ఇటివల రోజురోజుకీ పెరిగిపోతున్న పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలతో ఇబ్బందిపడుతున్న ప్రజలకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. పెట్రోల్‌పై రూ.8, డీజిల్‌పై రూ.6 ఎక్సైజ్ సుంకం తగ్గించింది. దీంతో లీటర్ పెట్రోల్ పై రూ.9.50, లీటర్ డీజిల్ పై రూ.7 తగ్గనుంది. దీంతోపాటు పీఎం ఉజ్వల యోజన పథకంలోని 9కోట్ల మంది లబ్ధిదారులకు ఒక్కో గ్యాస్ సిలిండర్‌పై రూ.200 తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. మరోవైపు.. ఐరన్, స్టీల్ పై కస్టమ్స్ డ్యూటీ, ప్లాస్టీక్ ఉత్పత్తులు, ముడి పదార్ధాలతోపాటు ఉక్కు ముడి పదార్ధాలపై కూడా దిగుమతి సుంకం తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది.
ఈమేరకు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. అన్ని విషయాలపై చర్చించిన అనంతరం ప్రధాని మోదీ ధరల తగ్గింపు నిర్ణయం తీసుకున్నారని అన్నారు. కేంద్రం నిర్ణయంతో ప్రభుత్వానికి దాదాపు 1.5లక్షల కోట్ల రాబడి తగ్గే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం దేశంలో పెట్రోల్ దాదాపు 110, డీజిల్ 100కు చేరువలో ఉన్న సంగతి తెలిసిందే.