Kannappa: మంచు విష్ణు ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా మూవీ ‘కన్నప్ప’. ఫాంటసీ కథాంశంతో భారీగా నిర్మిస్తున్నారు విష్ణు. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమాలో భారీతీయ చిత్ర పరిశ్రమలోని నటీనటులు నటిస్తున్నారు. సినిమాలో ప్రభాస్ నటిస్తున్నారనే విషయం తెలిసిందే. అయితే.. ప్రభాస్ లుక్ లీక్ కావడం యూనిట్ ను తీవ్రంగా కలచివేసింది. దీంతో యూనిట్ స్పందించింది. లుక్ లీక్ చేసిన వారిని కనిపెడితే రూ.5లక్షలు బహుమతి ఇస్తామని ప్రకటించింది.
‘కన్నప్ప కోసం 8ఏళ్లు ప్రాణంపెట్టి పని చేస్తున్నాం. రెండేళ్ల నుంచీ ప్రాజెక్ట్ పనులు జరుగుతున్నాయి. ఇప్పుడు కన్నప్ప నుంచి ఫొటో లీక్ కావడం మమ్మల్ని తీవ్రంగా కలచివేసింది. గ్రాఫిక్స్ కోసం కష్టపడుతున్న 2వేల మందిలో ఆందోళన నెలకొంది. ఇది మాపై ఎంతో ప్రభావం చూపిస్తోంది. మరెవరూ ఈ ఫొటో షేర్ చేయొద్దని కోరుతున్నాం. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశాం. ఫొటో లీక్ చేసిన వారిని పట్టిస్తే రూ.5లక్షలు బహుమతి ఇస్తాం. మాకు సహకరించాలని కోరుతున్నామని ప్రకటన విడుదల చేసింది.