అవినీతి విష పుత్రికగా సాక్షి పత్రిక గురించి పాత్రికేయ వర్గాలు అభివర్ణిస్తుంటాయి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో కాంగ్రెస్ పార్టీ కోసం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్థాపించిన రాజకీయ కర పత్రిక సాక్షి.
సాక్షి పత్రిక, సాక్షి న్యూస్ ఛానల్.. అప్పట్లో కాంగ్రెస్ పార్టీ కోసం పని చేసేవి. ఎప్పుడైతే వైఎస్ జగన్, కాంగ్రెస్ పార్టీని వదిలేశారో, ఆ తర్వాత సాక్షి ప్రయాణం మరింత నీఛమైన మార్గంలోకి అడుగు పెట్టింది.
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్థాపించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ‘టాయిలెట్ పేపర్’లా సాక్షి మారిపోయిందన్న విమర్శలున్నాయి. అందులో కొంత నిజం లేకపోలేదు కూడా. వైఎస్ జగన్ తన రాజకీయ ప్రత్యర్థుల మీద విష ప్రచారాలు చేయించడానికి సాక్షి మీడియాని నిర్లజ్జగా వాడుకున్నారు.
వైసీపీ అధికారంలోకి వస్తూనే, సాక్షి ఉద్యోగులకు ప్రభుత్వంలో నామినేటెడ్ పోస్టులు ఇప్పించుకున్నారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. వైసీపీ కార్యకర్తలకు వాలంటీర్ల ముసుగేసి, వాళ్ళతో సాక్షి పత్రికను కొనుగోలు చేయించేలా చేసి, ప్రజా ధనాన్ని సాక్షి పత్రికకు వైఎస్ జగన్ దోచి పెట్టిన వైనం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇక్కడితో ఆగలేదు.. పోసాని కృష్ణ మురళి లాంటోళ్ళతో రాజకీయ ప్రత్యర్థుల్ని తిట్టించడానికి సాక్షి ద్వారానే ప్రెస్ మీట్లు పెట్టించారు వైఎస్ జగన్.
ఈ విషయం పోసాని విచారణ సందర్భంగా వెల్లడయ్యింది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, ోలోకేష్ మీద అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన కేసులో పోసాని అరెస్టయిన సంగతి తెలిసిందే. విచారణ సందర్భంగా పోసాని విస్తుగొలిపే వాస్తవాలు వెల్లడించారు.
తనతో ప్రెస్ మీట్లు పెట్టించిందీ, మార్ఫింగ్ కంటెంట్ ఇచ్చిందీ సాక్షి మీడియాయేనని పోసాని కృష్ణ మురళి, పోలీసు విచారణలో వెల్లడించారు. ఇదంతా చూస్తోంటే, పాత్రికేయ రంగంలో సాక్షి విష పుత్రిక అనేది ఇంకోసారి నిరూపితమయినట్లే.
మరి, విచారణాధికారులు సాక్షి మీడియాకి నోటీసులు ఇచ్చి విచారణకు పిలుస్తారా.? సాక్షి మీడియాపై ఎలాంటి చర్యలుంటాయి.? వేచి చూడాల్సిందే.