Switch to English

పోతిరెడ్డి‘పాడు’ రగడ: టీ కప్పులో తుపానేనా.?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ పోతిరెడ్డిపాడు వ్యవహారం రాజకీయంగా పెను దుమారం రేపింది. కృష్ణా నది నుంచి రాయలసీమకు నీళ్ళు తరలించే ఈ హెడ్‌ రెగ్యులుటర్‌ సామర్థ్యాన్ని పెంచుతూ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం అప్పట్లో పెను రాజకీయ ప్రకంపనలు సృష్టించింది. మళ్ళీ ఇప్పుడు ఇంత కాలానికి ఈ వివాదం మళ్ళీ ఆ స్థాయికి చేరుకునేలా కన్పిస్తోంది.

కరోనా వైరస్‌ సహా అనేక సమస్యల నడుమ ప్రజల దృష్టిని మరల్చేందుకు ‘పోతిరెడ్డిపాడు’ అంశం తెరపైకొచ్చిందా.? అంటే, అవుననే వాదన విన్పిస్తుండడం గమనార్హం. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి – తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఏడాది కాలంగా కలిసి మెలిసి ముందుకు నడుస్తున్నారు.

గోదావరి నీటి వినియోగం, కృష్ణా నది నీటి వినియోగంపై ఎప్పటికప్పుడు ఇరువురి మధ్యా చర్చలు జరుగుతున్నాయి. మరి, ఏ సందర్భంలోనూ పోతిరెడ్డిపాడు అంశం ప్రస్తావనకు రాలేదా.? సంగమేశ్వరం నుంచి నీటిని ఎత్తిపోసేలా రూపొందించిన కొత్త ప్రాజెక్ట్‌ అంశంపై ఇద్దరూ చర్చించలేదా.? అన్న అనుమానం కలగడం సహజమే.

నిజానికి, ఇది సెంటిమెంట్‌తో కూడిన వ్యవహారం. ఇందులో లాజిక్‌లు ఎవరికీ అనవసరం. లేకపోతే, ఏళ్ళతరబడి రాయలసీమలో ‘ఎడారి’ పరిస్థితులు ఎందుకు కొనసాగుతాయి.? మొన్నామధ్య కృష్ణా నదికి కనీ వినీ ఎరుగని స్థాయిలో వరదలొచ్చాయి. ఆ నీరు ఏమయ్యింది.?

బ్రిజేష్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ లెక్కల ప్రకారం ఉమ్మడి రాష్ట్రానికి 811 టీఎంసీల నీరు వాడుకునే హక్కుంది. ఉమ్మడి రాష్ట్రం విభజనతో కేంద్రం తాత్కాలిక సర్దుబాటు ప్రాతిపదిక ఆంధ్రప్రదేశ్‌కి 512, తెలంగాణకి 299 టీఎంసీలను పంపిణీ చేస్తూ 2015లో ఆదేశాలు జారీ చేసింది. అయినాసరే, తెలంగాణ వాదనలు తెలంగాణవే. ఆంధ్రప్రదేశ్‌ వాదనలు ఆంధ్రప్రదేశ్‌వే. ‘వాటాలకు లోబడి మాత్రమే’ అని చెప్పే మాటలు నీటి మీద రాతల్లాంటివే.

ఇక, తెలంగాణలో గత ఆరేళ్ళలో చాలా కొత్త ప్రాజెక్టులొచ్చాయి. కానీ, ఆంధ్రప్రదేశ్‌ మాత్రం చేతులెత్తేసింది. ఇప్పుడు ఎంత యాగీ చేసినా, తెలంగాణ వాదన ముందు వీగిపోవడం తప్ప.. ఆంధ్రప్రదేశ్‌ తన వాదనకు మద్దతు కూడగట్టుకునే పరిస్థితి వుండదు. ఇదిలా వుంటే, ఈ యాగీ కేవలం టీ కప్పులో తుపాను మాత్రమేనని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరామ్ పెద్ద ‘బాంబు’ పేల్చారు. చూస్తోంటే, కోదండరామ్ మాటల్లోనూ నిజం లేకపోలేదన్పిస్తోంది.

సినిమా

తన పిరియడ్స్ ఎక్స్ పీరియన్స్ ను చెప్పిన అనసూయ

జబర్దస్త్ ప్రోగ్రామ్ ద్వారా టీవీలో.. రంగస్థలం సినమా ద్వారా సినిమాల్లో చాలా పాపులర్ అయిన నటి అనసూయ. నటిగానే కాకుండా సోషల్ మీడియాలో కూడా అంతే...

‘ఓటీటీ’ దుమ్ము దులిపే ‘సినిమా’ కావాలి

లాక్ డౌన్ కారణంగా రెండు నెలలుగా థియేటర్లు మూతబడ్డాయి. ఇప్పటికీ థియేటర్ల పునఃప్రారంభంపై అనిశ్చితి కొనసాగుతూనే ఉంది. ఒకవేళ తెరిచినప్పటికీ ప్రేక్షకులు మునుపటిలా థియేటర్లకు వస్తారో,...

‘కరోనా వైరస్’ సినిమా ఓటీటీ కోసమే..

ప్రపంచమంతా కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ అంటూ కూర్చుంటే వర్మ మాత్రం అదే ‘కరోనా వైరస్’ నేపధ్యంలో సినిమా తీసేసాడు. లాక్ డౌన్ సమయంలో...

జుంబారే ..జుజుంబరే… తాతకి మనవడి బర్త్ డే గిఫ్ట్

అమరరాజా ఎంటర్టైన్మెంట్ పతాకంపై గల్లా జయదేవ్ కుమారుడు గల్లా అశోక్ హీరోగా శ్రీరాం ఆదిత్య దర్శకత్వంలో ఒక చితం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో...

పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్న చిరంజీవి ఫ్యామిలీ

మెగాస్టార్ చిరంజీవి తేనెటీగల దాడి నుంచి తృటిలో తప్పించుకున్నారు. తెలంగాణలోని కామారెడ్డి జిల్లా దోమకొండలో ఈ ఘటన జరిగింది. ఇటివల రామ్ చరణ్ భార్య ఉపాసన...

రాజకీయం

‘సుమోటో’ అంటూ ఈ కెలుకుడేంది ‘రెడ్డి’గారూ.!

సోషల్‌ మీడియాలో వైఎస్సార్సీపీ ముఖ్య నేత, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి చాలా యాక్టివ్‌గా వుంటారన్నది అందరికీ తెల్సిన విషయమే. కుప్పలు తెప్పలుగా ట్వీట్స్‌ వేస్తుంటారాయన. ప్రత్యర్థులపై ఎడాపెడా సెటైర్లు వేయడంలో...

జనసేనాని ప్రశ్న: లాక్‌డౌన్‌లో ‘ఇసుక’ మాయమైందెందుకు.?

‘లాక్‌డౌన్‌లోనూ ఇసుక లారీలు తిరిగాయి.. కానీ, డంపింగ్‌ యార్డులకి చేరలేదని భవన నిర్మాణ రంగ కార్మికులు చెబుతున్నారు. మరి, ఇసుక ఏమయినట్లు.? చంద్రబాబు హయాంలో ఎలాగైతే ఇసుక పేరుతో దోపిడీ జరిగిందో.. ఇప్పుడే...

కృష్ణాజిల్లా నందిగామలో చంద్రబాబు పై కేసు నమోదు

మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పై నందిగామ పోలీస్ స్టేషను లో కేసు నమోదు. కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయంలో హైదరాబాదు నుండి విజయవాడ కు రోడ్డు మార్గాన వస్తూ జగ్గయ్యపేట, నందిగామ,కంచికచర్ల...

సుధాకర్ కు వైద్యం అందిస్తున్న డాక్టర్ మార్పు

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన డా.సుధాకర్ కేసును హైకోర్టు ఆదేశాలతో సీబిఐ విచారణ చేస్తున్న సంగతి తెలిసిందే. రోజురోజుకీ ఈ కేసు కీలక మలుపులు తీసుకుంటోంది. ఇప్పుడు సుధాకర్ విషయంలో మరో అంశం సంచలనమైంది....

కరోనా వైరస్‌.. జనానికి ఇకపై ఆ దేవుడే దిక్కు.!

కరోనా వైరస్‌ విషయంలో కేంద్రం చేతులెత్తేసింది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చేయడానికేమీ లేదు. దశలవారీగా లాక్‌డౌన్‌ని ఎత్తేవేసేందుకు ప్రణాళికని కూడా కేంద్రం ప్రకటించేసింది. కేంద్రం నుంచి రాష్ట్రాలకు అందాల్సిన స్థాయిలో ఆర్థిక అండదండలు...

ఎక్కువ చదివినవి

చైనా ఆరు రోజుల ఆలస్యం.. ప్రపంచం అల్లకల్లోలం!

ప్రపంచాన్ని పట్టి కుదిపేస్తున్న కరోనా వైరస్ కు కారణం ఎవరు అని అడిగితే.. ఠక్కున చైనా అనే సమాధానమే వస్తుంది. కావాలనే సృష్టించారో లేక ప్రపంచం కర్మ కొద్దీ వచ్చిందో అనే విషయాన్ని...

జనవరిలో జరిగిన వుహాన్ విందే నేటి అల్లకల్లోలానికి కారణమా..

ప్రస్తుతం ప్రపంచమంతా కరోనా కబంధ హస్తాల్లో చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. ఈ వైరస్ పుట్టింది చైనాలోని వుహాన్ నగరంలోనే అయినా.. ఎలా పుట్టిందో.. ఎందుకు ఇంతగా వ్యాపించిందో ఇప్పటికీ సరైన సమాధానం లేదు....

క్రైమ్ న్యూస్: ప్రియురాలిని ఎర వేసి చెల్లి ప్రియుడిని చంపేసిన..

తన చెల్లిని ప్రేమించాడు అంటూ 19 యేళ్ల దినేశ్‌ను వంశీ చంపేశాడు. ప్రకాశం జిల్లా చీరాలలో ఈ సంఘటన జరిగింది. హరీష్‌ పేటకు చెందిన దినేశ్‌ కొన్నాళ్లుగా సంధ్యను ప్రేమిస్తున్నాడు. ఆమె కుటుంబ...

కిడ్నీ కొంటామని డబ్బులు ఎదురు దోచేశారు..

తల్లిదండ్రులకు ఆర్ధికంగా అండగా నిలుద్దామని ఆలోచించింది ఓ మహిళ. ఇందుకు తాను చేస్తున్న పనితో మరింత నష్టపోతున్ననని గ్రహించలేదు. సదరు మహిళ సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడిపోయిన ఈ ఘటన కర్ణాటకలో జరిగింది....

తన పిరియడ్స్ ఎక్స్ పీరియన్స్ ను చెప్పిన అనసూయ

జబర్దస్త్ ప్రోగ్రామ్ ద్వారా టీవీలో.. రంగస్థలం సినమా ద్వారా సినిమాల్లో చాలా పాపులర్ అయిన నటి అనసూయ. నటిగానే కాకుండా సోషల్ మీడియాలో కూడా అంతే యాక్టివ్ గా ఉంటుంది. తనపై వచ్చే...