వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు రాజీనామా చేసినట్లుగా ఓ ఫేక్ ప్రచారాన్ని సోషల్ మీడియా వేదికగా టీడీపీ మద్దతుదారుడైన గార్లపాటి వెంకటేశ్వరరావు చేశారట. ఈ విషయమై అందిన ఫిర్యాదు మేరకు సీఐడీ అధికారులు రంగంలోకి దిగి, నిందితుడ్ని అరెస్టు చేశారట. ఇదీ కేసు.! అలాగని, వైసీపీ అనుకూల మీడియాలో కథనాలు వస్తున్నాయి. సీఐడీ ప్రకటనను ఆ కథనాల్లో ప్రస్తావిస్తున్నారు కూడా.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా దుష్ప్రచారం చేస్తే, కేసులు నమోదు చేయడంలో వింతేమీ లేదు. రాజకీయ నాయకుల మీద అసత్య ప్రచారం చేస్తే కేసులు నమోదు చేయడమూ కొత్త కాదు. కానీ, నిత్యం రాజకీయాల్లో జరుగుతున్నదేంటి.? అసత్య ప్రచారమే కదా.?
టీడీపీకి ఫలానా నాయకుడి రాజీనామా.. వైసీపీకి ఫలానా నాయకుడి రాజీనామా.. జనసేన నుంచి ఓ నాయకుడు జంప్.. ఇలాంటి వార్తలు నిత్యం మీడియాలో చూస్తూనే వున్నాం. సోషల్ మీడియాలో అయితే, ఇలాంటివి లక్షలాది, కోట్లాది ఫేక్ న్యూస్‌లు కనిపిస్తూనే వున్నాయి.
చంద్రబాబే, వైఎస్ వివేకానందరెడ్డిని చంపించేశారని సాక్షాత్తూ వైఎస్ జగన్ ఆరోపించారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డే, బాబాయ్ వివేకానందరెడ్డిని చంపించేశారని చంద్రబాబూ ఆరోపణలు చేశారు. ఇప్పటికీ, వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు సంబంధించి సోషల్ మీడియాలో బోల్డన్ని పోస్టులు కనిపిస్తాయ్.
వైఎస్ విజయమ్మ ప్రభుత్వంలో లేరు.. ఆమె వైసీపీ గౌరవాధ్యక్షురాలు మాత్రమే. ఆమె పేరుతో ఓ ఫేక్ లేఖ బయటకు వచ్చిందే అనుకుందాం.. ఆ లేఖపై, ఆమె ఫిర్యాదు చేయాలి కదా.? ఏంటో, అంతా గందరగోళం రాజకీయం.!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అరెస్టులనేవి సర్వసాధారణమైపోయాయ్. అరెస్టులు చేసి, కొట్టారంటూ ఏపీ సీఐడీ మీద ఆరోపణలు మరింత సర్వసాధారణంగా మారాయి. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ ఈ విషయమై చేస్తోన్న ఆరోపణలు అన్నీ ఇన్నీ కావు. ‘మేం కొట్టలేదు..’ అని ఏపీ సీఐడీ చెబుతోంది. ఏది నిజం.?
ఇదింతే, ఈ రాజకీయం ఇంతే.!
669438 176177This web site is truly a walk-through it genuinely could be the details you wanted concerning this and didnt know who to inquire about. Glimpse here, and youll completely discover it. 839752
34457 963620I just added this webpage to my feed reader, excellent stuff. Cannot get enough! 327716
961403 618909Spot up for this write-up, I really believe this internet website requirements an excellent deal more consideration. Ill likely to finish up once more to read a great deal much more, numerous thanks for that details. 901221