గత కొన్నాళ్లుగా బాలీవుడ్ కమర్షియల్ దర్శకుడు సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ఒక సినిమా రూపొందబోతుంది అంటూ వార్తలు వస్తున్నాయి. సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో ప్రభాస్ చేయబోతున్న సినిమా కు సంబంధించి మరో ఆసక్తికర ప్రచారం జరుగుతోంది.
తాజాగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతల్లో ఒక్కరు అయిన నవీన్ ఎర్నేని ముంబైలో సిద్దార్థ్ ఆనంద్ ను కలిశాడు. ఇటీవలే పఠాన్ సినిమాతో భారీ కమర్షియల్ విజయాన్ని సొంతం చేసుకున్న సిద్దార్ ఆనంద్ ను మైత్రి మూవీ మేకర్స్ తరపున నవీన్ అభినందించారు. అదే సమయంలో మైత్రి మూవీస్ లో సిద్దార్థ్ ఆనంద్ సినిమాను కన్ఫర్మ్ చేశారు.
ప్రభాస్ హీరో సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ వారు సినిమాను నిర్మించబోతున్నారు అంటూ తాజా పరిణామాలతో అభిమానుల్లో చర్చ జరుగుతోంది. పఠాన్ సినిమా వెయ్యి కోట్ల వసూళ్ల దిశగా దూసుకు పోతున్న నేపథ్యంలో ప్రభాస్ తో సిద్దార్థ్ ఆనంద్ సినిమా కోసం ఫ్యాన్స్ తో పాటు దేశ వ్యాప్తంగా సినీ అభిమానులు వెయిట్ చేస్తున్నారు.