మాజీ ఎంపీ, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్.షర్మిల మధ్య ట్విట్టర్లో మాటల యుద్ధం ముదురుతోంది.
తాము వదిలిన ‘బాణం’ తానా అంటే తందానా అంటున్న ‘తామర పువ్వులు’ అని కవిత ట్వీట్ చేశారు. ఇందుకు షర్మిల స్పందిస్తూ.. పాదయాత్రలు చేసింది లేదు.. ప్రజల సమస్యలు చూసింది లేదు.. ఇచ్చిన హామీల అమలు లేదు.. పదవులే కానీ పనితనం లేని గులాబీ తోటలో ‘కవిత’లకు కొదవ లేదు అని షర్మిల అన్నారు. షర్మిల రీట్వీట్ కు కవిత తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు.
‘అమ్మా.. కమల బాణం, ఇది మా తెలంగాణం, పాలేవో నీళ్ళేవో తెలిసిన చైతన్య ప్రజా గణం. మీకు నిన్నటిదాకా పులివెందులలో ఓటు, నేడు తెలంగాణ రూటు, మీరు కమలం కోవర్టు ఆరేంజ్ ప్యారెట్టు. మీ లాగా పొలిటికల్ టూరిస్ట్ కాను నేను, రాజ్యం వచ్చాకే రాలేదు నేను, ఉద్యమంలో నుంచి పుట్టిన మట్టి ‘కవిత’ను నేను’ అని కవిత కౌంటర్ ఇచ్చారు.
తాము వదిలిన “బాణం”
తానా అంటే తందానా అంటున్న “తామర పువ్వులు”— Kavitha Kalvakuntla (@RaoKavitha) November 30, 2022
అమ్మా.. కమల బాణం
ఇది మా తెలంగాణం
పాలేవో నీళ్ళేవో తెలిసిన
చైతన్య ప్రజా గణంమీకు నిన్నటిదాకా పులివెందులలో ఓటు
నేడు తెలంగాణ రూటు
మీరు కమలం కోవర్టు
ఆరేంజ్ ప్యారేట్టుమీ లాగా
పొలిటికల్ టూరిస్ట్ కాను నేను
రాజ్యం వచ్చాకే రాలేదు నేను
ఉద్యమంలో నుంచి పుట్టిన
మట్టి " కవిత" ను నేను ! https://t.co/rkGthDtHF9— Kavitha Kalvakuntla (@RaoKavitha) November 30, 2022