పవన్ కళ్యాణ్ సినిమా ల్లో ఎంత పెద్ద స్టార్ అయినా.. రాజకీయాల్లో ఎంతో నిజాయితీగా ఉంటాడు అనే పేరును దక్కించుకున్నా కూడా ఆయన యొక్క బహు భార్యత్వం తాలూకు మైనస్ ఎప్పటికప్పుడు ఆయన విమర్శలు ఎదుర్కొనేలా చేస్తుంది. భారత దేశ హిందువులు ఇలా బహుభార్యత్వం ను ఒప్పుకోరు. ఇప్పుడు పవన్ రాజకీయాల్లో ప్రత్యర్థులకు అదే ప్రధాన ఆస్త్రం అయ్యింది. తాజాగా వైకాపా మహిళ విభాగం కొత్త అధ్యక్షురాలు పోతుల సునీత తన మీడియా సమావేశంలో పవన్ కళ్యాణ్ పై విమర్శలు గుప్పించారు.
పవన్ బహు భార్యత్వం ఆయన మహిళల పట్ల ఎంత గౌరవంను కలిగి ఉన్నాడు అనే విషయాన్ని తెలియజేస్తుంది. లోకల్.. నేషనల్.. ఇంటర్నేషనల్ లెవల్ లో పవన్ వివాహం చేసుకున్నాడు. మరో వివాహం చేసుకోవాలనుకుంటున్నట్లుగా కూడా మాకు సమాచారం ఉంది. ఆయన మహిళల యొక్క గౌరవంను కాపాడుతాను అంటే హాస్యాస్పదంగా ఉందంటూ పోతుల సునీత అన్నారు. పోతుల సునీత వ్యాఖ్యలకు జనసేన వీర మహిళలు తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు.