Prabhas: బాక్సాఫీస్ వద్ద ప్రభాస్ నటించిన కల్కి భారీ విజయం నమోదు చేసింది. ఈ ఆనందంలో ఉన్న ప్రభాస్ కు మరో సంతోషకరమైన వార్త అందింది. ప్రముఖ మీడియా సంస్థ ఆర్మాక్స్ విడుదల చేసిన మోస్ట్ పాపులర్ హీరోస్ లిస్టులో ఆయన టాప్ వన్ లో నిలిచారు. కొన్ని నెలలుగా ఆయన ఈ ఘనత సాధిస్తూండటం గమనార్హం.
మే నెలలో ఇదే సంస్థ విడుదల చేసిన జాబితాలోనూ ఆయన టాప్ లో నిలిచారు. జూన్ లోనూ అదే జోరు కొనసాగిస్తూండటం విశేషం. కల్కి సాధించిన విజయం ఇందుకు దోహదపడిండని చెప్పాలి. ఇక రెండో స్థానంలో షారుఖ్ ఖాన్ నిలిచారు. నాలుగు, అయిదు, ఆరు స్థానాల్లో అల్లు అర్జున్, ఎన్టీఆర్, మహేశ్ నిలిచారు.
రామ్ చరణ్ తొమ్మిదో స్థానంలో నిలిచారు. హీరోయిన్లలో అలియా భట్ టాప్ లో నిలవగా.. సమంత, దీపికా పదుకొణే వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. కెరీర్, సక్సెస్, పాపులారిటీ ఆధారంగా ఈ ర్యాంకులు ఇస్తారు.
Ormax Stars India Loves: Most popular male film stars in India (Jun 2024) #OrmaxSIL pic.twitter.com/ghuiir9wgG
— Ormax Media (@OrmaxMedia) July 21, 2024