Switch to English

జగన్‌ వర్సెస్‌ కేసీఆర్‌: పోతిరెడ్డిపాడు ఫైట్‌ అటకెక్కినట్లేనా.?

ఓ వైపు కరోనా కలకలం.. ఇంకో వైపు విశాఖలో ఎల్జీ పాలిమర్స్‌ విషవాయువు లీకేజ్‌.. వెరసి.. ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర భయానక పరిస్థితులు నెలకొన్నాయి. అనూహ్యంగా ఈ తరుణంలోనే పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ వ్యవహారం తెరపైకొచ్చింది. పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని పెంచి, కృష్ణా నది నుంచి అవసరమైన మేర నీళ్ళు రాయలసీమకు తీసుకెళ్ళేందుకు వీలుగా ఇంకో ప్రాజెక్టుని నిర్మించాలని భావించిన జగన్‌ ప్రభుత్వం, ఈ మేరకు ఓ జీవో కూడా విడుదల చేసింది. అంతే తెలంగాణ ఒక్కసారిగా భగ్గుమంది. రాజకీయాలు వేడెక్కాయి. తెలంగాణ – ఆంధ్రప్రదేశ్‌ మధ్య రాజకీయ మాటల యుద్ధం షురూ అయ్యింది. ఎంత ఆశ్చర్యకరంగా ఈ వివాదం తెరపైకొచ్చిందో, అంతే ఆశ్చర్యకరంగా సద్దుమణిగిపోయింది.

ఎందుకిలా.? వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఆశించినట్లు, పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ సామర్థ్యం పెరుగుతుందా.? తెలంగాణ ప్రభుత్వం గుస్సా అయిన దరిమిలా వైఎస్‌ జగన్‌ ప్రయత్నాలు ఆగిపోతాయా.? అసలేం జరుగుతంది.? ఏమోగానీ, జరగాల్సిన రాజకీయ రచ్చ అయితే జరిగిపోయింది. ఓ పద్ధతి ప్రకారం తమ తమ రాష్ట్రాల్లో విపక్షాల్ని రెచ్చగొట్టడానికి అటు జగన్‌ సర్కార్‌, ఇటు కేసీఆర్‌ సర్కార్‌ వ్యూహం పన్నాయా.? అన్న దిశగా చాలా రాజకీయ విశ్లేషణలు జరిగాయి. చివరికి అదే నిజం.. అన్న భావన కలుగుతోంది.

తెలుగుదేశం పార్టీ ఈ ఎపిసోడ్‌లో వ్యూహాత్మక మౌనం పాటించింది. కాంగ్రెస్‌, బీజేపీ మాత్రం.. రాష్ట్రాలుగా విడిపోయి.. ఆయా రాష్ట్రాల ప్రయోజనాల కోసం ఆయా రాష్ట్రాల నేతలు మాట్లాడారు. చివరికి అంతా తుస్సుమన్నాక.. టీడీపీ ఎందుకు ఈ వ్యవహారంలో మాట్లాడటంలేదు.? అంటూ అధికార వైసీపీ నేతలు గుస్సా అవుతున్నారు. అంటే, ఇంకా వైసీపీ ఆశించిన ‘పొలిటికల్‌ మైలేజ్‌’ ఈ గొడవతో రాలేదన్నమాట. సీమ ప్రయోజనాల మీద వైఎస్‌ జగన్‌ సర్కార్‌కి అంత చిత్తశుద్దే వుంటే, మొన్నామధ్య కృష్ణా నదికి భారీ వరదలొచ్చినప్పుడే.. తగిన స్థాయిలో రాయలసీమకు నీళ్ళను తరలించేది.

అంతెందుకు, ‘పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించడానికి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఒప్పుకున్నారు..’ అని సాక్షాత్తూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అసెంబ్లీలో ప్రకటిస్తే, ఇప్పటిదాకా ఆ వ్యవహారంపై వైఎస్‌ జగన్‌ స్పందించలేదాయె. సో, పోతిరెడ్డిపాడు రగడ కేవలం రాజకీయ రచ్చ తప్ప, సీమ మీద వైసీపీ ప్రభుత్వానికి వున్న చిత్తశుద్ధి కాదని తేలిపోయింది.

సినిమా

టీటీడీని ప్రశ్నించిన ఏకైక హీరో

టీటీడీకి చెందిన ఆస్తులను వేలం వేసేందుకు అధికారులు సిద్దం అయిన విషయం తెల్సిందే. ఇందుకోసం ఇప్పటికే ఉతర్వులు కూడా సిద్దం అయ్యాయి. దేశ వ్యాప్తంగా ఉన్న...

కమల్‌తో వ్యవహారంపై క్లారిటీ ఇచ్చింది

యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ సుదీర్ఘ కాలం పాటు నటి గౌతమితో సహజీవనం సాగించిన విషయం తెల్సిందే. ఆమెతో కొన్ని కారణాల వల్ల విడిపోయిన కమల్‌...

ముందు ఎఫ్ 3.. ఆ తర్వాతే ఏదైనా

దర్శకుడు అనిల్ రావిపూడి ఇప్పుడు టాప్ లీగ్ లోకి చేరిపోయాడు. చేసినవి 5 సినిమాలు అయితే ఐదు కూడా సూపర్ డూపర్ హిట్లు అయ్యాయి. ఒకదాన్ని...

ఈ హీరోయిన్ కు కూడా లైంగిక వేధింపులు తప్పలేదట

లైంగిక వేధింపులు అనేది అన్ని చోట్లా ఉంది. కాకపోతే సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్య ఈ విషయం ఎక్కువగా చర్చకు వస్తోంది. ఇదివరకు ఈ విషయంపై...

సాయి తేజ్ ‘నో పెళ్లి’ కాన్సెప్ట్ కి రానా, వరుణ్ తేజ్...

దాదాపు రెండున్నర నెల తర్వాత టాలీవుడ్ లో మళ్ళీ ప్రమోషన్స్ హడావిడి స్లోగా మొదలవుతోంది. సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న 'సోలో...

రాజకీయం

సగటు భక్తుడి ఆవేదన: వెంకన్న జోలికి వెళ్ళొద్దు ప్లీజ్‌.!

ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా టీటీడీ పాలక మండలి అనగానే రాజకీయ నిరుద్యోగులకు పునరావాస కేంద్రంగా మారిపోయిందన్నది ఓపెన్‌ సీక్రెట్‌. ఇదే విమర్శ గతంలో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో విన్నాం.. ఆ తర్వాత...

టీటీడీ వివాదంపై జగన్ కి విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద సూచనలు.!

టీటీడీ భక్తులు ఇచ్చిన భూములు విక్రయించాలి అని నోటీసులు జారీ చేసినప్పటి నుంచీ ఆ విషయంపై నానా రచ్చ నడుస్తోంది. టీటీడీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ వ్యతిరేకిస్తున్నారు. కానీ టీటీడీ...

జనసేనానీ.. ఈ డోస్‌ సరిపోదు సుమీ.!

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఈ మధ్య సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా వుంటున్నారు. అయితే, ఎక్కువగా రీ-ట్వీట్లు చేస్తున్నారనే విమర్శలూ పవన్‌ కళ్యాణ్‌ మీద లేకపోలేదనుకోండి.. అది వేరే విషయం. బీజేపీ...

శ్రీశైలంలో కోట్లు స్వాహా చేసిన అక్రమార్కులు

అవినీతి అనేది అక్కడ ఇక్కడ అని లేకుండా ఎక్కడ పడితే అక్కడే జరుగుతుంది అనేందుకు మరో ప్రత్యేక్ష ఉదాహరణగా శ్రీశైలం నిలిచింది. ఏపీలోని ప్రముఖ శైవ క్షేత్రం అయిన అక్కడ కోట్లాది రూపాయల...

జగన్ కీలక నిర్ణయం.. సజ్జలకు పార్టీ బాధ్యతలు?

పార్టీ బాధ్యతల విషయంలో వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారా? అటు సీఎంగా పాలనా వ్యవహారాలు, ఇటు అధినేతగా పార్టీ కార్యకలాపాలు ఒకేసారి చూడటం కాస్త...

ఎక్కువ చదివినవి

శ్రీదేవి ఇంట కరోనా పాజిటివ్ నమోదు

హాలీవుడ్ వారితో పోల్చితే ఇండియన్ సినీ ప్రముఖులు కరోనా బారిన పడటం తక్కువే. ఎంతో మంది హాలీవుడ్ స్టార్స్ కరోనా బారిన పడి ఇబ్బందుకు ఎదుర్కొన్నారు. అయితే ఇప్పుడు బాలీవుడ్ కు కూడా...

పురోహితుల ‘కరోనా’ కష్టాలపై గళం విప్పిన పవన్‌ కళ్యాణ్‌

కరోనా వైరస్‌ - లాక్‌ డౌన్‌ కారణంగా పౌరోహిత్యంపై తీవ్ర ప్రభావమే పడింది. పౌరోహిత్యం మీదనే ఆధారపడ్డ బ్రాహ్మణ కుటుంబాలు గత రెండు మూడు నెలలుగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. ‘మమ్మల్ని ప్రభుత్వమే...

హ్యాపీ లేని నెస్ట్ మాకెందుకు?

ఏపీ రాజధాని అమరావతిలో సీఆర్డీఏ నిర్మించి ఇచ్చే హ్యాపీ నెస్ట్ ఫ్లాట్లపై కొనుగోలుదారులు విముఖత వ్యక్తం చేస్తున్నారు. రాజధాని ప్రాంతంలో నివాసం ఉండాలనే ఉద్దేశంతో తాము అందులో ప్లాట్ల కొనుగోలుకు ఆసక్తి చూపించామని,...

లాక్‌డౌన్‌తో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ లో వచ్చే మార్పులపై క్లారిటీ

పలు పెద్ద సినిమాలు కరోనా కారణంగా స్క్రిప్ట్‌లో మార్పులు చేర్పులు చేయడంతో పాటు షూటింగ్స్‌ను రీ షెడ్యూల్‌ చేయడం మరియు లొకేషన్స్‌ విషయంలో మార్పులు చేర్పులు చేయడం కూడా జరుగుతుంది. అలాగే ఆర్‌ఆర్‌ఆర్‌...

ఫ్లాష్ న్యూస్: రోడ్డు మీద మిలియన్‌ డాలర్ల డబ్బు దొరికితే అతడేం చేశాడో తెలుసా?

రోడ్డు మీద పది రూపాయలు దొరికితే అటు ఇటు చూసి దాన్ని జేబులో పెట్టుకునే రోజులు. వేల రూపాయలతో ఉన్న పర్స్‌ రోడ్డు మీద కనిపిస్తే ఎవరిదో అనే విషయం కనీసం ఆలోచించకుండా...