Prabhas Birthday Special: కీలక సమయంలో ప్రభాస్ బ్లాక్ బస్టర్ ‘ఛత్రపతి’.. ఎప్పుడంటే..?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

89,301FansLike
57,764FollowersFollow

Prabhas Birthday Special: ప్రభాస్ కు మాస్ ఇమేజ్ వచ్చే వరకూ ఈ సినిమా ఎదురు చూసిందా..? మాస్ ఇమేజ్ వచ్చాక ఈ కథ పడిందా..? వర్షం కంటే ముందే ఈ కథ పడుంటే ఇంకా రేంజ్ పెరిగేదా..? అభిమానుల నుంచి ఇండస్ట్రీ వరకూ ఇలాంటివి ఎన్నో ప్రశ్నలు వేసుకునేలా చేసిన సినిమా ‘ఛత్రపతి’. ప్రభాస్ కు వర్షమే భారీ మాస్ ఇమేజ్ తెచ్చిపెట్టిందంటే.. మరుసటి ఏడాది వచ్చిన ‘ఛత్రపతి’ ఫ్యాన్స్ ను ఊపిరి తీసుకోనివ్వలేదు. ప్రభాస్ కు అసలైన మాస్ కటౌట్ కు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిందీ సినిమా. పైగా.. రాజమౌళి తన హై ఎండ్ పొటెన్షియాలిటీని బయటకు తెలుపక ముందు.. తనకున్న మాస్ గ్రాఫ్ తో తీసిన సినిమా. ఇంకేముంది, రికార్డులూ దాసోహమన్నాయ్.

2005లో తెలుగునాట మొత్తం తమిళ డబ్బింగ్ సినిమాల హవా నడుస్తున్న దశలో వచ్చిన అసలు సిసలు తెలుగు కమర్షియల్ హిట్ సినిమాగా నిలిచింది ‘ఛత్రపతి’. ప్రధానంగా తల్లి సెంటిమెంట్ కథ. దీనికి వలస వచ్చిన కూలీల కథను అల్లుకుని మాస్ ఎలిమెంట్స్ తో బీభత్సమే సృష్టించాడు దర్శకుడు రాజమౌళి. ఇందుకు హీరో పాత్రలో ప్రభాస్ తనను తప్ప మరెవరూ ఊహించలేనంతగా ఒదిగి సరైన మాస్ కంటెంట్ తనకు పడితే ఎలా ఉంటదో చూపించాడు. ఆరడుగుల గ్రీకు శిల్పానికి ఏమాత్రం తగ్గని విలనిజం కూడా యాడ్ చేయడంతో ఫైట్స్ అభిమానులతో ఈలలు వేయించాయి. ముఖ్యంగా కాట్ రాజ్ తో ఫైట్ ని చెప్పడం, రాయడం కాదు.. చూసి తీరాల్సిందే అనేలా డిజైన్ చేసింది టీమ్.

ఇంటర్వెల్ బ్లాక్ సినిమాను ఓ స్థాయిలో ఉండడానికి ప్రభాస్ చేసిన యాక్షన్ కు ఫ్యాన్స్ ఊగిపోయారు. ‘ఒట్టేసి ఒక మాట.. ఒట్టేయకుండా ఒక మాట చెప్పను’.. ‘ఒక్క అడుగు’, ‘వాడు పోతే వీడు.. వీడు పోతే వాడు..’ అనే డైలాగ్స్ ఈలలు వేయించాయి. తల్లిని వెదికే క్రమంలో ప్రభాస్ పండించిన భావోద్వేగాలు ప్యామిలీ ఆడియన్స్ ను అకట్టుకున్నాయి. తల్లి ఎవరో తెలిసి కూడా తానెవరో చెప్పుకోలేని పరిస్థితి.. తమ్ముడిపై కోపం ఉన్నా తల్లి కోసం ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో ప్రభాస్ నటన ఆకట్టుకుంటుంది. పాటల్లో హీరోయిన్ శ్రియతో ప్రభాస్ హుషారైన డ్యాన్సులు, ఫ్యాన్స్ ను అలరించాయి. దీంతో ప్రభాస్ కెరీర్లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిందీ సినిమా.

సినిమా

మిస్ ఇండియా నుంచి టాలీవుడ్ వరకూ.. మీనాక్షి చౌదరి ప్రయాణం

ఈరోజు అందం, ప్రతిభ కలగలిసిన హీరోయిన్ మీనాక్షి చౌదరి పుట్టిన రోజు. మిస్ ఇండియా వేదిక నుంచి సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టి, తక్కువ సమయంలోనే తెలుగు...

ముందుగానే రానున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ తుఫాన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారీ మాస్ ఎంటర్‌టైనర్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ విడుదల తేదీ ముందుకు వచ్చింది. ముందుగా...

DeviSri-Mythri: దేవిశ్రీ-మైత్రి మధ్య దూరం..! నెట్టింట చర్చ

DeviSri-Mythri: సినిమా విజయానికి సంగీతం ఎంతో కీలకం. ముఖ్యంగా భారతీయ సినిమాల్లో పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకి ప్రాణం లాంటివి. ఒక సినిమా విడుదలకు ముందే...

Allu Arjun: నటి పావలా శ్యామలకు అల్లు అర్జున్ ఆర్ధిక సాయం.....

Allu Arjun: వెండితెరపై క్యారెక్టర్ ఆర్టిస్టుగా, కమెడియన్ గా నటించిన పావలా శ్యామల కొన్నేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. చిరంజీవితోసహా ఆమెకు ఆర్ధికసాయం చేసిన...

Pawan Kalyan: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కు మరో మ్యూజిక్ డైరక్టర్.....

Pawan Kalyan: పవన్ కల్యాణ్ హీరోగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘ఉస్తాద్ భగత్ సింగ్’. భారీ అంచనాలతో సినిమా ఈనెల 26న విడుదల...

రాజకీయం

కొత్త జిల్లాల ప్రాతిపదికన జడ్పీ ఎన్నికలు నిర్వహిస్తాం: పవన్ కళ్యాణ్

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా జడ్పీ ఎన్నికలను కొత్తగా విభజించిన జిల్లాల ప్రాతిపదికన నిర్వహించేందుకు ప్రభుత్వం యోచిస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. ఈ దిశగా ఇప్పటికే ప్రభుత్వం కసరత్తు...

కల్తీ నెయ్యి డబ్బులపై ధూళిపాళ్ల సంచలన ఆరోపణలు

టీడీపీ ఎమ్మెల్యే, సంగం డెయిరీ చైర్మన్ ధూళిపాళ్ల తాజాగా కల్తీ నెయ్యి వ్యవహారంపై తీవ్ర ఆరోపణలు చేశారు. కల్తీ నెయ్యి అక్రమ సొమ్ము కోట్ల రూపాయలుగా విజయవాడ, చెన్నైలకు చేరిందని ఆయన పేర్కొన్నారు....

నారా లోకేష్ ఆత్మీయ విందు.. ఉత్తరాంధ్ర ప్రజాప్రతినిధులతో ఉల్లాస సమ్మేళనం

ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం, అరకు పార్లమెంట్ పరిధిలోని ప్రజాప్రతినిధులు, వారి కుటుంబసభ్యులతో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ నిర్వహించిన ఆత్మీయ విందు సమావేశం ఆనందభరిత వాతావరణంలో జరిగింది. ఉండవల్లిలోని...

ఎచ్చెర్లలో వైసీపీ నేతలు వరుసగా జనసేనలోకి చేరిక

మంచి వ్యక్తిత్వం ఉన్నవారినే జనసేన పార్టీలోకి ఆహ్వానిస్తున్నామని ఎమ్మెల్సీ, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కె. నాగబాబు స్పష్టం చేశారు. జనసేనలో చేరే నాయకులు, కార్యకర్తలు ఎవరు అయినా సరే ముందుగా జనసైనికులు...

ప్రేమ కుమార్ సమక్షంలో జనసేనలోకి గాయత్రి నగర్ మహిళల చేరిక

హైదరాబాద్ కూకట్‌పల్లి నియోజకవర్గంలో జనసేన పార్టీకి మద్దతు క్రమంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో అల్లాపూర్ గాయత్రి నగర్ డివిజన్‌కు చెందిన మహిళలు పెద్ద సంఖ్యలో జనసేన పార్టీలో చేరారు. కెపిహెచ్‌బి కాలనీలోని జనసేన...

ఎక్కువ చదివినవి

పవన్ కళ్యాణ్ ప్రారంభించిన ‘ఉద్యమి’ సభ్యత్వానికి తొలి రోజే లక్ష స్పందన

జనసేన పార్టీ చేపట్టిన ‘ఉద్యమి’ సభ్యత్వ నమోదు కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా సమధికోత్సాహంతో ప్రారంభమైంది. మహాశివరాత్రి పర్వదినాన పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లాంఛనంగా ఈ కార్యక్రమాన్ని ఆరంభించారు. సభ్యత్వ...

దేవుడిని రాజకీయాల్లోకి లాగొద్దు: మండలిలో లోకేష్ ఘాటు వ్యాఖ్యలు

తిరుమల లడ్డూలో నెయ్యి కల్తీ అంశంపై ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ సందర్భంగా వైసీపీ సభ్యులు చేసిన ఆరోపణలపై విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తీవ్రంగా...

భావ రస నాట్యోత్సవం 2కు రంగం సిద్ధం

హైదరాబాద్‌లో శాస్త్రీయ నృత్య కళా వైభవానికి ప్రతీకగా నిలిచిన ‘భావ రస నాట్యోత్సవం’ మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘మదాలస - స్పేస్ ఫర్ డివైన్ ఆర్ట్’ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 28, 2026న...

అనకాపల్లిలో రూ.2,300 కోట్ల బ్లూ జెట్ ప్లాంట్‌కు నారా లోకేష్ శంకుస్థాపన

అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలంలో మరో భారీ ఔషధ తయారీ పరిశ్రమకు నాంది పడింది. అచ్యుతాపురం–రాంబిల్లి మండలాల పరిధిలోని సీతపాలెం ప్రత్యేక ఆర్థిక మండలి (SEZ)లో బ్లూ జెట్ హెల్త్ కేర్ ప్రైవేట్...

విరోష్ సేవా సందేశం: దేశవ్యాప్తంగా దేవాలయాల్లో అన్నదానం, స్వీట్స్ పంపిణీ

వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన సందర్భంగా దేశ ప్రజల ఆశీస్సులకు కృతజ్ఞతగా విరోష్ సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ప్రముఖ నటుడు విజయ్ దేవరకొండ మరియు ప్రముఖ నటి రష్మిక  మందన్న జంట తమ వివాహం...