Switch to English

పొలిటికల్‌ వైరస్‌: లిక్కర్‌ ‘క్యూ’ లైన్లలో టీడీపీ మాఫియా?

గుంటూరు, కర్నూలు జిల్లాల్లో కరోనా వైరస్‌ వ్యాప్తిపై అధికార వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ చిత్ర విచిత్రమైన ఆరోపణలు చేసింది కొన్నాళ్ళ క్రితం. తెలుగుదేశం పార్టీ పనిగట్టుకుని స్లీపర్‌ సెల్స్‌ని రంగంలోకి దించి కరోనా వైరస్‌ వ్యాప్తి కోసం ప్రయత్నించిందంటూ సాక్షాత్తూ మంత్రి మోపిదేవి వెంకటరమణ ఆరోపించిన విషయం విదితమే. విపక్షాలు ఈ తరహా ఆరోపణలు చేయడం సహజం. ప్రభుత్వాలు ఖండించడమూ మామూలే. అధికార పక్షం ఇలాంటి చెత్త ఆరోపణలు చేయడమేంటి.? ఇప్పుడు ఈ తరహా చెత్త ఆరోపణల పర్వంలో మరో మెట్టు కిందికి దిగజారింది అధికార వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ.

నిన్న మద్యం దుకాణాల్ని ఆంధ్రప్రదేశ్‌లో తెరిచారు. మందుబాబులు రెచ్చిపోయారు. సోషల్‌ డిస్టెన్స్‌ అనేది కన్పించలేదు లిక్కర్‌ షాపుల వద్ద. ఇది పూర్తిగా అధికార యంత్రాంగం వైఫల్యమే. లిక్కర్‌ షాప్‌ల వద్ద ప్రభుత్వ ఉపాధ్యాయుల్ని కూడా ‘కాపలా’ పెట్టారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ మంత్రి పేర్ని నాని, ఆ మద్యం దుకాణాల దగ్గర గలాటాకి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే కారణమని తేల్చారు. ప్రభుత్వంపై విమర్శలు చేయడం కోసం తెలుగుదేశం పార్టీనే కొందరు ఆందోళనకారులతో అలా చేయించిందన్నది పేర్ని నాని ఆరోపణ.

నవ్విపోదురుగాక మనకేటి.? అన్నట్టుంది ప్రభుత్వ వైఖరి. లేకపోతే, ప్రభుత్వం చేతిలోనే అధికారం వుంది. ఆరోపణలు చేయడమెందుకు.? నిజాలు నిగ్గు తేల్చి, టీడీపీ నేతల్ని అరెస్ట్‌ చేయొచ్చు కదా.! అన్నట్టు, అధికార పార్టీ కరోనా వైరస్‌ విషయంలో ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందో చెప్పడానికి ఈ రోజు హైకోర్టు, అధికార పార్టీకి చెందిన పలువురు ప్రజా ప్రతినిథులకు శ్రీముఖాలు పంపడమే నిదర్శనం. లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించారంటూ సదరు ప్రజా ప్రతినిథులపై న్యాయస్థానంలో వాజ్యం నమోదు కాగా, విచారణ చేపట్టిన ధర్మాసనం, ఆ ప్రజా ప్రతినిథులకు నోటీసులు జారీ చేయడమే కాదు, వారిపై ఎలాంటి చర్యలు తీసకున్నారో చెప్పాలంటూ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అంతే కాదు, వారికి కరోనా పరీక్షలు చేయించారా.? అని ప్రశ్నించింది కూడా.

దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో కరోనా రాజకీయాలు అత్యంత అధమ స్థాయికి చేరాయనడానికి తాజా పరిణామాలు నిదర్శనం. కరోనా వైరస్‌ని మించిన పొలిటికల్‌ వైరస్‌.. రాష్ట్రాన్ని నాశనం చేస్తోంది. వైసీపీ – టీడీపీ మధ్య జరుగుతున్న పొలిటికల్‌ ఫైట్‌ మాటేమోగానీ, ఈ పొలిటికల్‌ వైరస్‌తో రాష్ట్రం విలవిల్లాడిపోతోంది. మరీ ముఖ్యంగా ప్రభుత్వ అసమర్థత, మంత్రుల మాటలతోనే స్పష్టమవుతుండడం గమనార్హమిక్కడ.

సినిమా

దేవరకొండ తర్వాత దగ్గుబాటితో ఖరారు?

ఇస్మార్ట్‌ శంకర్‌ చిత్రంతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన దర్శకుడు పూరి జగన్నాద్‌ ప్రస్తుతం విజయ్‌ దేవరకొండతో భారీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ను తెరకెక్కిస్తున్నాడు. పాన్‌ ఇండియా మూవీగా...

పుకార్లన్నింటికి చెక్‌ పెట్టేందుకు పెళ్లి

బాలీవుడ్‌ హీరోయిన్స్‌ ఇద్దరు ముగ్గురిని ప్రేమించడం ఆ తర్వాత బ్రేకప్‌ అవ్వడం చాలా కామన్‌ విషయాలు. అయితే సౌత్‌ లో మాత్రం హీరోయిన్స్‌ ఎక్కువ లవ్‌...

ఎట్టకేలకు తిరుమలేషుడి దర్శన భాగ్యం

కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్‌ డౌన్‌ కారణంగా దేశ వ్యాప్తంగా అన్ని దేవాలయాల్లోకి భక్తులను అనుమతించని విషయం తెల్సిందే....

ప్రభాస్‌20 ఫస్ట్‌లుక్‌కు అంతా రెడీ

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ సాహో చిత్రం విడుదలకు ముందు ప్రారంభం అయిన రాధాకృష్ణ మూవీ ఇంకా విడుదల కాలేదు. విడుదల సంగతి అలా ఉంచి...

కోటీశ్వరులు అయిన ఈ స్టార్స్‌ ఫస్ట్‌ రెమ్యూనరేషన్‌ ఎంతో తెలుసా?

ప్రస్తుతం సినిమాల్లో నటిస్తూ కోట్లు సంపాదిస్తున్న స్టార్స్‌ ఒకప్పుడు కనీసం తిండికి కూడా ఇబ్బందులు పడ్డ సందర్బాలు చాలానే ఉన్నాయి. వాటిని ఆయా స్టార్స్‌ చెబుతున్న...

రాజకీయం

ఫ్లాష్ న్యూస్: శ్రీశైలం మల్లన్న అక్రమార్కులను పట్టేసిన పోలీసులు

ఏపీలోని ప్రముఖ శైవ క్షేత్రం అయిన శ్రీశైలం మల్లన్న ఆలయంలో అధికారులు మరియు ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు కుమ్మక్కు అయ్యి స్వామి వారి ఆదాయంను భారీగా దోచుకున్నారు అంటూ కొన్ని రోజుల క్రితం...

మద్యం అక్రమ రవాణాతో వారికి సైడ్ బిజినెస్

ఏపీలో దొరికే మద్యం బ్రాండ్లలో ఎక్కువగా పేరున్నవి లేకపోవడంతో తెలంగాణలో దొరికే మద్యానికి ఫుల్ డిమాండ్ ఏర్పడింది. దీంతో అక్రమ మద్యం తరలింపు ఎక్కువవుతోంది. తెలంగాణ నుంచి తెచ్చే ఒక్కో ఫుల్‌ బాటిల్‌ను...

రామాయణాన్ని వక్రీకరించారంటూ టీటీడీపై విమర్శలు

హిందువుల మనోభావాలకు టీటీడీ లాంటి ధార్మిక సంస్థ చాలా జాగ్రత్రగా ఉండాలి. టీటీడీ నుంచి వచ్చే సప్తగిరి మాసపత్రికలో జరిగిన పొరపాటు ఇప్పుడు టీటీడీని వివాదాల్లోకి నెడుతోంది. టీటీడీ నుంచి ప్రతి నెలా...

మీడియాకి అలర్ట్: మీడియాపై కేసులు పెట్టే టీంని రంగంలోకి దింపిన వైసీపీ వైసీపీ

ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరాధారమైన, వాస్తవ విరుద్ధమైన, తప్పుడు కథనాలు ప్రచురించినా.. ప్రసారం చేసినా సదరు మీడియా సంస్థలపై కేసులు పెట్టే అధికారాన్ని ఆయా శాఖల అధిపతులకు కట్టబెడుతూ జగన్ సర్కారు జీవో నెం.2430...

ఏపీలో తెరపైకి కొత్త ఎస్ఈసీ?

ఏపీలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నియామక వ్యవహారం కొత్త మలుపులు తిరుగుతోంది. నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎస్ఈసీగా నియమించకూడదనే రీతిలో రాష్ట్ర ప్రభుత్వం సాగుతోంది. హైకోర్టు తీర్పును సవాల్...

ఎక్కువ చదివినవి

‘ఓటీటీ’ దుమ్ము దులిపే ‘సినిమా’ కావాలి

లాక్ డౌన్ కారణంగా రెండు నెలలుగా థియేటర్లు మూతబడ్డాయి. ఇప్పటికీ థియేటర్ల పునఃప్రారంభంపై అనిశ్చితి కొనసాగుతూనే ఉంది. ఒకవేళ తెరిచినప్పటికీ ప్రేక్షకులు మునుపటిలా థియేటర్లకు వస్తారో, రారో అనే అనుమానాలు రోజురోజుకీ పెరుగుతూనే...

‘కరోనా’ కేవలం ప్రారంభం మాత్రమే.!

అ!, కల్కి చిత్రాల దర్శకుడు ప్రశాంత్ వర్మ మూడో సినిమాతో వచ్చేస్తున్నాడు. కొన్ని నెలల క్రితం కరోనా వైరస్ నేపధ్యంలో ఒక చిత్రాన్ని చేయబోతున్నట్లు ప్రకటించిన ప్రశాంత్ నిన్న ఆ చిత్రానికి సంబంధించిన...

‘కరోనా వ్యాక్సీన్’ తయారు చేస్తున్న అ! దర్శకుడు

యువదర్శకుడు ప్రశాంత్ వర్మ మూడో సినిమాతో రాబోతున్నాడు. మొదరి చిత్రం అ! తో విమర్శకుల మెప్పు సాధించిన ప్రశాంత్ రెండో ప్రయత్నంగా సీనియర్ హీరో రాజశేఖర్ తో ‘కల్కి’ అనే చిత్రం తెరకెక్కించాడు....

కైలాష్ ఖేర్ ‘మ్యాడ్’ మూవీ పాటకి మంచి స్పంద‌న.!

ప్రస్తుత జనరేషన్ ని ప్రతిబింబించేలా పెళ్లి, సహజీవనంలో ఉన్న రెండు జంటల కథతో రాబోతున్న చిత్రం "మ్యాడ్".ఈ మూవీ ఫస్ట్ లుక్ ని రీసెంట్ గా రిలీజ్ చేసింది చిత్ర యూనిట్.ఫ‌స్ట్ లుక్...

ఏపీలో తెరపైకి కొత్త ఎస్ఈసీ?

ఏపీలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నియామక వ్యవహారం కొత్త మలుపులు తిరుగుతోంది. నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎస్ఈసీగా నియమించకూడదనే రీతిలో రాష్ట్ర ప్రభుత్వం సాగుతోంది. హైకోర్టు తీర్పును సవాల్...