Switch to English

పవన్ కళ్యాణ్ కు  ప్రధాని మోదీ ప్రశంసలు, కృతజ్ఞతలు చెప్పిన పవన్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

89,172FansLike
57,764FollowersFollow

జపనీస్ కత్తిసాము యుద్ధకళ కెంజుట్సులో అధికారిక ప్రవేశం పొందడం ద్వారా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అరుదైన ఘనత సాధించారు. ఈ సందర్భంగా గౌరవ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆయనను ప్రశంసిస్తూ అభినందన సందేశం పంపారు. ప్రజా జీవితం, సినిమా రంగంలో బిజీగా ఉంటూనే మార్షల్ ఆర్ట్స్‌లో దశాబ్దాలపాటు అంకితభావంతో సాధన చేయడం స్ఫూర్తిదాయకమని ప్రధాని పేర్కొన్నారు. వృత్తిపరమైన బాధ్యతలు కొత్త విషయాలు నేర్చుకోవడానికి అడ్డంకి కావని పవన్ కళ్యాణ్ సాధన యువతకు బలమైన సందేశమని మోదీ అన్నారు.

మార్షల్ ఆర్ట్స్ అనేవి శారీరక బలంతో పాటు మానసిక సమతుల్యత, సహనం, స్వీయ నియంత్రణను పెంపొందిస్తాయని ప్రధాని తన సందేశంలో తెలిపారు. ఇంతటి కఠినమైన సంప్రదాయాన్ని అనుసరించడం పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుందని ప్రశంసించారు. ఫిట్ ఇండియా వంటి కార్యక్రమాల ద్వారా ఆరోగ్యకరమైన, చురుకైన సమాజాన్ని నిర్మించాలన్న లక్ష్యానికి ప్రజా జీవితంలో ఉన్న నాయకుల క్రమశిక్షణ ఎంతో అవసరమని పేర్కొన్నారు. ఫిట్నెస్ పట్ల పవన్ కళ్యాణ్ చూపుతున్న నిబద్ధత ఎంతో మందికి ప్రేరణగా నిలుస్తుందని మోదీ అన్నారు.

ప్రధాని అభినందనలకు స్పందించిన పవన్ కళ్యాణ్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. మోదీ పంపిన ఆత్మీయ సందేశం తనకు గొప్ప గౌరవమని, మరింత ప్రోత్సాహాన్నిచ్చిందని చెప్పారు. యుద్ధకళలు శారీరక శ్రమతో పాటు ఏకాగ్రత, ఒత్తిడిని తట్టుకునే శక్తిని ఇస్తాయని పేర్కొన్నారు. జీవితకాల అభ్యాసం, స్వీయాభివృద్ధిపై ప్రధాని ఇచ్చిన సందేశం తనకు ఎంతో స్ఫూర్తినిస్తోందని అన్నారు.

ప్రజారోగ్య పరిరక్షణ కోసం ఫిట్ ఇండియా వంటి కార్యక్రమాలను తీసుకువచ్చిన ప్రధాని దూరదృష్టిని పవన్ కళ్యాణ్ కొనియాడారు. మోదీ నాయకత్వంలో బలమైన, క్రమశిక్షణగల భారతదేశం రూపుదిద్దుకుంటోందని, స్వామి వివేకానంద ఆకాంక్షించిన సమాజం ఆవిష్కృతమవుతుందని చెప్పారు. గొప్ప నాయకుడి నుంచి లభించిన ఈ ప్రోత్సాహం ప్రజలకు మరింత అంకితభావంతో సేవ చేయాలన్న తన సంకల్పాన్ని బలపరుస్తోందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

సినిమా

విజయ్–రష్మిక పెళ్లి వివరాలు లీక్? కుటుంబాలకు తలనొప్పి

హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక మందన్న వివాహ వేడుకలకు సంబంధించిన వివరాలు సోషల్ మీడియాలో లీక్ అవుతుండటం కలకలం రేపుతోంది. పెళ్లి తేదీ, వేదిక,...

Dil Raju: దిల్ రాజు కామెంట్స్ వైరల్..! ఎవరిని ఉద్దేశించి ఆ...

Dil Raju: ‘నేటి రోజుల్లో నిర్మాతకు విలువలేద’ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారి తీశాయి. ఎవరిని ఉద్దేశించి ఆయన...

మే 1న పిల్లల కోసం ‘సమ్మర్ హాలిడేస్’.. థియేటర్లలోకి రాబోతున్న కొత్త...

కథా బలమున్న చిత్రాలను ప్రేక్షకులకు అందిస్తూ నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్‌గా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ధీరజ్ మొగిలినేని, తన బ్యానర్ ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై కొత్త చిత్రాన్ని...

విజయ్–రష్మిక పెళ్లి తేదీ ఖరారు.. ఫిబ్రవరి 26 ముహూర్తానికి ప్రత్యేకత

టాలీవుడ్‌లో మోస్ట్ రూమర్డ్ కపుల్‌గా పేరొందిన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహం త్వరలో జరగనున్నట్లు వార్తలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. ఫిబ్రవరి 26న...

హే బల్‌వంత్‌పై భారీ అంచనాలు.. సుహాస్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ అవుతుందన్న...

బన్నీవాస్, వంశీ నందిపాటి సక్సెస్ కాంబినేషన్ నుంచి వస్తున్న ఫుల్‌లెంగ్త్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్ ‘హే బల్‌వంత్’ ఫిబ్రవరి 20న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది....

రాజకీయం

హిందూపురం బాలిక కేసులో కీలక మలుపు: ఇన్‌స్టాగ్రామ్ ట్రాప్, ఇద్దరు నిందితులు అరెస్ట్

శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మండలంలో మూడు రోజుల క్రితం బయటపడిన మైనర్ బాలిక కిడ్నాప్, అత్యాచారం కేసులో కీలక వివరాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడు గోవర్ధన్...

Breaking News: బొత్సపై హెరిటేజ్ లీగల్ నోటీసు..

అమరావతి: తిరుమల లడ్డు నెయ్యి వ్యవహారంలో తన ప్రతిష్టకు భంగం కలిగించేలా తప్పుడు ఆరోపణలు చేశారంటూ హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్...  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణకు...

నారా లోకేష్ మీద దుష్ప్రచారం.! పరువు పోగొట్టుకున్న వైఎస్సార్సీపీ.!

కోటి రూపాయల ప్రజాధనాన్ని నారా లోకేష్ దుర్వినియోగం చేసిందంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేసిన దుష్ప్రచారం, ఆ పార్టీ పరువుని బజార్న పడేసింది. ఇటీవల కొలంబోలో ఇండియా - పాకిస్తాన్ జట్ల మధ్య...

ఫలితాల దిశగా కూటమి ప్రభుత్వ సమర్ధ నీటి నిర్వహణ కార్యక్రమాలు

కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సమర్థ నీటి నిర్వహణ కార్యక్రమాలు రాష్ట్రవ్యాప్తంగా మంచి ఫలితాలు ఇస్తున్నాయి. స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యాల్లో కీలకమైన నీటి భద్రత దిశగా రాయలసీమలోని అన్నమయ్య జిల్లా గట్టి...

కూటమిలో స్నేహ బంధాలు బలపడుతున్నాయి: లోకేష్ ఆత్మీయ విందు సమావేశాలు

కూటమి పార్టీల మధ్య సమన్వయం, స్నేహ బంధాలు మరింత బలపడేలా విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పార్లమెంటు సెగ్మెంట్ల వారీగా ప్రజాప్రతినిధులతో ఆత్మీయ విందు సమావేశాలను కొనసాగిస్తున్నారు. మంగళవారం రాత్రి...

ఎక్కువ చదివినవి

బడ్జెట్‌తో స్వర్ణాంధ్ర 2047 దిశగా 360° అభివృద్ధికి బలమైన పునాది వేసాం: పవన్ కళ్యాణ్

ఆంధ్రప్రదేశ్‌ను స్వర్ణాంధ్ర 2047 లక్ష్యానికి తీసుకెళ్లే దిశగా 2026–27 ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ రాష్ట్రానికి 360 డిగ్రీల సమగ్ర అభివృద్ధికి బలమైన పునాది వేస్తుందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్...

అసెంబ్లీకి రాకుండా డ్రామాలేనా? వైసీపీపై జనసేన ఎమ్మెల్యేల ఘాటు వ్యాఖ్యలు

వైసీపీ అనేది ప్రజా సమస్యలపై పోరాడే పార్టీ కాదు, డ్రామాలు చేసే పెద్ద కంపెనీలా మారిందని జనసేన ఎమ్మెల్యేలు బోలిశెట్టి శ్రీనివాస్, వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ తీవ్రంగా విమర్శించారు. శుక్రవారం అసెంబ్లీ మీడియా...

ప్రభుత్వ పాఠశాలల స్థితిగతులపై లోకేష్ కీలక వ్యాఖ్యలు

అమరావతిలో జరిగిన శాసనమండలి సమావేశంలో ప్రభుత్వ పాఠశాలల మౌలిక వసతులు, నాడు–నేడు, మనబడి–మన భవిష్యత్ పథకాల అమలుపై రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ విస్తృతంగా స్పందించారు. ప్రభుత్వ పాఠశాలలను...

Daily Horoscope: ఉద్యోగాల్లో పురోగతి.. కుటుంబంలో శుభవార్తలు

ఫిబ్రవరి 18, 2026 బుధవారం రాశిఫలాలు: మేషం (Aries): కొత్త పనులకు శుభారంభం చేసే అవకాశం ఉంటుంది. కార్యాలయంలో మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. ఆర్థికంగా ఆశించిన సహాయం అందుతుంది. కుటుంబ సభ్యులతో సమయం...

నన్నయ్య యూనివర్సిటీపై ఆరోపణలు.. అనుమతుల అక్రమాలపై లోకేష్ హెచ్చరిక

ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ పరిధిలో కళాశాలల అనుమతుల విషయంలో అవకతవకలకు సంబంధించి ఆధారాలు పంపితే తప్పకుండా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు....