టాలీవుడ్ లో పూజ హెగ్డే టాప్ స్థాయిని అందుకుని చాలా కాలమే అయింది. వరసగా టాప్ చిత్రాలను హయ్యస్ట్ సక్సెస్ రేట్ తో అందుకున్న పూజ ఇప్పుడు హాలిడేస్ ను ఎంజాయ్ చేయడానికి మాల్దీవ్స్ కు వెళ్ళింది. రీసెంట్ గా ఆచార్య, రాధే శ్యామ్, పలు హిందీ చిత్రాల షూట్స్ తో బిజీగా గడిపిన పూజ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ తో మరో సక్సెస్ ను తన ఖాతాలో వేసుకుంది.
కరోనా తర్వాతి నుండి సెలబ్రిటీలకు ఫెవరెట్ హాలిడే డెస్టినేషన్ అంటే కచ్చితంగా మాల్దీవ్స్ గా మారింది. చాలా మంది సెలబ్రిటీలు అక్కడికి వెళ్లి వచ్చారు. ముఖ్యంగా హీరోయిన్లు మాల్దీవ్స్ కు వెళ్లి బికినీల్లో అందరికీ ట్రీట్ ఇచ్చారు.
ఇప్పుడు పూజ హెగ్డే కూడా అదే కోవలోకి చేరింది. బ్రౌన్ మోనోకిని ధరించి వివిధ ఫోజుల్లో హొయలు పోతోంది. ఆ ఫోటోలు ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో వైరల్ అవుతున్నాయి.