Switch to English

బాదుతున్నా.. బుద్ధి రావడంలేదు!

మానవాళి ప్రాణాలను కబళిస్తున్న కరోనా మహమ్మారిని నియంత్రించేందుకు ప్రపంచ దేశాలన్నీ చేయాల్సినదంతా చేస్తున్నాయి. ఈ వైరస్ ను అడ్డుకోవడానికి ఏకైన మార్గం ఇంట్లో ఉండటమే అని నెత్తీ నోరూ బాదుకుని మరీ చెబుతున్నాయి. ప్రజలందరూ లాక్ డౌన్ ను పాటించాలని ముఖ్యమంత్రులు చేతులెత్తి మరీ మొక్కుతున్నారు. పల్లెల్లో అందరూ దీనిని సక్రమంగా పాటిస్తున్నా.. పట్ణణాలు, నగరాలకు వచ్చేసరికి పూర్తిగా అమలు కావడంలేదు. ఇక్కడ 70 నుంచి 90 శాతం మేర మాత్రమే లాక్ డౌన్ పాటిస్తున్నారు. ఇది లాక్ డౌన్ ఉద్దేశాన్ని నీరుగారుస్తోంది.

ప్రభుత్వాలు ఎన్నో వ్యయప్రయాసలకోర్చి నష్టాలను భరించి పిలుపునిచ్చిన లాక్ డౌన్ ను పాటించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపైనా ఉంది. పెద్దలు, వృద్ధులు బాధ్యతగానే ఉంటున్నా.. యువత మాత్రం లాక్ డౌన్ ను ఉల్లంఘిస్తున్నారు. పనిలేకుండా రోడ్లపైకి వచ్చేవారిలో యువతే ఎక్కువగా ఉంటున్నారు. పోలీసులు లాఠీలు ఝలిపిస్తున్నా కూడా వారి తీరు మారడంలేదు. రోడ్లపైకి వచ్చేవారి తాట తీయడం మన దేశంలోనే కాదు.. పలు దేశాలు కూడా ఇదే బాటలో వెళుతున్నాయి.

ఒక్కో దేశంలో ఒక్కో రకమైన నిబంధన అమల్లోకి తీసుకొచ్చారు. కొన్నిచోట్ల జరిమానాలు వేస్తుండగా.. మరికొన్ని చోట్ల జరిమానాలు, జైలు శిక్ష రెండూ విధిస్తున్నారు. దీంతో పలు చోట్ల పోలీసులు ఓవర్ యాక్షన్ కూడా చేస్తున్నట్టు విమర్శలు వస్తున్నాయి. మనదేశంలో నిబంధనలు ఉల్లంఘించి రోడ్లపైకి వస్తున్నవారి వాహనాలు సీజ్ చేయాల్సి ఉండగా.. పలువురు పోలీసులు వాటిని ఇష్టానుసారం ధ్వంసం చేస్తున్నారు.

ఇక దక్షిణాఫ్రికాలో లాక్ డౌన్ ఉల్లంఘనులపై వాటర్ కెనాన్లు, రబ్బర్ బుల్లెట్లు కూడా ప్రయోగిస్తున్నారు. సింగపూర్, ఆస్ట్రేలియా, మెక్సికో వంటి దేశాల్లో భారీ జరిమానాలు, జైలు శిక్షలు విధిస్తున్నారు. ఫిలిప్పీన్స్ అధ్యక్షుడికి అయితే కోపం నషాళానికి అంటడంతో లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించినవారిని కాల్చిపడేయాలని ఆదేశాలు జారీచేశారు. లాక్ డౌన్ అనేది ప్రజల క్షేమం కోసమేనని చెబుతున్నా.. కొంతమంది జనాల చెవికి ఎక్కడంలేదు.

రోడ్లపై పరిస్థితి ఎలా ఉందో చూద్దామని కొందరు.. వీడియోలు తీయడానికి మరికొందరు ఇలా రకరకాల కారణాలతో తిరుగుతున్నారు. పోలీసులు బతిమాలుతున్నా.. లాఠీలకు పనిచెబుతున్నా వీరు మారడంలేదు. లాక్ డౌన్ సరిగా అమలైతే దీనిని పొడిగించే అవసరం ఉండదని, అలా కాకుండా నిబంధనలు ఉల్లంఘిస్తే కరోనా వైరస్ మహమ్మారి ని నిరోధించడం సులభం కాదని హెచ్చరిస్తున్నారు.

సినిమా

14 వేల మంది సినీకార్మికులకు తలసాని శ్రీనివాస్ యాదవ్ సాయం

రెండు నెల‌లుగా క‌రోనా లాక్ డౌన్ అన్ని పరిశ్ర‌మ‌ల్ని అత‌లాకుతలం చేసిన సంగ‌తి తెలిసిందే. వినోద రంగంపైనా దీని ప్ర‌భావం అంతా ఇంతా కాదు. దేశ‌వ్యాప్తంగా...

కంగనా 50 కోట్ల ఆఫీస్‌ ప్రత్యేకతలు చూద్దాం రండి

సినిమా ఆఫీస్‌ లు ఎంత రాయల్‌ గా ఎంతో అహ్లాదకరంగా ఉంటాయి. ప్రతి చోట కూడా క్రియేటివిటీ కలగలిపి ఉంటాయి. అన్ని విధాలుగా కూడా ప్రశాంతతను...

సోను సూద్ ఆచార్య గురించి ఏమంటున్నాడు?

సోను సూద్ అనే పేరుకు టాలీవుడ్ లో పరిచయం అవసరం లేదు. అరుంధతిలో విలన్ గా చేసిన దగ్గరనుండి సోను సూద్ కు తెలుగులో పాపులారిటీ...

బన్నీకి ఇష్టమైన బాలీవుడ్ సినిమాలివే

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గత కొన్నేళ్లుగా ప్యాన్ ఇండియా సినిమా చేయాలని అనుకుంటున్నాడు. అయితే అందుకు సరైన సందర్భం రావట్లేదు. ఇక ఇప్పుడు అల...

నాని మూవీకి ఎన్ని ఆఫర్స్ వచ్చినా నో అంటున్న దిల్ రాజు.!

టాలీవుడ్ అగ్రనిర్మాతల్లో ఒకరు దిల్ రాజు.. ప్రతి ఏడాది దిల్ రాజు నిర్మాణ సంస్థ నుంచి ఐదారు సినిమాలు విడుదలవుతుంటాయి, అంతే కాకుండా పలు సినిమాల...

రాజకీయం

హైకోర్టుపై వైసీపీ నేతల వ్యాఖ్యలు.. 49 మందికి నోటీసులు!

డాక్టర్‌ సుధాకర్‌ వ్యవహారం, ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగుల వ్యవహారం... వంటి విషయాలపై న్యాయస్థానం ఇటీవల ప్రభుత్వానికి మొట్టికాయలు వేసిన దరిమిలా, అధికార పార్టీకి చెందిన నేతలు న్యాయస్థానం తీర్పుపై అసహనం వ్యక్తం...

14 వేల మంది సినీకార్మికులకు తలసాని శ్రీనివాస్ యాదవ్ సాయం

రెండు నెల‌లుగా క‌రోనా లాక్ డౌన్ అన్ని పరిశ్ర‌మ‌ల్ని అత‌లాకుతలం చేసిన సంగ‌తి తెలిసిందే. వినోద రంగంపైనా దీని ప్ర‌భావం అంతా ఇంతా కాదు. దేశ‌వ్యాప్తంగా ల‌క్ష‌లాది మంది సినీ-టీవీ కార్మికులు రోడ్డున...

2021కి పోలవరం.. పోతిరెడ్డిపాడుతో ఎవరికీ నష్టం లేదు.. సీఎం జగన్

అమరావతి: ఎగువ రాష్ట్రాల్లో ప్రాజెక్టులు ఎక్కువగా కట్టడం వల్ల రాష్ట్రానికి నీరు అందని పరిస్థితి ఉందని.. ఈ సమయంలో రాష్ట్రంలో చేపడుతున్న ప్రాజెక్టులపై వివాదాలు సృష్టించడం తగదని ఏపీ సీఎం జగన్ మోహన్...

హైకోర్టు మొట్టికాయలేస్తే.. టీడీపీని టార్గెట్ చేస్తారెందుకు?

ప్రభుత్వ పాఠశాలల్లోంచి తెలుగు మీడియంని తొలగించి, ఇంగ్లీషు మీడియంని తీసుకురావాలని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నానికి న్యాయస్థానం మొట్టికాయలేసింది. దాంతో, రకరకాల మార్గాల్లో తన ఆలోచనను అమలు చేసేందుకు వైఎస్‌...

టీడీపీకి ‘మహా’ షాక్‌: వైసీపీలోకి ‘ఆ’ తెలుగు తమ్ముళ్ళు.?

తెలుగుదేశం పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, టీడీపీని వీడి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవం ‘మహానాడు’కి ముందే పార్టీ అధినేతకు ఝలక్‌ ఇచ్చేందుకు వైసీపీ...

ఎక్కువ చదివినవి

నా ట్వీట్‌ అర్థం చేసుకోమంటూ మెగా బ్రదర్‌ విజ్ఞప్తి

సామాన్యులు సోషల్‌ మీడియాలో ఏం పోస్ట్‌ చేసినా, ఎలాంటి కామెంట్స్‌ చేసినా కూడా పెద్దగా పట్టించుకోరు. కాని సెలబ్రెటీలు మాత్రం ఏ చిన్న పదం ట్వీట్‌ చేసినా కూడా చాలా పెద్ద ఎత్తున...

దయనీయస్థితిలో బాలీవుడ్ నటుడు

కరోనా నేపథ్యంలో ఇండియాలో పెట్టిన లాక్ డౌన్ వల్ల చాలా మంది ఉపాధి కోల్పోయారు. ఆర్ధిక ఇబ్బందులతో చాలా మంది అల్లాడిపోతున్నారు. వారిలో ప్రముఖ హిందీ నటుడు, మహాభారత్ సీరియల్ లో ఇంద్రుడి...

యంగ్ హీరో కెరీర్ కు ఈ సినిమా చాలా కీలకం

ఏ సపోర్ట్ లేకుండా తన ప్రతిభతో షార్ట్ ఫిలిమ్స్ ద్వారా సినిమాల్లో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు రాజ్ తరుణ్. కెరీర్ మొదట్లో సూపర్ హిట్లు సాధించిన ఈ కుర్రాడు సరైన సినిమాల ఎంపికలో...

ఫ్లాష్ న్యూస్: టిక్ టాక్ వీడియో కారణంగా గొర్రెల కాపరి అరెస్ట్

అనంతపురం జిల్లాలో అటవీ శాక అధికారులు గొర్రెలు కాసుకునే నాగార్జునను అరెస్ట్ చేశారు. అతడు వన్య ప్రాణులను ఇబ్బంది పెడుతూ టిక్ టాక్ వీడియోను చేశాడు. పలు వీడియో లు సోషల్ మీడియాలో...

రంజాన్‌పై కరోనా ఎఫెక్ట్‌: నష్టం కోట్లలోనే.!

రంజాన్‌ సీజన్‌ వచ్చిందంటే ఆ సందడే వేరు. నెల రోజులపాటు పండగ వాతావరణం కన్పిస్తుంటుంది. కరోనా వైరస్‌ దెబ్బకి రంజాన్‌ ఈసారి వెలవెలబోతోంది. ఇది హైద్రాబాద్‌ పరిస్థితి మాత్రమే కాదు.. దేశవ్యాప్తంగా.. ఆ...