Chiranjeevi: ‘నమ్ముకున్నవారు చేతులెత్తేసారు.. సాయం చేయలేదు.. ప్రాణం మీద ఆశ వదిలేసిన సమయంలో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) గారు నాకు పునర్మజన్మ ఇచ్చారు. రూ.58లక్షలు ఖర్చు చేసి నాకు కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయించారు. నేను రూపాయి కట్టలేద’ని తమిళ నటుడు పొన్నాంబళం (Ponnambalam) అన్నారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుడూ..
‘నిర్మాతగా 3 సినిమాలు ఫ్లాపయ్యాయి. అప్పుడే కిడ్నీలు పాడై అనారోగ్యానికి గురయ్యాను. డయాలసిస్ కు కూడా డబ్బుల్లేవు. నాకు చిరంజీవిగారు గుర్తొచ్చి ఫోన్ చేసి పరిస్థితి వివరించాను. వెంటనే స్పందించిన ఆయన నా అకౌంట్ లో డబ్బు వేసి అపోలో ఆసుపత్రికి వెళ్లమని చెప్పారు. ఉపాసన గారు ఫోన్ చేసి తాను రామ్ చరణ్ భార్యనని చెప్పారు. మావయ్య మీ గురించి చెప్పారు.. ఆసుపత్రికి వెళ్లమని చెప్పారు. ఆమె మాటలు విన్న నేను ఆశ్చర్యపోయాను’.
‘చిరంజీవిగారి వల్లే నేనింకా ప్రాణాలతో ఉన్నాను. చిరంజీవిగారు లేకపోతే నా పరిస్థితి దయనీయంగా మారేది. ఈరోజు ప్రాణాలతో ఉన్నానంటే చిరంజీవిగారే కారణమ’ని పొన్నాంబళం అన్నారు.