అల్లు అర్జున్ పై తాజాగా మరో కేసు నమోదైంది. ఇప్పటికే నంద్యాలలో పోలీస్ కేసు నమోదైతే.. బన్నీ కోర్టు వరకు వెళ్లి పోరాడారు. దాంతో మొన్ననే దాన్ని హైకోర్టు కొట్టేసింది. ఇక తాజాగా మరో కేసు నమోదైంది. ఇప్పుడు పుష్ప-2 ఈవెంట్ లో బన్నీ చాలా బిజీగా ఉంటున్నాడు. అయితే అల్లు అర్జున్ ఎక్కడకు వెళ్లినా సరే తనకు అల్లు ఆర్మీ ఉందని చెబుతున్నాడు. అందరికీ ఫ్యాన్స్ ఉంటే నాకు మాత్రం ఆర్మీ ఉందంటూ చెప్పుకుంటున్నాడు. కాగా ఇదే విషయం మీద అల్లు అర్జున్ పై కేసు నమోదు అయింది.
అసలు ఏమైందంటే..హైదరాబాద్ లోని జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ లో గ్రీన్ పీస్ ఎన్విరాన్ మెంట్ అండ్ వాటర్ హార్వెస్టింగ్ ఫౌండేషన్ అధ్యక్షుడు భైరి శ్రీనివాస్ గౌడ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎందుకంటే బన్నీ తన ఫ్యాన్స్ కు అల్లు ఆర్మీ అని పేరు పెట్టుకున్నాడని.. ఆర్మీ అనేది దేశ సైన్యానికి మాత్రమే గౌరవ ప్రదంగా వాడుతామని, కాబట్టి ఆ పేరును అభిమాన సంఘానికి పెట్టుకోవడం కరెక్ట్ కాదంటూ శ్రీనివాస్ గౌడ్ చెబుతున్నారు. ఈ విషయాన్ని లెక్క చేయకుండా బన్నీ ఎక్కడకు వెళ్లినా తనకు ఆర్మీ ఉందంటూ చెప్పడం అంటే సైన్యాన్ని అవమానించడమే అంటున్నాడు.
అయితే దీనిపై ఇప్పటి వరకు అల్లు అర్జున్ స్పందించలేదు. ప్రస్తుతం బన్నీ వరుస ఈవెంట్లతో బిజీగా ఉంటున్నాడు. నిన్న బాలీవుడ్ కు వెళ్లి అక్కడ కూడా ఈవెంట్ నిర్వహించిన సంగతి తెలిసిందే.