Switch to English

చిరంజీవి అంటే జగన్ కు అభిమానం.. పరిశ్రమ అభివృద్ధికి ఓకె: పేర్ని నాని

చిరంజీవి అంటే సీఎం జగన్‌కు ఎంతో గౌరవమని, ఆయనను సోదరభావంతో చూస్తారని.. ప్రజలకు మేలు చేసేలా ఎవరు ఏ విన్నపం చేసినా జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని ఏపీ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని నాని అన్నారు. సోమవారం ఏపీ ప్రభుత్వంతో సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు, థియేటర్‌ యజమానులు భేటీ అయ్యారు. చిత్ర పరిశ్రమలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని, తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఆదిశగా చొరవ చూపాలని మెగాస్టార్ చిరంజీవి లవ్ స్టొరీ సినిమా వేడుకలో విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వీరి భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంది.

సినీ ప్రముఖలతో భేటీ అనంతరం మంత్రి విలేకరులతో మాట్లాడారు. ‘ప్రభుత్వం నిర్ణయించిన రేట్ల గురించి ఈ సమావేశంలో సినీ ప్రముఖులకు వివరించాం. త్వరలోనే ఆన్‌లైన్‌ వ్యవస్థ ద్వారా ఏపీ ప్రజలకు వినోదాన్ని పంచుతాం. “సినిమాపై మాకున్న ఆపేక్షను ఎందుకు సొమ్ము చేసుకుంటున్నారు” అని ప్రజలెవరూ ప్రశ్నించే అవకాశం లేకుండా పారదర్శకతతో కూడిన టికెట్ రేట్లను అమలు చేస్తాం. ప్రభుత్వ నిర్దేశించిన ధరలను మాత్రమే థియేటర్‌లో అమలు చేసేలా చర్యలు తీసుకుంటాం. ఆన్‌లైన్‌ వ్యవస్థ ద్వారా ప్రజలకు వినోదాన్ని అందించేందుకు జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నమిది. ఇందుకు అన్ని వర్గాల నుంచి సానుకూల స్పందన వచ్చింది. చట్టాలకు అతీతంగా వ్యాపారాలు చేసే పరిస్థితి ఉత్పన్నం కాదని అనుకుంటున్నా. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్‌, థియేటర్‌ యజమానులు కూడా.. “ప్రభుత్వం ఇలా చేస్తే బాగుంటుంది” అంటూ అనేక విషయాలు మా దృష్టికి తీసుకొచ్చారు. వారి విజ్ఞప్తులను పరిశీలించి సానుకూలంగా స్పందించాం. ఈ రోజు జరిగిన సమావేశంలో బెనిఫిట్‌ షోల గురించి ఒక్కరు కూడా అడగలేదు’ అని అన్నారు.

నిర్మాత ఆది శేషగిరిరావు మాట్లాడుతూ.. ‘‘ఒకప్పుడు ఉమ్మడి ఏపీలో 1800 థియేటర్లు ఉంటే.. ఇప్పుడా సంఖ్య 1200లకు పడిపోయింది. వాటిలో 500-600 థియేటర్లు ఇంకా తెరుచుకోలేదు. ఆ థియేటర్‌లను పవర్‌ టారిఫ్‌ సమస్య వేధిస్తోంది. శాలరీలు, డిజిల్‌ ఛార్జీలు పెరిగాయి. ఇన్ని ప్రతికూల పరిస్థితుల మధ్య రేట్లు సవరించాలని ప్రభుత్వం దృష్టికి తీసుకోచ్చాం. ఇందుకు ప్రభుత్వం తరపున మంత్రి పేర్ని నాని సానుకూలంగా స్పందించారు. మాజీ సీఎం రాజశేఖర్‌రెడ్డి చిత్ర పరిశ్రమకు చేసిన సాయం మాదిరిగానే.. జగన్‌ ప్రభుత్వం కూడా సాయం చేస్తుందని హామీ ఇచ్చారు. మరోసారి సినీ ప్రముఖులతో భేటీ అయి, సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు. ప్రస్తుతం థియేటర్లన్నీ ఎయిర్‌ కండీషన్‌ ఉండటంతో థియేటర్‌ ప్రాపర్టీ విలువ పెరిగింది. థియేటర్‌ సెక్టార్‌ బతికించుకుంటే మిగిలిన వ్యవస్థలో అందరూ బతుకుతారు’’ అని అన్నారు.

నిర్మాత సి.కల్యాణ్‌ మాట్లాడుతూ.. సినీ సమస్యలపై తమకు ఏపీ ప్రభుత్వం అండగా నిలిచింది. కొత్త సినిమాల విడుదల సమయంలో బెనిఫిట్‌ షో కోసం ప్రభుత్వానికి అర్జీ పెట్టుకుంటే తప్పకుండా అనుమతి ఇస్తుంది. గతం మాదిరిగానే త్వరలోనే ఏపీలో షూటింగ్‌లు మొదలు పెడతాం. ఆన్‌లైన్‌ టికెటింగ్‌ వ్యవస్థ కావాలని మేమే ఆడిగాం’ అని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘అయ్యగారు’ ఫ్యాన్‌ ను కలుస్తాడట

అఖిల్ అక్కినేనికి అభిమానులు ముద్దుగా పెట్టుకున్న పేరు అక్కినేని ప్రిన్స్. కాని అఖిల్‌ దాని కంటే కూడా అయ్యగారు బిరుదుకు ఎక్కువ ఇంట్రెస్ట్‌ చూపిస్తున్నాడు. సోషల్...

కోట అంత నీచంగా మాట్లాడటం బాధించింది : అనసూయ

జబర్దస్త్‌ యాంకర్‌ అనసూయ ఈమద్య కాలంలో బుల్లి తెర మరియు వెండి తెరపై తెగ బిజీ అయ్యింది. ఆమె ఎంత బిజీ అవుతుందో అంతకు మించిన...

సామ్‌ బాలీవుడ్‌లో డబుల్ ధమాకా

విడాకుల నిర్ణయం తర్వాత సమంత సినిమాల పరంగా జోరు పెంచినట్లుగా అనిపిస్తుంది. పెద్ద ఎత్తున సినిమాలు మరియు వెబ్‌ సిరీస్ లు చేయాలనే ఉద్దేశ్యంతో ఈ...

బిగ్ బాస్ 5: ప్రియా వల్ల సన్నీ ప్రవోక్ అయిపోయాడా? –...

బిగ్ బాస్ సీజన్ 5 లో ఈసారి నామినేషన్స్ చాలా కొత్త పంథాలో జరిగాయి. ముందుగా కంటెస్టెంట్స్ లో ముగ్గురు వేటగాళ్లు ఉంటారు. వారు జస్వంత్,...

‘మా’ బైలాస్ మారుస్తాం.. వారిద్దరి రాజీనామాలు ఆమోదించట్లేదు: మంచు విష్ణు

‘మా’ అసోసియేషన్ బైలాస్ ను మారుస్తామని.. నాగబాబు, ప్రకాశ్ రాజ్ చేసిన రాజీనామాలను ఆమోదించట్లేదని మా నూతన అధ్యక్షుడు మంచు విష్ణు ప్రకటించారు. సోమవారం ఉదయం...

రాజకీయం

ఆంధ్రప్రదేశ్ రాజకీయ విధ్వంసం: ఈ పాపం ఎవరిది.?

ప్రతిపక్ష నేత ఇంటి మీదకు అధికార పార్టీ ఎమ్మెల్యే, తన అనుచరులతో కలిసి వెళితే, ‘అబ్బే, అది దాడి కాదు.. వినతి పత్రం ఇచ్చేందుకు చేపట్టిన కార్యక్రమం..’ అంటూ చిత్ర విచిత్రమైన వివరణలు.....

పచ్చ పైశాచికానందం.. అందుకే జనసేనపై దుష్ప్రచారం.!

తాను నాశనమైపోతూ, ఇతరుల్ని నాశనం చేయడం ద్వారా పైశాచికానందం పొందుతుంటారు కొందరు. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడిది భస్మాసురహస్తం.. అనేది ఇందుకే. ఏ పార్టీతో అంట కాగితే ఆ పార్టీని నాశనం చేయడం...

షర్మిల ప్రజా ప్రస్థానం 400 రోజులు.. 4 వేల కి.మీ

వైఎస్సార్‌ రాజకీయ వారసురాలిగా షర్మిల తెలంగాణ రాజకీయాల్లో అడుగు పెట్టారు. ఆమె అతి త్వరలోనే ప్రజల్లో మంచి పేరు దక్కించుకోవడం కోసం పాదయాత్రను మార్గంగా ఎంచుకున్నారు. అందుకోసం ప్రజా ప్రస్థానం పేరుతో పాదయాత్రను...

వైఎస్ షర్మిల పాదయాత్ర.. అన్నతో పోల్చితే కాస్త డిఫరెంట్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సుదీర్ఘ పాదయాత్ర చేశారు ప్రజా సంకల్ప యాత్ర పేరుతో.. అది రాజకీయ సంకల్ప యాత్ర.. అధికారం కోసం చేపట్టిన సంకల్ప యాత్ర.....

‘మా’ లొల్లి అమెరికా కూడా వెళ్లొచ్చేయ్ ఓ పాలి..

ఎన్నికలు అయిపోయాయ్. ఇకపై మేమంతా ఒక్కటే.. అని ‘మా’ కొత్త అధ్యక్షడు మంచు విష్ణు చెప్పాడు. చెప్పాకా మాట మీద నిలబడాలా.? వద్దా.? ‘మా’ ప్యానెల్ నుంచి ఇకపై ఎవరూ మీడియా ముందుకొచ్చి...

ఎక్కువ చదివినవి

ప్రకాశ్ రాజ్ ప్యానెల్ రాజీనామాలపై మంచు విష్ణు వ్యాఖ్యలు..!!

ఇటివలి మా ఎన్నికల్లో విజయం సాధించిన మంచు విష్ణు ‘మా’ నూతన అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మా అసోసియేషన్ అభివృద్ధికి అన్నివిధాలా కృషి చేస్తానని ఆయన...

అఖిల్‌ ‘మోస్ట్‌ ఎలిజబుల్‌ బ్యాచిలర్‌’ రివ్యూ

అక్కినేని అఖిల్‌ మూడు సినిమాల్లో నటించినా ఇప్పటి వరకు ఒక్క కమర్షియల్‌ హిట్‌ ను దక్కించుకోలేక పోయాడు. మరి ఈ సినిమాతో అయినా ఈయనకు హిట్ దక్కిందా అనేది ఈ రివ్యూలో చూద్దాం. కథ...

భారత్‌ పాక్ మ్యాచ్‌ రోజ నేను కనిపించకుండా పారిపోతా

టీ20 ప్రపంచ కప్‌ సమరం ప్రారంభం అయ్యింది. యూఏఈలో పెద్ద ఎత్తున జరుగుతున్న మ్యాచ్ ల కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు భారత్‌ మరియు పాకిస్తాన్ ల మ్యాచ్...

ఔనా! నిజమా.? ఆంధ్రప్రదేశ్‌లో నిధుల కొరత లేదా.?

అప్పు చేస్తే తప్ప పూటగడవని దుస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానిది. ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా ఇది కళ్ళ ముందు కనిపిస్తోన్న వాస్తవం. ప్రతి నెలా కొత్త అప్పు చేయాల్సిందే.. నెలవారీ అప్పులే కాదు,...

రాష్ట్రంలో బొగ్గు గందరగోళం

కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉండే బొగ్గు గనుల నుండి ఏపీకి రావాల్సిన బొగ్గు ను నిలుపుదల చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన బకాయిలను చెల్లించే వరకు బొగ్గు సరఫరా నిలిపి వేస్తున్నట్లుగా...