Prabhas : సలార్ మరియు కల్కి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ భారీ విజయాలను సొంతం చేసుకున్న ప్రభాస్ ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో రాజాసాబ్ సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. మరో వైపు సలార్ 2 మరియు కల్కి 2 సినిమాలు లైన్ లో ఉన్నాయి. యానిమల్ దర్శకుడు సందీప్ వంగతో స్పిరిట్ సినిమాను చేయనున్నాడు.
ఇన్ని సినిమాలు లైన్ లో ఉండగానే హను రాఘవపూడి దర్శకత్వంలో ఒక సినిమాను చేసేందుకు ప్రభాస్ ఓకే చెప్పాడు. ఇప్పటికే ఆ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ ను దర్శకుడు హను రాఘవపూడి మొదలు పెట్టాడు. రెండో ప్రపంచ యుద్దం నేపథ్యంలో ఈ సినిమాను దర్శకుడు హను రాఘవపూడి రూపొందించబోతున్నాడు.
ఈ సినిమా గురించి తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం రెండో ప్రపంచ యుద్దం కోసం వేరే దేశం వెళ్లే హీరో అక్కడ ఒక అమ్మాయితో ప్రేమలో పడతాడు. ఆ విదేశీ అమ్మాయి గా నటించేందుకు ఎంతో మందిని సంప్రదించిన దర్శకుడు చివరకు ఇంటర్నేషనల్ డాన్సర్ ఇమాన్ ఇస్మాయిల్ నటించనున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
విదేశీ యువతి అన్నట్లుగా ఉండటంతో పాటు, ఇండియన్ సినిమాకు ఈమె సరిగ్గా సూట్ అవుతుంది అంటూ ప్రేక్షకులు భావిస్తున్నారు. అందుకే ఇమాన్ ఇస్మాయిల్ ను ప్రభాస్ కి జోడీగా ఎంపిక చేశారు అనే టాక్ వినిపిస్తుంది.