Prabhas: మంచు విష్ణు (Manchu Vishnu) ప్రధాన పాత్రలో ముఖేశ్ కుమార్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘కన్నప్ప’ (Kannappa) . భారీ వ్యయంతో పాన్ ఇండియా ప్రాజెక్టుగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడీ సినిమాపై నెట్టింట రౌండ్ అవుతున్న క్రేజీ అప్డేట్ ఆసక్తి రేపుతోంది. సినిమాలో ప్రభాస్ కీలకపాత్రలో నటించబోతున్నాడనే వార్త సంచలనం రేపుతోంది. ఈ విషయంపై మంచు విష్ణు ‘హర హర మహాదేవ్’ అని ట్వీట్ చేయడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరుతోంది. దీంతో ప్రభాస్ శివుడిగా కినిపిస్తారనే వార్త వైరల్ అవుతోంది.
ఆదిపురుష్ లో శ్రీరాముడిగా కనిపించిన ప్రభాస్, కల్కిలో విష్ణుమూర్తిగా కనిపిస్తాడని అంటున్నారు. ఇప్పుడు శివుడి పాత్ర నిజమైతై మూడోసారి దేవుడి పాత్రలో ప్రభాస్ కనిపించినట్టవుతుందని ఫ్యాన్స్ ఆనందంలో ఉన్నారు. దీనిపై పూర్తి స్పష్టత కన్నప్ప యూనిట్ చెప్పాల్సి ఉంది. ఆగష్టులో ప్రారంభమైన కన్నప్ప షూటింగ్ ఆర్నెల్లుపాటు న్యూజిలాండ్ లో చిత్రీకరించనున్నారు. నుపూర్ సనన్ హీరోయిన్. మహాకవి ధూర్జటి రాసిన శ్రీకాళహస్తీశ్వర మహత్యంలోని ఇతివృత్తాన్ని తీసుకుని సినిమా తెరకెక్కిస్తున్నారు.
❤️ Har Har Mahadev ❤️ #Kannappa 🔥 https://t.co/GXbSbayFrX
— Vishnu Manchu (@iVishnuManchu) September 10, 2023
— Vishnu Manchu (@iVishnuManchu) September 10, 2023