నాగ శౌర్య, మాళవిక నాయర్ జంటగా రూపొందుతోన్న చిత్రం ఫలానా అబ్బాయి – ఫలానా అమ్మాయి. ఏడాదిన్నర క్రితమే షూటింగ్ మొదలైన ఈ చిత్రం కోవిడ్ కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. అయితే ఇప్పుడు కేసులు తగ్గడంతో విదేశీ షెడ్యూల్ మొదలైంది. లండన్ లో ఈ చిత్ర షూటింగ్ జరుగుతోంది.
నాగ శౌర్య, మాళవిక నాయర్ లతో పాటు ప్రముఖ తారాగణం లండన్ షెడ్యూల్ లో పాల్గొంటున్నారు. ఈ షెడ్యూల్ తో మెజారిటీ షూటింగ్ పూర్తవుతుంది. ఫలానా అబ్బాయి – ఫలానా అమ్మాయి చిత్రాన్ని ప్రముఖ నటుడు శ్రీనివాస్ అవసరాల డైరెక్ట్ చేస్తున్నాడు.
శ్రీనివాస్ అవసరాల – నాగ శౌర్య కాంబినేషన్ లో వచ్చిన ఊహలు గుసగుసలాడే, జ్యో అచ్యుతానంద చిత్రాలు మంచి విజయాలను అందుకున్న విషయం తెల్సిందే. ఇక నాగ శౌర్య – మాళవిక నాయర్ కాంబినేషన్ లో కళ్యాణ వైభోగమే సినిమా కూడా మంచి విజయాన్నే అందుకుంది.