Switch to English

జస్ట్ ఆస్కింగ్: కుక్క గట్టిగా మొరిగితే సింహం అయిపోతుందా.?

అధికార పార్టీకి చెందిన ఓ నేత సోషల్ మీడియా వేదికగా ‘కుక్క గట్టిగా మొరిగితే సింహం అయిపోతుందా.?’ అంటూ ట్వీటేశారు. నిజానికి, ఇది కొత్త మాట కాదు. గత కొద్ది రోజులుగా సోషల్ మీడియా వేదికగా ఇలాంటి కామెంట్లు చాలానే వినిపిస్తున్నాయి రాజకీయ నాయకులకి. నిజానికిది వాస్తవం. ఎవరైనాసరే.. ఏ రాజకీయ నాయకుడైనాసరే.. గట్టిగా మొరిగితే ‘కుక్క’ అనిపించుకుంటారు తప్ప, ‘నాయకుడు’ అనిపించుకోలేరు. పదవుల్లో కూర్చున్నంతమాత్రాన సింహాలైపోరు. అందుకే, ‘కనకపు సింహాసనము మీద శునకమును కూర్చుండబెట్టిన, వెనకటి గుణమేల మాను..’ అంటూ పెద్దలు ఎప్పుడో చెప్పారు. ఆయనో బూతుల మంత్రి.. గత చరిత్ర తాలూకు ఆనవాళ్ళు మర్చిపోకుండా, మీడియా ముందు బూతులు మాట్లాడుతుంటారు.

 

‘దయచేసి, ఈ ఇంటర్వ్యూలో మీరు బూతులు మాట్లాడరని ఆశిస్తున్నాను..’ అంటూ ఓ మహిళా జర్నలిస్టు, సదరు బూతుల మంత్రికి విజ్నప్తి చేయాల్సి వచ్చింది ఇంటర్వ్యూ సమయంలో. మరి, అధికార వైసీపీకి చెందిన ముఖ్య నేత ట్వీట్ వేసింది ఎవర్ని ఉద్దేశించి.? ఇక్కడ ‘కుక్క గట్టిగా మొరిగితే సింహం అయిపోతుందా.?’ అని ప్రశ్నించింది ఎవర్ని.? సరే, ఇక్కడ ఎవరూ తక్కువ కాదు. దేశమంతా ఆంధ్రపదేశ్ వైపు చూసేలా చేస్తున్నారు.. ఆంధ్రపదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకులు. బూతులు తమకు తప్ప ఇంకెవరికీ రావన్నట్టుగా వుంది ఏపీ నేతల తీరు. నిజమే, ఇక్కడ వినిపిస్తున్నంత బూతులు దేశంలోని ఇంకే రాష్ట్రంలోనూ వినిపించడంలేదంటే అతిశయోక్తి కాదేమో. ముందంటూ తెలుగు మీడియాకి సెన్సార్ తప్పనిసరి.

 

న్యూస్ ఛానళ్ళ లైవ్ టెలికాస్ట్ విషయమై చర్చ జరగాలి. లేకపోతే, రాజకీయ నాయకుల బూతులకు హద్దూ అదుపూ లేకుండా పోతోంది. ఎవడు ఎంత గట్టిగా మొరిగితే అంత పెద్ద రాజకీయ నాయకుడైపోవచ్చన్న ‘కక్కుర్తి’ తప్ప, నేతలు మాట్లాడుతున్న మాటలు జనం వినలేకపోతున్నారన్న కనీస సోయ లేకుండా పోతోంది మరి. గట్టిగా మొరిగి సింహం అవ్వాల్సిన పనిలేదు.. అలా సింహం అయ్యామని ఎవరన్నా చెపుకుంటే అది రియల్ సింహం కాదు, గ్రామ సింహమే అవుతుంది. జంతువుల్లా ప్రవర్తించడం మానేసి, మనుషుల్లా మెలగండని.. ప్రజాస్వమ్యవాదులు రాజకీయ నాయకుల తీరు పట్ల వ్యాఖ్యానిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

రాజ్ కుంద్రా బెయిలు పిటిషన్ రద్దు..!

అశ్లీల వీడియోల కేసులో అరెస్టయిన రాజ్‌ కుంద్రా పోలీసు కస్టడీ మంగళవారంతో ముగియడంతో బెయిల్‌ పిటీషన్‌ దాఖలు చేశారు. అయితే.. ఈ విచారణను కోర్టు తిరస్కరించింది....

సంక్రాంతి సూపర్ క్లాష్ దాదాపు కన్ఫర్మ్ అయినట్లే?!

తెలుగు సినీ ప్రియులకు సంక్రాంతి పండగ చాలా ప్రత్యేకమైంది. అందులో ఎటువంటి సందేహం లేదు. ప్రతీ ఏటా సంక్రాంతికి బడా సినిమాలు విడుదలవుతూ ఉంటాయి. ఒక్క...

ప్రభాస్ ప్రాజెక్ట్ కె లో సామ్?

రెబెల్ స్టార్ ప్రభాస్ రీసెంట్ గా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సైన్స్ ఫిక్షన్ చిత్రాన్ని మొదలుపెట్టిన విషయం తెల్సిందే. బాలీవుడ్ బిగ్ బి అమితాబ్...

విజయ్ కు రిలీఫ్ ఇచ్చిన కోర్టు

మద్రాస్ హైకోర్టు తాజాగా ఇచ్చిన ఉత్తర్వుల్లో తమిళ టాప్ స్టార్ విజయ్ కు రిలీఫ్ ఇచ్చింది. లక్ష రూపాయల ఫైన్ ను గతంలో కోర్టు వేయగా...

తెలంగాణ యాసను నేర్చుకుంటోన్న నాని

న్యాచురల్ స్టార్ నాని యమా స్పీడుమీద సినిమాలు చేస్తున్నాడు. టక్ జగదీష్ ను విడుదలకు సిద్ధంగా ఉంచాడు. మరోవైపు శ్యామ్ సింగ రాయ్ షూటింగ్ ను...

రాజకీయం

బ్రేకింగ్: కర్ణాటక కొత్త సీఎంగా బసవరాజ్ బొమ్మై

కర్నాటక రాష్ట్ర సీఎంగా 'బసవరాజు బొమ్మై' ఖరారయ్యారు. ఈమేరకు బీజేపీ లెజిస్లేటివ్ నిర్ణయం తీసుకుంది. సోమవారం సీఎం పదవికి యాడియూరప్ప రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అనంతరం పలువురి పేర్లు పరిశీలించిన బీజేపీ...

సీఐడీ డీజీ సునీల్‌కుమార్‌ పై రఘురామ కీలక వ్యాఖ్యలు

ఏపీ సీఐడీ డీజీ సునీల్‌కుమార్‌ పై వైకాపా ఎంపీ రఘురామ కృష్ణరాజు కీలక వ్యాఖ్యలు చేశారు. సునీల్ కుమార్ ను బెయిల్‌ బ్యాచ్‌ అంటూ.. తనపై వ్యాఖ్యలు చేసే అర్హత లేదని విమర్శించారు....

పవన్ కళ్యాణ్‌ని నిద్ర లేపుతున్నారట.. తన్నించుకోవాలి కదా మరి.!

లేపి తన్నించుకోవడమంటే ఇదే మరి.! ‘వకీల్ సాబ్’ సినిమా విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎలాంటి కుట్రలు చేసిందో అందరికీ తెలిసిందే. టిక్కెట్ రేట్లను ‘వకీల్ సాబ్’ సినిమా...

రఘురామ చుట్టూ బిగుసుకుంటోన్న వైసీపీ ఉచ్చు.? నిజమెంత.!

ఏకంగా లక్ష యూరోలు.. సుమారుగా 11 కోట్ల రూపాయల లావాదేవీలు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజుకీ, టీవీ5 సంస్థ అధినేత బీఆర్ నాయుడికీ మధ్య జరిగాయంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గగ్గోలు పెడుతోన్న...

జనసేనను విస్మరించిన ఏపీ బీజేపీ డైవర్షన్ రాజకీయం.!

భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలా ఎదగాలనకుంటోంది రాజకీయంగా.? అన్నప్రశ్నకు బీజేపీ నేతల దగ్గరే సరైన సమాధానం లేదు. మిత్రపక్షం జనసేనతో కలిసి 2024 ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వస్తామని మాత్రమే...

ఎక్కువ చదివినవి

పుష్ప షూటింగ్ కు మరోసారి బ్రేక్… కారణమిదే!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తోన్న తాజా చిత్రం పుష్ప. ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. కరోనా కారణంగా ఈ చిత్రానికి బోలెడన్ని బ్రేక్స్ వచ్చాయి ఇప్పటికే. కరోనా ఫస్ట్...

అనిల్ కు నో, పూరికి ఎస్!

నందమూరి బాలకృష్ణ గతంలో ఎప్పుడూ లేనంత బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ చేస్తోన్న బాలకృష్ణ సెప్టెంబర్ నుండి గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక యాక్షన్ ఎంటర్టైనర్ ను చేయనున్నాడు. అంత...

ఆక్సిజన్ దొరక్క ఎవరూ చనిపోలేదా.? నవ్విపోదురుగాక వాళ్ళకేటి సిగ్గు.?

జనం పిట్టల్లా రాలిపోవడమంటే ఏంటో కరోనా సెకెండ్ వేవ్ సమయంలో చూశాం. మొదటి వేవ్ విషయానికొస్తే.. అప్పుడూ ప్రాణాలు పోయాయి కరోనా వైరస్ కారణంగా. రెండో వేవ్ మరీ దారుణమైనది. దాదాపుగా దేశంలో...

ప్రభాస్ ప్రాజెక్ట్ కె లో సామ్?

రెబెల్ స్టార్ ప్రభాస్ రీసెంట్ గా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సైన్స్ ఫిక్షన్ చిత్రాన్ని మొదలుపెట్టిన విషయం తెల్సిందే. బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ కూడా ఈ చిత్ర షూటింగ్...

ఈసారి పెళ్లి పీఠలు ఎక్కడం ఖాయం

తమిళ బ్యూటీ త్రిష గత రెండు దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. టాలీవుడ్‌ కోలీవుడ్‌ లో ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించిన త్రిష నాలుగు పదుల వయసుకు చేరువ అయినా కూడా ఇంకా...