పుష్ప 2 సినిమా సంధ్య థియేటర్‌లో ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన సంఘటనపై చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది. 105, 118 BNS చట్టం కింద కేసు నమోదు చేసినట్లుగా పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనలో అల్లు అర్జున్ భద్రత సిబ్బంది వైఫల్యంతో పాటు ఆయన వ్యక్తిగత సిబ్బంది ముందస్తు సమాచారం పోలీసులకు ఇవ్వక పోవడంగా ఈ సంఘటన జరిగింది.
అల్లు అర్జున్ వస్తున్న సమయం విషయంలో ఆయన టీం పోలీసులకు సరైన సమాచారం ఇవ్వక పోవడం వల్లే భద్రత ఏర్పాటు చేయలేక పోయినట్లుగా పోలీసులు చెబుతున్నారు. అందుకే అల్లు అర్జున్ టీంపై కేసు నమోదు అయ్యింది. అంతే కాకుండా థియేటర్‌కి అల్లు అర్జున్ వంటి పెద్ద స్టార్ వస్తున్నా యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహించినట్లుగా పోలీసుల ప్రాధమిక విచారణలో వెళ్లడి అయ్యింది.
పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్‌కి అల్లు అర్జున్ వచ్చిన సమయంలో భారీ ఎత్తున అభిమానులు రావడంతో పోలీసులు వారిని అదుపు చేయలేక పోయారు. దాంతో రేవతితో పాటు ఆమె తనయుడు శ్రీ తేజ తొక్కిసలాటలో గాయ పడ్డారు. ఆసుపత్రికి తరలించేప్పటికి రేవతి మృతి చెందగా, శ్రీ తేజ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతడి పరిస్థితి ఇంకా సీరియస్‌గానే ఉన్నట్లుగా కుటుంబ సభ్యులు చెబుతున్నారు.