ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయిన తర్వాత సినిమాల విషయంలో చాలా జోరు చూపిస్తున్నాడు. ఒక సినిమా రిలీజ్ కాక ముందే.. మూడు నాలుగు సినిమాలను ఓకే చేసేస్తున్నాడు. ఒకేసారి రెండు, మూడు సినిమాల షూటింగ్ లు కూడా జరిపించేస్తున్నాడు. ఇప్పటికే ఆయన నుంచి ఏదో ఒక కొత్త మూవీ అప్ డేట్ వస్తూనే ఉంది. ప్రస్తుతం సలార్-2, కల్కి-2, ఫౌజీ, రాజాసాబ్, స్పిరిట్ సినిమాలు లైన్ లో ఉన్నాయి. మూడు సినిమాల షూటింగ్ లు శరవేగంగా జరుగుతున్నాయి. ఇంకో రెండు సినిమాల షూటింగ్ త్వరలోనే స్టార్ట్ అవుతుందని అంటున్నారు.
ఇలాంటి సమయంలో ఆయన నుంచి మరికొన్ని కొత్త ప్రాజెక్టుల విషయాలు కూడా బయటకు వస్తున్నాయి. అందులో చూసుకుంటే ప్రశాంత్ వర్మ సినిమా కూడా ఉందని అంటున్నారు. ప్రశాంత్ ఇప్పటికే హనుమాన్ సినిమాతో ఇండియన్ బాక్సాఫీస్ ను దున్నేశాడు. ప్రస్తుతం జై హనుమాన్ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్నాడు. అయితే ఆయన గతంలో బ్రహ్మ రాక్షస అనే సినిమాను రణ్ వీర్ సింగ్ తో తీయాలని అనుకున్నాడు. కానీ క్రియేటివ్ విషయంలో ఈ ఇద్దరికీ ఏకాభిప్రాయాలు కుదరకపోవడంతో ఆ మూవీ ఆగింది.
కాగా అదే కథతో ఇప్పుడు ప్రభాస్ తో సినిమా తీయాలని భావిస్తున్నాడంట ప్రశాంత్ వర్మ. ఈ మూవీలో నెగెటివ్ షేడ్స్ ఉన్న హీరో పాత్రకు ప్రభాస్ కూడా బాగానే కనెక్ట్ అయ్యాడని.. అందుకే మూవీ తీయాలనే ఇంట్రెస్ట్ తో ఉన్నట్టు చెబుతున్నారు. కాకపోతే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.