Pushpa 2 : మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌లో భారీ బడ్జెట్‌తో రూపొందిన పుష్ప 2 సినిమా టికెట్ల రేట్లను భారీగా పెంచుకునేందుకు మొదట తెలంగాణ ప్రభుత్వం, ఆ తర్వాత ఏపీ ప్రభుత్వం అనుమతులు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా నైజాం ఏరియాలో పుష్ప 2 టికెట్ల రేట్లు చూసి అంతా షాక్ అవుతున్నారు. ప్రీమియర్ షోలు చూడాలంటే వెయ్యికి పైగానే ఖర్చు చేయాల్సి వస్తుంది.
ప్రీమియర్ షోలతో పాటు రెగ్యులర్ షోలకు సైతం భారీ మొత్తంలో టికెట్ల రేట్లు పెంచుకునే విధంగా నిర్మాతలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. సింగిల్ స్క్రీన్ థియేటర్లతో పాటు మల్టీప్లెక్స్‌ల్లో మొదటి వారం రోజులు అత్యధిక రేట్లకు టికెట్లను అమ్ముకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంపై ఫ్యాన్స్‌తో పాటు పలువురు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై తెలంగాణ హైకోర్టులో పిటీషన్ దాఖలు అయ్యింది.
సామాన్య మధ్యతరగతి ప్రేక్షకులను దోచుకోవడం కోసం పుష్ప 2 సినిమా టికెట్ల రేట్లను భారీగా పెంచారు అంటూ పిటీషనర్ తన పిటీషన్‌లో పేర్కొన్నారు. అంత భారీగా టికెట్ల రేట్లను పెంచాల్సిన అవసరం ఏంటని ఆయన ప్రశ్నిస్తున్నారు. ఈ పిటీషన్‌ను కోర్టు విచారణకు తీసుకుంది. నేడు కోర్టులో ఈ విషయమై వాదనలు వినే అవకాశాలు ఉన్నాయి. ఈ పిటీషన్ వల్ల టికెట్ల రేట్లు ఏమైనా తగ్గుతాయా అనేది చూడాలి. రికార్డ్ బ్రేకింగ్ వసూళ్ల కోసం అత్యధికంగా టికెట్ల రేట్లను పెంచడం జరిగింది.