ఇప్పుడు టాలీవుడ్ లో వేధింపుల ఆరోపణలు దుమారం రేపుతున్నాయి. ప్రస్తుతం జానీ మాస్టర్ వివాదం కొనసాగుతుండగానే ఒక్కొక్కరుగా బయటకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇదే అదునుగా నటి పూనమ్ కౌర్ సంచలన ట్వీట్ చేసింది. ఎప్పుడూ వివాదాల్లో ఉండే ఈ నటి ఇప్పుడు ఏకంగా ఓ స్టార్ డైరెక్టర్ ను టార్గెట్ చేసింది. ముందు అతన్ని విచారించాలంటూ డిమాండ్ చేస్తోంది. ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరో కాదు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. దాంతో ఒక్కసారిగా ఈ ట్వీట్ సంచలనం రేపుతోంది.
గతంలో త్రివిక్రమ్ మీద ఆమె ఇన్ డైరెక్ట్ గా ఆరోపణలు చేసింది. కానీ ఇప్పుడు మాత్రం నేరుగానే ఆరోపణలు చేస్తోంది. దాంతో ఆమె చేసిన ట్వీట్ కాస్త పెద్ద దుమారమే రేపుతోంది. తాను గతంలోనే త్రివిక్రమ్ మీద ఫిర్యాదు చేశానని.. కాకపోతే తనకు పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ లేదని అప్పట్లో దాన్ని పక్కన పెట్టేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తోంది. కానీ ఇప్పుడు కచ్చితంగా త్రివిక్రమ్ ను విచారించాలంటూ ఆమె డిమాండ్ చేస్తోంది. దాంతో మరోసారి త్రివిక్రమ్ వివాదంలోకి వచ్చారు. అయితే పూనమ్ కౌర్ కేవలం ట్వీట్ తోనే ఆగిపోతుందా లేదా మళ్లీ ఫిర్యాదు చేస్తుందా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
అయితే పూనమ్ కౌర్ గనక ఫిల్మ్ ఛాంబర్ కు వెళ్లి ఫిర్యాదు చేస్తే మాత్రం ఇది పెద్ద సంచలనమే అవుతుందని అంటున్నారు. దీన్ని ఎలా చూడాలనేది మాత్రం ఇప్పుడు ఆసక్తికరంగా మారిపోయింది. పూనమ్ ఎంట్రీతో జానీ మాస్టర్ వివాదం పక్కకు పోయి త్రివిక్రమ్ తెరమీదకు వచ్చేలా కనిపిస్తున్నాడని అంటున్నారు.