రెబల్ స్టార్ ప్రభాస్ మారుతి కాంబినేషన్ లో వస్తున్న సినిమా రాజా సాబ్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ సినిమాలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. థమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో వస్తుందని తెలుస్తుంది. దాదాపు రెండేళ్లుగా సెట్స్ మీద ఉన్న ఈ సినిమా నుంచి ఒక మోషన్ పోస్టర్, ప్రభాస్ లుక్ గ్లింప్స్ తప్ప ఎలాంటి అప్డేట్ ఇవ్వట్లేదు.
రెబల్ స్టార్ ప్రతి సినిమా విషయంలో ఫ్యాన్స్ అప్డేట్స్ కోసం ఎదురుచూస్తున్నారు. కానీ చిత్ర యూనిట్ మాత్రం సైలెంట్ గా ఉంటున్నారు. అసలు రాజా సాబ్ ఎక్కడిదాకా వచ్చింది. రిలీజ్ ఎప్పుడన్న సందేహాలు మొదలయ్యాయి. ఏప్రిల్ 10న రిలీజ్ అనౌన్స్ చేసిన మేకర్స్ ఇప్పుడు ఆ డేట్ కి రావడం కష్టమని చెబుతున్నారు.
సినిమాలో వి.ఎఫ్.ఎక్స్ వర్క్ ఎక్కువ చేయాల్సి ఉందని అందుకే రిలీజ్ ఇంకా లేట్ అవుతుందని అంటున్నారు. సినిమా రిలీజ్ డేట్ తర్వాత ముందు ఫ్యాన్స్ కి జోష్ నింపేలా అప్డేట్స్ అయినా ఇస్తారా అంటే అది లేదు. ప్రభాస్ రాజా సాబ్ విషయంలో ఏం జరుగుతుంది అంటూ రెబల్ ఫ్యాన్స్ అంతా సోషల్ మీడియాలో చర్చలు చేస్తున్నారు. ఏప్రిల్ మిస్ అయితే సెకండ్ హాఫ్ లో అంటే జూలై, ఆగష్టు రిలీజ్ ఉంటుంది. అప్పుడు రాకపోతే దసరాకి రిలీజ్ ప్లాన్ చేస్తారు. ఐతే ఆల్రెడీ దసరాకి అఖండ 2, సంబరాల ఏటిగట్టు ఇంకా మరో రెండు సినిమాలు ఉన్నాయి. సో దసరాకి రాజా సాబ్ వచ్చే ఛాన్స్ లేదు. మళ్లీ ఇయర్ ఎండింగ్ కే రిలీజ్ చేసే అవకాశాలు ఉంటాయి. మరి రాజా సాబ్ టీమ్ ఏం ఆలోచిస్తున్నారు, ఎలా ప్లాన్ చేస్తారన్నది తెలియాల్సి ఉంది.