Peddi: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. విడుదలైన అన్ని కేంద్రాల్లో అద్భుతమైన కలెక్షన్లతో దూసుకెళ్తోంది. ఈమేరకు ఆరు రోజులకు వసూలైన కలెక్షన్ల వివరాలను మేకర్స్ రివీల్ చేశారు. ఆరు రోజులకు ప్రపంచవ్యాప్తంగా రూ.332.1కోట్లు వసూలు చేసినట్టు తెలిపారు. ఇప్పటికీ అన్ని ఏరియాల్లో స్ట్రాంగ్ హోల్డ్ సంపాదించి మంచి వసూళ్లు రాబడుతోంది.
ట్రేడ్ లెక్కల ప్రకారం ఇప్పటికే గుంటూరు, తూర్పు గోదావరి జిల్లాల్లో బ్రేక్ ఈవెన్ సాధించినట్టు తెలుస్తోంది. మిగిలిన ఏరియాల్లో కూడా దాదాపు ఇదే స్పీడు కొనసాగుతోందని తెలుస్తోంది. చాలా ఏరియాల్లో ఆల్ టైమ్ రికార్డ్ కలెక్షన్లు నమోదవుతున్నాయని తెలుస్తోంది. ఉత్తరాంధ్రలో సరికొత్త రికార్డులు నెలకొల్పుతోందని సమాచారం. క్రాస్ ఓవర్ అథ్లెట్ గా రామ్ చరణ్ క్రికెట్, కుస్తీ, పరుగు.. మూడు ఆటల్లో చూపిన వైవిధ్యానికి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. సినిమాలో రామ్ చరణ్ నటనను ప్రేక్షకులంతా ముక్తకంఠంతో అభినందిస్తున్నారు.

