Peka Medalu: ‘నా పేరు శివ’, ‘అంధగారం’, ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ సినిమాల్లో నటించిన వినోద్ కిషన్ హీరోగా చేసిన సినిమా ‘పేక మేడలు’ (Peka Medalu). ఓటీటీలో మంచి విజయం సాధించిన ‘ఎవరికీ చెప్పొద్దు’ సినిమాను నిర్మించిన క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ ఈ సినిమా నిర్మిస్తోంది. అనూష కృష్ణ హీరోయిన్ గా నటిస్తున్న సినిమాను రాకేష్ వర్రే నిర్మిస్తున్నారు. నీలగిరి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా జూలై 19న విడుదలవుతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సరికొత్త ప్రమోషన్ తో ముందుకు వెళ్తోంది.
ఇప్పటికే వినూత్న రీతిలో క్యూఆర్ స్కాన్, బంతితో హీరో చేసిన ప్రమోషన్స్ వర్కౌట్ అయ్యాయి. దీంతో సినిమాను ప్రేక్షకుల్లోకి మరింతగా తీసుకెళ్లేందుకు సినిమా ప్రీమియర్ షో టికెట్ రూ.50గా నిర్ణయించి హైదరాబాద్, వైజాగ్, విజయవాడతోపాటు పలు ప్రదేశాల్లో ప్రత్యేక షోలు వేస్తున్నారు.
దర్శకుడు నీలగిరి మామిళ్ల మాట్లాడుతూ.. ‘పేక మేడలు’ ట్రైలర్ కి మంచి స్పందన లభించింది. కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్ తో తెరకెక్కించాం. కంటెంట్ ఉన్న సినిమా. ప్రేక్షకులకు సినిమాను ఆదరించాలని కోరుతున్నా’మని అన్నారు.