సినీ నటుడు, దర్శకుడు, రచయిత పోసాని కృష్ణ మురళి నిన్న జైలు నుంచి విడుదలయ్యారు. దాదాపు నెల రోజులుగా జైలు జీవితానికే పరిమితమయ్యారు పోసాని కృష్ణమురళి.
చంద్రబాబు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ మీద వ్యక్తిగత దూషణలు, వారి కుటుంబ సభ్యులపైన అసభ్యకరమైన రీతిలో వ్యాఖ్యలు చేయడం, పవన్ కళ్యాణ్ కుమార్తెలపై అత్యంత అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయడం.. ఇలా పలు కేసుల్లో పోసాని కృష్ణమురళి ఇరుక్కున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 18కి పైగా కేసులు పోసాని కృష్ణమురళి మీద నమోదు కాగా, అందులో కొన్ని కేసుల్లో పోసాని కృష్ణమురళిని అదుపులోకి తీసుకున్నారు. ఓ జైలు నుంచి మరో జైలుకి.. ఇలా జైళ్ళ మధ్య షటిల్ సర్వీస్ చేయాల్సి వచ్చింది పోసాని కృష్ణ మురళి.
విచారణ సందర్భంగా, తనతో వైసీపీనే అలా మాట్లాడించిందనీ, సాక్షి పత్రిక తనకు స్క్రిప్టు అందించేదనీ.. పోసాని కృష్ణమురళి అసలు విషయాన్ని కొంత మేర వెల్లగక్కేశాడు కూడా. పోసాని అంటే, నోటి మీద అస్సలు అదుపులేని వ్యక్తి. ‘మెంటల్ కృష్ణ’ సినిమా పోసాని చేశాడని కాదుగానీ, అతని వ్యవహార శైలి.. అలానే వుంటుంది మీడియా ముందర.
అతి ఆవేశానికి గురవడం, ఏం మాట్లాడుతున్నాడో తెలియని స్థితిలో ఊగిపోవడం.. ఇవన్నీ పోసాని కృష్ణమురళికి అలవాటే. వైసీపీ హయాంలో అలానే విచ్చలవిడిగా చెలరేగిపోయాడు. అలా చెలరేగిపోయినందుకుగాను వైసీపీ హయాంలో ఏపీ ఎఫ్‌డీసీ ఛైర్మన్‌గా అవకాశం దక్కింది కూడా.
అధికారిక పదవితోపాటు, ప్రెస్ మీట్లలో బూతులు తిట్టినందుకుగాను అదనపు చెల్లింపులు కూడా జరిగాయి పోసాని కృష్ణమురళికి వైసీపీ నుంచి. అలా ఆర్థికంగా ఆయన ఎదిగాడు కూడా.
ఎంత ఎదిగితే ఏం లాభం.? క్యారెక్టర్ పాతాళానికి పడిపోయింది. బెయిల్ దొరక్కపోతే ఆత్మహత్య చేసుకుంటానని న్యాయ వ్యవస్థను బ్లాక్‌మెయిల్ చేసే స్థాయికి దిగజారిపోయాడు పోసాని.
ఎలాగైతేనేం, బెయిల్ తెచ్చుకున్నాడు పోసాని. ఇకనైనా మనిషిలా మారతాడా.? అదే అశుద్ధమైన నోటిని ఇంకా అలానే వాడతాడా.? ప్రస్తుతానికైతే కోర్టు ఆదేశాల మేరకు, ఎక్కడా పోసాని ఆయా కేసుల గురించి మాట్లాడటానికి వీల్లేదు.