప్రతిభను చూపించే అవకాశం దక్కిందన్నారు. షార్ట్ ఫిల్మ్స్, ఇండిపెండెంట్ సినిమాలు చేసినా.. ప్రేక్షకులు తనను పెద్ద తెరపై తొలిసారి గుర్తించింది ఈ సినిమాతోనే అని తెలిపారు.

మా పేరెంట్స్ నన్ను షూటింగ్‌లో చూసిన క్షణం మరచిపోలేను: ప్రదీప్ కొట్టె

ఉద్యోగం చేస్తూనే సినిమా అవకాశాల కోసం ప్రయత్నించడం అంత సులభం కాదని ఆయన పేర్కొన్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్, లీవ్స్ సహాయంతో ఈ సినిమా షూటింగ్‌ను పూర్తి చేశానన్నారు. గత పదేళ్లుగా ఉద్యోగం, నటన రెండింటినీ సమతుల్యం చేస్తూ వచ్చానని చెప్పారు. ఈ ప్రయాణంలో కుటుంబ సభ్యుల మద్దతు ఎంతో ముఖ్యమైందని, ముఖ్యంగా తన భార్య అందించిన సహకారం ఎప్పటికీ మరచిపోలేనిదని భావోద్వేగంగా చెప్పారు.

తనకు చిన్నప్పటి నుంచే సినిమాలంటే ఇష్టమని, అయితే అది ప్యాషన్ అని మాత్రం ఇంజినీరింగ్ రోజుల్లో ఓ షార్ట్ ఫిల్మ్ చేసిన తర్వాతే అర్థమైందన్నారు. షార్ట్ ఫిల్మ్స్ చేసే రోజుల నుంచే కిరణ్ అబ్బవరం తనకు తెలుసని, అప్పట్లోనే ఆయనకు ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేదని చెప్పారు. ప్రతి క్రాఫ్ట్‌పై పట్టుతో కష్టపడి ఈ స్థాయికి వచ్చారని కిరణ్ అబ్బవరం గురించి ప్రశంసించారు.

మా పేరెంట్స్ నన్ను షూటింగ్‌లో చూసిన క్షణం మరచిపోలేను: ప్రదీప్ కొట్టె

థియేటర్ డ్రామాల వల్ల కెమెరా భయం పూర్తిగా పోయిందని ప్రదీప్ తెలిపారు. కెమెరా ముందు ఎలా నటించాలి, డైలాగ్ డెలివరీ, డిక్షన్ ఎలా ఉండాలి అన్న విషయాలు నాటకాల ద్వారా నేర్చుకున్నానన్నారు. ఒకే నాటకంలో గంటన్నర పాటు ఐదు పాత్రలు పోషించిన అనుభవం తనకు ఎంతో ఉపయోగపడిందని చెప్పారు. దర్శకుడు మునిరాజు ప్రతి సీన్‌ను చాలా డీటైల్డ్‌గా వివరించేవారని, వర్క్‌షాప్స్ కూడా ఎంతో హెల్ప్ అయ్యాయని తెలిపారు.

‘తిమ్మరాజుపల్లి టీవీ’లో నటించిన ప్రతి పాత్ర ప్రేక్షకులపై ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందని ప్రదీప్ అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా సాయి తేజ్, లతీష్ వంటి నటుల పాత్రలు తనకు చాలా నచ్చాయని చెప్పారు. షూటింగ్ సమయంలో చాలామంది ఆర్టిస్టులు సింగిల్ టేక్‌లలోనే సీన్స్ పూర్తి చేశారని గుర్తుచేశారు.

మా పేరెంట్స్ నన్ను షూటింగ్‌లో చూసిన క్షణం మరచిపోలేను: ప్రదీప్ కొట్టె

తన జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని ఒక సంఘటనను కూడా ప్రదీప్ పంచుకున్నారు. తాను యాక్టింగ్ వైపు ఉన్నానన్న విషయం ఇంట్లో ఎవరికీ పూర్తిగా తెలియదని చెప్పారు. కేవలం తన అక్కకు మాత్రమే కొంత సమాచారం ఉండేదన్నారు. ఒకసారి షూటింగ్‌కు తన తల్లిదండ్రులను చెప్పకుండా తీసుకొచ్చారని, అక్కడ తనను వారు చూడటం, వారిని తాను చూడటం జీవితాంతం గుర్తుండిపోయే మెమరబుల్ మూమెంట్ అని భావోద్వేగంగా చెప్పారు.

ప్రస్తుతం కొన్ని కథలు వింటున్నానని, అయితే ఏ పాత్ర వచ్చినా చేయాలనే ఆలోచన లేదని ప్రదీప్ కొట్టె స్పష్టం చేశారు. కథలో ప్రాధాన్యత ఉన్న పాత్రలకే ప్రాధాన్యం ఇస్తానని, మంచి అవకాశాల కోసం ఎదురుచూస్తున్నానన్నారు.

మా పేరెంట్స్ నన్ను షూటింగ్‌లో చూసిన క్షణం మరచిపోలేను: ప్రదీప్ కొట్టె

సినిమా

సొంత ఊరికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న విజయ్ దేవరకొండ.. 180 మంది...

హీరో విజయ్ దేవరకొండ తన సొంత ప్రాంతానికి ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ విద్యారంగంలో మరో ప్రశంసనీయ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ది దేవరకొండ ఫౌండేషన్ ఆధ్వర్యంలో...

అచ్చంపేట వేదికగా విజయ్-రష్మిక మధుర క్షణాలు.. సోషల్ మీడియాలో ‘కపుల్ గోల్స్’...

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు స్కాలర్‌షిప్‌ల పంపిణీ కార్యక్రమం కోసం అచ్చంపేటకు వెళ్లిన సినీ జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న మరోసారి అభిమానుల దృష్టిని ఆకర్షించారు....

బుచ్చిబాబు క్షమాపణలపై అనంత శ్రీరామ్ వ్యాఖ్యలు.. ఆసక్తికర చర్చకు దారితీసిన స్పందన

పెద్ది సినిమాలో జాన్వీ కపూర్ పాత్రకు సంబంధించిన వివాదం నేపథ్యంలో దర్శకుడు బుచ్చిబాబు చేసిన క్షమాపణలపై ప్రముఖ గేయరచయిత అనంత శ్రీరామ్ స్పందించారు. ఈ విషయంపై...

పెద్ది చిత్రానికి మరో కొత్త ఆకర్షణ.. బుధవారం నుంచి ఎక్స్‌టెండెడ్ కట్

ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందుతున్న పెద్ది సినిమాకు ఇప్పుడు మరో ప్రత్యేక ఆకర్షణ జోడించబడుతోంది. చిత్ర బృందం తాజా ప్రకటన ప్రకారం, బుధవారం నుంచి...

Vijay Devarakonda: ఊరికిచ్చిన హామీని నిలబెట్టుకున్న విజయ్ దేవరకొండ

Vijay Devarakonda: ఇటివల హీరో విజయ్ దేవరకొండ ఓ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. విజయ్ తండ్రి స్వగ్రామమైన నాగర్ కర్నూల్ జిల్లా తుమ్మన్ పేటలోని...

రాజకీయం

సేన ప్రస్థానం.. జాతీయ సమైక్యత కోసం: ఢిల్లీలో జనసేన కీలక సమావేశం

జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ సోమవారం దేశ రాజధాని ఢిల్లీలో పార్టీ ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. "సేన ప్రస్థానం... జాతీయ...

తుని చిన్నారి ఆచూకీపై పవన్ కళ్యాణ్ ఆందోళన.. గాలింపును వేగవంతం చేయాలని ఆదేశం

కాకినాడ జిల్లా తుని మండలంలోని సీహెచ్ అగ్రహారంలో వారం రోజుల క్రితం అదృశ్యమైన చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ కోసం జరుగుతున్న గాలింపు చర్యలపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరోసారి సమీక్ష...

డీఎస్సీ వివాదం.. లోకేశ్‌ను టార్గెట్ చేస్తున్న వైసీపీపై రాజకీయ చర్చ

ఆంధ్రప్రదేశ్‌లో మెగా డీఎస్సీ నియామకాల అంశం మరోసారి రాజకీయ చర్చకు కేంద్రబిందువుగా మారింది. డీఎస్సీ ప్రక్రియలో అక్రమాలు జరిగాయని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సహా వైసీపీ నేతలు ఆరోపిస్తుండగా, కూటమి...

పైకి సింగిల్‌ సింహం… లోపల డబుల్‌ గేమ్‌?

రాజకీయాల్లో మాటలు ఒకలా, వ్యూహాలు మరోలా ఉండటం కొత్త విషయం కాదు. అయితే "సింహం సింగిల్‌గా వస్తుంది" అనే నినాదాన్ని ఎన్నో ఏళ్లుగా ప్రచారం చేసుకున్న వైసీపీ ఇప్పుడు రాజకీయ వాస్తవాల ముందు...

వెన్నుపోటు ఎవరు చేశారు?.. వైసీపీపై అప్పసాని రాజేష్ విమర్శలు

ఏపీలో ఎన్‌డిఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తైన సందర్భంగా నిర్వహిస్తున్న కార్యక్రమాల నేపథ్యంలో వైసీపీపై,  తెలుగుదేశం  పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అప్పసాని రాజేష్ తీవ్ర విమర్శలు చేశారు. ‘రెండేళ్ల నమ్మకం,...

ఎక్కువ చదివినవి

ఎవరు ఎవరిని పెద్దవారిని చేస్తున్నారు? ఏది మంచి? ఏది చెడు?

ఇది ఒక చిత్రం!: ఇటీవల ఓ యూఎస్‌ బేస్డ్‌ రివ్యూయర్‌ చుట్టూ సోషల్ మీడియాలో, సినీ వర్గాల్లో జరుగుతున్న హడావిడి చూస్తుంటే ఒక ప్రశ్న వస్తోంది. నిజంగా అతడిని పెద్దవాడిని చేస్తున్నది ఎవరు? ఒక సినిమా...

ఈడీ దూకుడు.. ఏపీ లిక్కర్ కేసులో కీలక అరెస్టులు, సోదాలు

ఆంధ్రప్రదేశ్‌లో గత ప్రభుత్వ హయాంలో జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న లిక్కర్ సరఫరా వ్యవహారంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) దర్యాప్తు వేగం పెంచింది. మద్యం రవాణా, సరఫరా ఒప్పందాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపణల నేపథ్యంలో...

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదం బాధాకరం.. బాధితులను పరామర్శించనున్న నారా లోకేష్

విశాఖ స్టీల్ ప్లాంట్‌లో జరిగిన విషాదకర ప్రమాదంలో కార్మికులు మృతిచెందడం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన...

Ramayana: ‘రామాయణ’ సినిమాలో మరో అగ్ర నటి..! ఆసక్తి రేపుతున్న అప్డేట్

Ramayana: భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత భారీ ఖర్చుతో తెరకెక్కుతున్న సినిమా ‘రామాయణ’. రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తున్న సినిమా ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా...

పెద్ది బ్లాక్‌బస్టర్ తర్వాత జాన్వీ కపూర్‌కు రూ.8 కోట్ల పారితోషికం!

పెద్ది చిత్రానికి హీరోయిన్ జాన్వీ కపూర్‌కు తొలుత రూ.6 కోట్ల పారితోషికం ఖరారు చేసినట్లు సమాచారం. అయితే సినిమా విజయవంతమైన ప్రదర్శన అనంతరం ఆమెకు తుది సెటిల్‌మెంట్‌గా రూ.8 కోట్లు చెల్లించినట్లు తెలుస్తోంది....