నోటికొచ్చిందల్లా వాగితే, రాజకీయ ప్రత్యర్థుల ఇళ్ళల్లోని చిన్న పిల్లలపై అఘాయిత్యాలకు తెగబడతానంటూ రెచ్చిపోతే.. వ్యవస్థలు ఊరుకుంటాయా.? ఎప్పుడూ తామే అధికారంలో వుంటాం కాబట్టి, ఎలాంటి రాక్షసత్వానికైనా తెగబడొచ్చనుకుంటే కుదురుతుందా.? కుదరదు, ఇది ప్రజాస్వామ్యం.
సినీ నటుడు, నిర్మాత, దర్శకుడు పోసాని కృష్ణమురళి, వైసీపీ నేతగా వున్న సమయంలో చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలకు ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నారు. నిజానికి, అసలు సిసలు శిక్ష ఇంకా అనుభవించాల్సి వుంది. న్యాయస్థానం ఆయనకు శిక్ష ఎప్పుడు విధిస్తుందా.? అని లక్షలాది మంది, కోట్లాది మంది ఎదురు చూస్తున్నారు.
సరే, విషయం కోర్టు పరిధిలోకి వెళ్ళింది.. కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందన్నది ముందు ముందు తేలుతుంది. అయితే, అరెస్టయి ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా వున్న పోసాని కృష్ణమురలి, తనకు ఆరోగ్యం బాగాలేదనీ, బెయిల్ ఇవ్వకపోతే ఆత్మహత్యే శరణ్యమనీ.. న్యాయమూర్తి ముందర మొరపెట్టుకున్నారన్నది తాజాగా బయటకు వచ్చిన వార్తా కథనాల సారాంశం.
అదేంటీ, ప్రెస్ మీట్ పెట్టి మరీ, రాజకీయ ప్రత్యర్థులపై బూతులు తిట్టారు కదా పోసాని.. అప్పుడాయన, ఆరోగ్యం బాగానే వుందా.? అప్పట్లో డెత్ థ్రెట్స్ ఇచ్చిన పోసాని, ఇప్పుడేంటిలా ప్రాణ భయంతో విలవిల్లాడిపోతున్నారు.? ఈ ప్రశ్న సామాన్యుల్లో సహజంగానే చర్చనీయాంశమవుతుంది.
పోసాని చిన్న పిల్లాడేం కాదు. ఏం మాట్లాడితే ఏమవుతుందో బాగా తెలుసు. అప్పట్లో వైసీపీ నుంచి ఆర్థికంగా పోసాని లాభపడ్డారు. రాజీయంగా ఏదో పదవి కూడా చేపట్టారు. డబ్బులిస్తే నోటికొచ్చినట్లు వాగడమేనా.? పైగా, డెత్ థ్రెట్స్ ఇవ్వడమా.? అన్న విషయమై తనను తాను ప్రశ్నించుకోగలరు పోసాని.
అయినాగానీ, అహంకారంతో కళ్ళు మూసుకుపోయాయ్. అందుకే, వైసీపీ ఓడిపోగానే, రాజకీయాలకు గుడ్ బై చెబుతున్నట్లు ప్రకటించేశారు. కానీ, చేసిన పాపం.. ఆయన మెడకి చుట్టుకోకుండా వుండదు కదా.! అయినా, న్యాయస్థానం ముందు ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తే, బెయిల్ వస్తుందని ఏ నీఛ నికృష్ట రాజకీయం, పోసాని కృష్ణమురళికి ‘బోడి’ సలహా ఇచ్చిందో ఏమో.!