Kalki 2898 AD : పరీక్షల సీజన్, పార్లమెంట్ ఎన్నికలు, ఐపీఎల్, టీ20 వరల్డ్ కప్ ఇలా వరుసగా ఏదో ఒక పెద్ద కారణాల వల్ల ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో గత కొన్ని నెలలుగా స్థబ్దత అనేది ఏర్పడిందని చెప్పాలి. దాదాపు మూడు నెలలుగా సినిమాల సందడి ఇండియన్ బాక్సాఫీస్ వద్ద కనిపించడం లేదు.
పెద్ద సినిమాలు ఒకటి రెండు వచ్చినా కూడా బాక్సాఫీస్ వద్ద అవి ప్రభావం చూపించలేదు. చిన్న సినిమాలు వస్తే జనాలు వాటిని పట్టించుకోలేదు. ఎట్టకేలకు ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సందడి వాతావరణం కనిపిస్తోంది. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన కల్కి రిలీజ్ తో ఇన్నాళ్ల శూన్యంకు తెర పడ్డట్లు అయ్యింది.
గతంలో ప్రతి శుక్రవారం థియేటర్ల వద్ద కనిపించే పండుగ వాతావరణం నేడు కనిపిస్తుంది. ఈ మధ్య కాలంలో హౌస్ ఫుల్ అనే పదం వినిపించలేదు. కానీ నేడు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా కల్కి విడుదల అయిన ప్రతి థియేటర్ వద్ద కూడా హౌస్ ఫుల్ బోర్డ్ లు కనిపిస్తున్నాయి.
ఇండియాస్ బిగ్గెస్ట్ మూవీ అంటూ హైప్ ఇవ్వడంతో పాటు పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్, బిగ్ బి అమితాబచ్చన్, యూనివర్శిల్ స్టార్ కమల్ హాసన్, దీపికా పదుకునే, దిషా పటానీ, విజయ్ దేవరకొండ వంటి హేమా హేమీలు నటించడం వల్ల కల్కి టాప్ ఆఫ్ ది ఇండియాగా మారింది.
సినిమాకు పాన్ వరల్డ్ మూవీ అంటూ ట్యాగ్ ఇచ్చిన దర్శకుడు, అన్నట్లుగానే ఆ స్థాయిలో తీశాడు అంటూ చూసిన ప్రేక్షకులు మరియు రివ్యూవర్స్ చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కల్కి బాక్సాఫీస్ జోరు కనీసం మూడు నుంచి నాలుగు వారాలు ఉండే అవకాశం ఉంది.