Prabhas Birthday Special: ప్రభాస్ వన్ మ్యాన్ షో ‘బుజ్జిగాడు’.. ఎన్ని మార్పులంటే..?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

89,164FansLike
57,764FollowersFollow

Prabhas Birthday Special: మాస్ సినిమాలు చేస్తే కాదు.. బాడీ లాంగ్వేజ్ లో మాస్ కనిపించాలి. మాస్ డైలాగ్స్, హావభావాలు పలికిస్తే మాస్ ప్రేక్షకులు ఊగిపోవాలి. ప్రేక్షకులకి నవ్వు రావాలి. మాస్ మంత్రంలోనూ ప్రేక్షకులు రిలీఫ్ కావాలి. ఇది అందరికీ సాధ్యమయ్యేది కాదు. మాస్ సినిమాలో డైలాగ్ డిక్షన్, మేనరిజమ్స్ పలికించడం అంత సులువు కాదు. కానీ, ఇందులో సక్సెస్ అయితే స్టార్ ఇమేజ్ వెతుక్కుంటూ వచ్చేస్తుంది. ప్రభాస్ అంతకుముందు చేసిన సినిమాలతో పోల్చి చూస్తే డైలాగ్ డెలివరీ పూర్తిగా మారిపోయిన సినిమా ‘బుజ్జిగాడు’. సినిమా చూస్తే అంతకుమందు సినిమాల్లో చూసిన ప్రభాసేనా అనిపించాల్సిందే. అంతలా ప్రభాస్ లుక్, డైలాగ్ డిక్షన్ మార్చేశాడు దర్శకుడు పూరి జగన్నాధ్.

‘బుజ్జిగాడు’.. పేరుకు తగ్గట్టే మాస్ కంటెంట్ మూవీ. ఇందులో ప్రభాస్ కూడా చాలా క్యాజువల్ లుక్స్ తో కనిపిస్తాడు. డైలాగ్స్ అయితే.. అలవోకగా పలికి తనలో ఇంత మాస్ కామెడీ ఉందా అనిపిస్తాడు. ‘అక్కడో రజినీకాంత్ ఉన్నాడు.. ఇక్కడో రజినీకాంత్ ఉన్నాడు.. ఇద్దరు రజినీకాంత్లు బస్సులో ఉంటే మీరెట్టా వచ్చార్రా’, ‘ఒరేయ్ బాబ్జీ.. ఓల్వో బస్సు కదులుతూండగా అద్దాలు పగలగొట్టేసుకుని నువ్వు బయటకెళ్లిపోతావని అనుకున్నావా’, ‘ఇక్కడో నరం ఉంటది.. పట్టి లాగేసుకుందారేటీ’.. ‘ఏండీ.. ఫోనెత్తండీ.. ఏమన్నా మాటాడండీ’.. అంటూ వెటకారంగా ప్రభాస్ మార్క్ ఎక్స్ ప్రెషన్స్ తో పలికించిన డైలాగులకు ఫ్యాన్స్ ఊగిపోయారు. పాటలు, ఫైట్స్ లో కూడా బాడీ లాంగ్వేజ్ తో మెప్పించాడు ప్రభాస్.

మాస్ పాత్రలు రాయడంలో, హీరో క్యారెక్టరైజేషన్స్ డిజైన్ చేయడంలో పూరి జగన్నాధ్ సిద్ధహస్తుడు. ఎందరో హీరోలకు తమ బాడీలాంగ్వేజ్ మార్చిన పాత్రలు రాశాడు. ప్రభాస్ కూ అదే చేశాడు. ‘ఈ కటౌట్ చూశావా..’ అనే డైలాగ్ కి తగ్గట్టే ప్రభాస్ లుక్ కనిపిస్తుంది. సినిమా మొత్తం కథేమీ ఉండదు.. మొత్తం ప్రభాస్. ఇది తన ఒన్ మ్యాన్ షో. ప్రభాస్-త్రిష జోడీగా ఇది మూడో సినిమా. వర్షం, పౌర్ణమి తర్వాత వచ్చిన సినిమా. సెకండాఫ్ కథనం కొంత గాడి తప్పినా ప్రభాస్ కెరీర్లో మరో 100 రోజుల సినిమాగా నిలిచింది. మాస్ ప్రేక్షకుల్ని అలరించిన సినిమాగా నిలిచింది. మొత్తంగా ప్రభాస్ కెరీర్లో తన బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డిక్షన్ కు సంబంధించి ‘బుజ్జిగాడు’కి ముందు తర్వాతగా ఈ సినిమా నిలిచింది.

సినిమా

Ram Charan: నా మూలాలు మర్చిపోను నాన్న.. ఇంకా కష్టపడతా: రామ్...

Ram Charan: ‘పెద్ది’ సినిమా నుంచి వచ్చిన ‘రై రై రారా..’ పాటలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వేసిన స్టెప్స్ ఫైర్ స్ట్రామ్...

Chiranjeevi-Ram Charan: నాడు చిరంజీవి-నేడు చరణ్.. డెడికేషన్ అంటే అదీ..

Chiranjeevi-Ram Charan: రామ్ చరణ్ ‘పెద్ది’ నుంచి వచ్చిన ‘రై రై రారా’ పాట రఫ్పాడేస్తోంది. పాటలో సింగిల్ టేక్ లో చరణ్ చేసిన డ్యాన్స్...

PEDDI: ‘రై రై రారా..’ పాట..! బాబూ చరణూ.. ఏందయ్యా అది!

Ram Charan: ‘అది పాట కాదు.. పూనకం. అది డ్యాన్స్ కాదు.. తాండవం.. అది చరణ్ కాదు.. చిరంజీవి 2.0’...      బాబూ చరణూ.....

రై రై రారా తో పెద్ది మాస్ బ్లాస్ట్

Peddi సినిమాతో Ram Charan మరోసారి బాక్సాఫీస్‌ను షేక్ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ షాట్ గ్లింప్స్, అలాగే ఫస్ట్ సింగిల్ “చికిరి చికిరి”కు...

Pawan Kalyan: ‘టైటిల్ వాళ్ల కోసమే మార్చాం..’ హరీశ్ శంకర్ క్లారిటీ

Pawan Kalyan: పవన్ కల్యాణ్ హీరోగా తెరకెక్కిన సినిమా ‘ఉస్తాద్ భగత్ సింగ్’. 2011లో వచ్చిన గబ్బర్ సింగ్ కాంబినేషన్ కావడంతో సినిమాపై భారీ అంచనాలు...

రాజకీయం

మూడు నెలల్లో 3,371 అధ్యాపక పోస్టులు భర్తీ: నారా లోకేష్

రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులను త్వరితగతిన భర్తీ చేయడానికి ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. వచ్చే మూడు నెలల్లో యుద్ధప్రాతిపదికన ఖాళీలను భర్తీ చేసేలా కొత్త నోటిఫికేషన్ జారీ చేయాలని ప్రభుత్వం...

ఫేక్ ప్రచారాలకి కట్టడి ఎలా.? కూటమి ప్రభుత్వం అంతర్మధనం.!

ఏదన్నా ఓ మంచి పని చేయాలన్న ప్రయత్నం మొదలయ్యేటప్పటికే, దుష్ప్రచారం అంతకన్నా ముందే విపరీతమైన స్థాయిలో జరిగిపోతోంది. ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో చాలా చాలా చిత్రమైన పరిస్థితి ఇది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక,...

నారా లోకేష్ డిన్నర్ మీట్… స్వీట్ మెమోరీస్

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి పార్లమెంట్ సెగ్మెంట్ల ప్రజాప్రతినిధులు మరియు వారి కుటుంబసభ్యులతో మంత్రి నారా లోకేష్ ఏర్పాటు చేసిన ఆత్మీయ డిన్నర్ మీట్ ఉండవల్లి నివాసంలో హర్షోల్లాసంగా జరిగింది. రాజకీయ...

టీటీడీ చైర్మన్‌పై విషప్రచారం.. కోర్టు గ్యాగ్ ఆర్డర్

తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) చైర్మన్‌గా ఉన్న బీఆర్ నాయుడు పై జరుగుతున్న విషప్రచారంపై హైదరాబాద్ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. తనపై ఆధారరహిత ఆరోపణలు, తప్పుడు కథనాలు, ఏఐ మరియు...

హనుమాన్ ఫౌండేషన్ ప్రారంభం: మనుషులకీ వన్యప్రాణులకీ మధ్య సంఘర్షణను తగ్గించడమే లక్ష్యం – పవన్ కళ్యాణ్

మనుషులకీ వన్యప్రాణులకీ మధ్య పెరుగుతున్న సంఘర్షణలను తగ్గించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘హనుమాన్’ పేరుతో ప్రత్యేక ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది. మంగళగిరి ఏపీఎస్పీ ఆరో బెటాలియన్ పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి,...

ఎక్కువ చదివినవి

అడవిలో 10 కిలోమీటర్లు నడిచే పిల్లలకు రోడ్డు: అసలు విషయం ఇది!

విజయనగరం జిల్లా ఎస్.కోట మండలం దారపతి పంచాయతీ పరిధిలోని రాయపాలెం గ్రామానికి చెందిన గిరిజన చిన్నారులు ప్రతిరోజూ అడవుల మధ్యగా సుమారు 10 కిలోమీటర్లు నడిచి పాఠశాలకు వెళ్తున్నారు. సరైన రహదారి సౌకర్యం...

Pawan Kalyan: ‘టైటిల్ వాళ్ల కోసమే మార్చాం..’ హరీశ్ శంకర్ క్లారిటీ

Pawan Kalyan: పవన్ కల్యాణ్ హీరోగా తెరకెక్కిన సినిమా ‘ఉస్తాద్ భగత్ సింగ్’. 2011లో వచ్చిన గబ్బర్ సింగ్ కాంబినేషన్ కావడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈక్రమంలో సినిమా ప్రమోషన్లలో భాగంగా...

‘హుషారు పిట్టలు’ నుంచి ఎమోషనల్‌ ‘మంగళస్నానం’ సాంగ్‌ రిలీజ్‌

అన్షు, వాసవి గణేషన్‌ జంటగా తెరకెక్కుతున్న యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ ‘హుషారు పిట్టలు’ చిత్రం నుంచి ‘మంగళస్నానం’ లిరికల్‌ సాంగ్‌ను విడుదల చేశారు. పద్మ అమ్మ, బీవీజీ స్టూడియెస్‌ సమర్పణలో రుద్ర క్రాంతి పిక్చర్స్‌...

Daily Horoscope: వృశ్చికానికి ఆకస్మిక లాభం, మకరానికి ఉద్యోగ పురోగతి సూచనలు

ఫిబ్రవరి 27, 2026 శుక్రవారం రాశిఫలాలు: మేషం (Aries): ఈ రోజు మీరు ఉత్సాహంగా పనులు ప్రారంభిస్తారు. ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు...

రాష్ట్ర అభివృద్ధికే కలయిక.. వచ్చే ఎన్నికల్లో ఒంగోలు, మార్కాపురంపై చంద్రబాబు టార్గెట్

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసమే పవన్ కల్యాణ్‌తో కలిసి పనిచేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. రాష్ట్రానికి పూర్వ వైభవం తీసుకురావాలంటే కూటమి పార్టీలతో పాటు ప్రజలందరి సహకారం అవసరమని ఆయన కోరారు. అరకు నుంచి...