రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ సలార్ ఈ సెప్టెంబర్ 28న విడుదల కావాల్సి ఉంది కానీ పెండింగ్ పనుల వలన ఈ డేట్ నుండి వాయిదా వేస్తున్నట్లు నిర్మాణ సంస్థ అధికారికంగా వెల్లడించిన విషయం తెల్సిందే.
కొత్త రిలీజ్ డేట్ పై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సంక్రాంతికి అన్నారు, మార్చ్ అంటున్నారు, లేదా సమ్మర్ కైనా రావొచ్చు. అది పక్కనపెడితే ఇప్పుడు సలార్ షూటింగ్ ఈరోజు నుండి తిరిగి మొదలైనట్లు తెలుస్తోంది. కొన్ని పెండింగ్ పోర్షన్స్ ను పూర్తి చేస్తున్నారు. అయితే ఈ షెడ్యూల్ లో ప్రభాస్ పాల్గొనట్లేదు.
రీసెంట్ గా ప్రభాస్ మోకాలికి శస్త్రచికిత్స జరిగిన విషయం తెల్సిందే. ప్రస్తుతం రెస్ట్ మోడ్ లో ఉన్నాడు. ఇంకా సలార్ లో ఒక ఐటెం సాంగ్ ను కూడా షూట్ చేయాలిట. అన్ని ప్రొడక్షన్ పనులు అక్టోబర్ కల్లా పూర్తవుతాయని తెలుస్తోంది.