Switch to English

పొన్నియన్ సెల్వన్‌ 1 రివ్యూ : తమిళ ఆడియన్స్ కి మాత్రమే

Critic Rating
( 2.25 )
User Rating
( 2.20 )

No votes so far! Be the first to rate this post.

91,313FansLike
56,999FollowersFollow
Movie పొన్నియిన్ సెల్వన్ 1
Star Cast విక్రమ్, ఐశ్వర్యరాయ్ బచ్చన్, జయం రవి, కార్తీ, త్రిష
Director మణిరత్నం
Producer మణిరత్నం, సుభాస్కరన్ అల్లిరాజా
Music AR రెహమాన్
Run Time 2 గం 47 నిమిషాలు
Release 30 సెప్టెంబర్ 2022

గత కొన్ని సంవత్సరాలుగా సినీ ప్రేమికులను ఊరిస్తున్న మణిరత్నం పొన్నియన్ సెల్వన్‌ ఎట్టకేలకు వచ్చేసింది. ఈ సినిమా కోసం భారీగా ఖర్చు చేయడంతో పాటు.. భారీగా పబ్లిసిటీ చేశారు. మరి సినిమా ఫలితం ఎలా ఉందో ఈ రివ్యూలో చర్చిద్దాం.

కథ :

చోళ రాజు యొక్క గొప్పతనం, చోళ రాజ్యం యొక్క విశిష్టతలను వివరిస్తూ ఈ కథ సాగుతుంది. కథకు కల్కి కృష్ణమూర్తి రాసిన నవల పొన్నియన్‌ సెల్వన్‌ ఆధారం అనే విషయం తెల్సిందే. చోళ రాజ్యంను జయించేందుకు కొందరు ప్రయత్నించడం.. వారిని రాజు ఆదిత్య కరికాలుడు(విక్రమ్‌) ఎదుర్కొన్న తీరును కథలో చూపించడం జరిగింది. చోళ రాజ్యంపై జరిగిన దండయాత్రల్లో కుందవాయి.. నందిని పాత్రలు ఏ విధంగా ముడిపడి ఉన్నాయి అనేది సినిమాను థియేటర్లలో చూసి తెలుసుకోవాల్సిందే.

నటీనటులు :

చోళ రాజుగా విక్రమ్‌ తన నటనతో మెప్పించాడు. ప్రతి సన్నివేశంలో కూడా ఆయన బాడీ లాంగ్వేజ్ ముఖ్యంగా లుక్‌ ఆకట్టుకునే విధంగా ఉంది. ఇక అరుణ్‌ మోళి వర్మ పాత్రలో జయం రవి కెరీర్‌ బెస్ట్‌ ఇచ్చాడు అనడంలో సందేహం లేదు. కార్తీకి తగ్గ పాత్ర దక్కింది. అందులో తాను జీవించేశాడు. త్రిష మరియు ఐశ్వర్యరాయ్ లు పోటీ పడి మరీ నటించారు. వారి అందంను ఒకే సారి స్క్రీన్‌ పై చూడ్డానికి బాగుంది. ఇక ప్రకాష్ రాజ్‌.. శరత్‌ కుమార్‌.. ఐశ్వర్య లక్ష్మి.. శోబితా ధూళిపాళ్ల వంటి మరికొందరు నటీనటులకు పూర్తి స్థాయిలో తమ సత్తా చూపించే అవకాశం దక్కలేదు. ఉన్నంతలో పర్వాలేదు అనిపించారు.

సాంకేతిక నిపుణులు:

ఆస్కార్‌ విజేత రహమాన్ తన స్థాయి సంగీతాన్ని అందించలేక పోయారు. పాటలు తెలుగు ప్రేక్షకులకు పెద్దగా నచ్చే విధంగా లేవు. బ్యాక్ గ్రౌండ్‌ స్కోర్ కూడా గొప్పగా ఏమీ లేదు. కొన్ని సన్నివేశాల్లో బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్ పర్వాలేదు అనిపించినా మొత్తంగా చూసుకుంటే మాత్రం నిరాశ పర్చిందనే చెప్పాలి. రవి వర్మన్‌ సినిమాటోగ్రఫీ అద్భుతమైన ఆర్ట్‌ వర్క్ ని చక్కగా చూపించడంలో సఫలం అయ్యింది. నాచురాలిటీకి దగ్గరగా తీసుకు వచ్చే ప్రయత్నం చేశారు.

ఎడిటింగ్‌ పర్వాలేదు కానీ సినిమాను ఇంకాస్త ట్రిమ్‌ చేసి ఉంటే ఇంకా బాగుండేది. పీరియాడిక్ డ్రామా.. అది కూడా భారీ స్టార్‌ కాస్టింగ్‌ మరియు భారీ సెట్టింగ్స్ తో ప్రొడక్షన్‌ వ్యాల్యూస్ బాగున్నాయి. ఇక దర్శకుడు మణిరత్నం తనదైన మార్క్‌ ను చూపించలేక పోయాడు అనే చెప్పాలి. కొన్ని సన్నివేశాలు పర్వాలేదు అనిపించినా ఓవరాల్‌ గా మాత్రం భారీగా ఊరించుకున్న వారికి నిరాశ తప్పదు.

పాజిటివ్ పాయింట్స్ :

  • స్టోరీ,
  • నటీనటుల నటన

మైస్ పాయింట్స్ :

  • వీఎఫ్‌ఎక్స్‌
  • స్క్రీన్‌ ప్లే
  • యాక్షన్ సన్నివేశాలు

విశ్లేషణ :

దర్శకుడు మణిరత్నం డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ అంటూ ప్రచారం జరగడంతో అంచనాలు భారీగా నమోదు అయ్యాయి. అంచనాలకు తగ్గట్లుగా దర్శకుడు సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడంలో విఫలం అయ్యాడనే చెప్పాలి. పొన్నియన్ సెల్వన్ నవల చదవని వారికి పాత్రలను వెంటనే అర్థం చేసుకోవడం కాస్త కష్టమే.. తమిళ ప్రేక్షకులకు పర్వాలేదు అనిపించవచ్చు… కానీ ఇతర భాషల ప్రేక్షకులకు మాత్రం ఈ సినిమా సో సో గానే అనిపిస్తుంది.

తెలుగుబులెటిన్ రేటింగ్: 2.25/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

స్నో మ్యాన్ ఛాలెంజ్.! బిగ్ బాస్ హౌస్‌లో ‘మగధీర’.!

బాబోయ్.. ఇదేం టాస్క్ మహాప్రభో.! అది కూడా టిక్కెట్ టు ఫినాలె కోసం జరిగిన టాస్క్. ఇందులో కంటెస్టెంట్లు ఎంత సీరియస్‌గా పాల్గొనాలి.? కానీ, అందరికీ...

పిక్ టాక్: చీర కట్టు ఊర్వశి… మతిపోగొడుతున్న రాక్షసి

రీసెంట్ గా ఊర్వశివో రాక్షసివో చిత్రంలో కనిపించింది అను ఇమ్మానుయేల్. చాలా కాలం తర్వాత ఆమెకు మంచి రోల్ పడింది. అల్లు శిరీష్ సరసన నటించి...

దిల్ రాజు రెండో పెళ్లి వెనుక ఏం జరిగిందో తెలుసా?

ఇటీవలే అగ్ర నిర్మాత దిల్ రాజు ప్రముఖ టాక్ షో ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేకు గెస్ట్ గా వచ్చిన విషయం తెల్సిందే. ఈ ప్రోగ్రాంలో...

కాంట్రావర్సి సమసిపోయింది- ‘యశోద’ నిర్మాత కృష్ణప్రసాద్

సమంత టైటిల్ పాత్రలో హరి, హరీష్ దర్శకత్వంలో శ్రీదేవి మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించిన సినిమా 'యశోద'. నవంబర్ 11న...

ఈ అవార్డు నాకెంతో ప్రత్యేకం.. జీవితాంతం సినిమాల్లోనే: చిరంజీవి

‘గతంలో నిర్వహించిన చలన చిత్రోత్సవాల్లో ఒక్క దక్షిణాది నటుడి ఫొటో లేదని బాధపడ్డా.. ఇప్పుడు ఇక్కడే అవార్డు అందుకోవడం ఆనందంగా ఉంది. ఈ అవార్డు ఇచ్చినందుకు...

రాజకీయం

వైఎస్ షర్మిలకు బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు

వైఎస్ షర్మిలకు నాంపల్లి కోర్టు లో ఊరట లభించింది. వ్యక్తి గత పూచికత్తుపై ఆమెకు బెయిల్ కోర్టు మంజూరు చేసింది. షర్మిలతో పాటు మరో ఐదుగురికి కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. ప్రగతి...

ఉపాధ్యాయులకు బిగ్ రిలీఫ్..! రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

ఉపాధ్యాయుల విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉపాధ్యాయులను ఇకపై బోధనేతర విధుల నుంచి తప్పిస్తూ పాఠశాల విద్యాశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. సవరించిన నిబంధనల ప్రకారం ఇకపై ఉపాధ్యాయులు విద్యా...

న్యాయస్థానాల్లో తీర్పులు.! తెలుగు మీడియాలో వక్రభాష్యాలు.!

సర్వోన్నత న్యాయస్థానంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయమై వాదోపవాదాలు జరిగాయి. రాజధాని అమరావతి విషయంలో రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుల్ని సర్వోన్నత న్యాయస్థానంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సవాల్ చేసిన సంగతి తెలిసిందే. హైకోర్టు తీర్పుల్లోని...

అరెస్టు బాధాకరమట.! సజ్జల నోట తియ్యని మాట.! విజయమ్మ బెదిరింపులు.!

తెలంగాణలో అరెస్టు బాధాకరం.! ఆంధ్రప్రదేశ్‌లో అరెస్టు మాత్రం ‘చట్టం తన పని తాను చేసుకుపోవడం’.! రాజకీయ నాయకులు రెండు నాల్కల ధోరణితో వుంటారనడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి.? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు...

జస్ట్ ఆస్కింగ్: ఎవరి తల ఎక్కడ పెట్టుకోవాలి.?

2019 ఎన్నికల సమయంలో జరిగిన వైఎస్ వివకానందరెడ్డి దారుణ హత్యకు సంబంధించి దోషులెవరన్నదీ తేలలేదు.! అసలంటూ దేశంలో న్యాయం జరుగుతుందా.? అన్న ప్రశ్న, ఇదిగో ఇలాంటి కేసుల సందర్భంగానే తెరపైకొస్తుంటుంది. వివేకానందరెడ్డి అంటే ఆషామాషీ...

ఎక్కువ చదివినవి

నటీమణులపై అసభ్యకర పోస్టులు… అనసూయ ఫిర్యాదు… నిందితుడి అరెస్ట్

సినీ నటులు, యాంకర్లు అని తేడా లేకుండా సెలబ్రిటీల ఫోటోలను మార్ఫింగ్ చేసి అసభ్య పదజాలంతో సామజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతోన్న వ్యక్తిని సైబరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 17న...

జంట నగరాల్లో బ్లడ్ కొరత.. మెగా బ్లడ్ బ్రదర్స్ చేయూత..

ఇటీవలి కాలంలో హైద్రాబాద్ జంట నగరాల్లో రక్త నిధుల కొరత ఏర్పడి.. పేద రోగులు రక్తం దొరకక పలు ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న పలువురు మెగాభిమానులు రక్తదాన శిబిరాలు నిర్వహించేందుకు...

‘తోడేలు’ చిత్రం నుండి ‘అంతా ఓకేనా’ వీడియో సాంగ్

"కాంతార" భారీ విజయం తరువాత "గీతా ఫిలిం డిస్ట్రిబ్యూషన్" ఇప్పుడు వరుణ్ ధావన్, కృతి సనన్ నటిస్తున్న "భేదియా" చిత్రంతో మరో హారర్-కామెడీ యూనివర్స్‌ సినిమాను తెలుగు ప్రేక్షకులుకు అందించడానికి సిద్దమవుతుంది. తెలుగులో...

హైదరాబాద్ లో ఘోరం..! పదో తరగతి విద్యార్ధినిపై తోటి విద్యార్ధులు గ్యాంగ్ రేప్

హైదరాబాద్ లో మరో ఘోరం జరిగింది. పదో తరగతి చదువుతున్న బాలికపై అదే తరగతిలోని తోటి విద్యార్ధులు ఐదుగురు కలిసి ఆమెపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టిన దారుణ ఘటన కలకలం రేపుతోంది. ఈ...

వైఎస్ షర్మిలకు బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు

వైఎస్ షర్మిలకు నాంపల్లి కోర్టు లో ఊరట లభించింది. వ్యక్తి గత పూచికత్తుపై ఆమెకు బెయిల్ కోర్టు మంజూరు చేసింది. షర్మిలతో పాటు మరో ఐదుగురికి కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. ప్రగతి...