పోల్‌: శాసన మండలి రద్దుని సమర్థిస్తారా.?

ఒకే ఒక్క పదం మండలిని రద్దు చేయించింది తెలుసా?

శాసన మండలిని రాష్ట్ర పరిధిలో పెద్దల సభగా అభివర్ణిస్తాం. అలాగని శాసన మండలికి, శాసన సభ కంటే ఎక్కువ అధికారాలు వుంటాయా.? అంటే అదీ లేదు. పెద్దల సభ కేవలం సూచనలు మాత్రమే చేస్తుంది. నిజానికి పెద్దల సభని రాజకీయ నిరుద్యోగులకి పునరావాస కేంద్రంగా రాజకీయ పరిశీలకులు అభివర్ణిస్తుంటారు. దానికి బలమైన కారణం కూడా లేకపోలేదు. ప్రజా క్షేత్రంలో గెలవలేమనుకున్నవారు, డబ్బులు ఖర్చు చేసి పెద్దల సభకు నామినేట్‌ అవడం అనేది రాష్ట్ర స్థాయిలో శాసన మండలి విషయంలోనూ, జాతీయ స్థాయిలో రాజ్యసభ విషయంలోనూ జరుగుతుంటుంది. ఈ ‘పాపం’ వెనుక అన్ని రాజకీయ పార్టీల పాత్రా వుందన్నది ఓపెన్‌ సీక్రెట్‌.

ఇప్పుడీ పెద్దల సభ విషయమై తెలుగు రాష్ట్రాల్లోనూ, జాతీయ స్థాయిలోనూ ఇంతటి చర్చ జరగడానికి కారణం, ఆంధ్రప్రదేశ్‌లో శాసన మండలి రద్దుకి వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం తీర్మానం చేయడమే. అధికారం చేతిలో వుంది కాబట్టి, నచ్చనివన్నీ రద్దు చేసుకుంటూ పోతానంటే.. అది మూర్ఖత్వమే అవుతుంది. ఇది రాచరిక వ్యవస్థ కాదు.. ప్రజాస్వామ్యం. పార్లమెంటు స్థాయీ సంఘం ఒకటి గతంలో శాసన మండలి వ్యవహారంపై సుదీర్ఘ మంతనాలు జరిపి, కొన్ని డైరెక్షన్స్‌ ఇచ్చింది.

దాని ప్రకారం ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా ఇష్టమొచ్చినట్లు శాసన మండలిని రద్దు చేస్తామంటే కుదరదు. ఇది తెలిసీ, వైఎస్‌ జగన్‌ సర్కార్‌ ‘దూకుడు’ ప్రదర్శించింది. ఈ నేపథ్యంలో శాసన మండలి రద్దుపై ప్రజలేమనుకుంటున్నారు.? ఇది తెలుసుకునేందుకే ఈ పోల్‌. మీ అభిప్రాయాన్ని పోల్‌ ద్వారా పంచుకోండి.

పోల్‌: శాసన మండలి రద్దుని సమర్థిస్తారా.?

View Results

Loading ... Loading ...