Ram Charan: ‘అది పాట కాదు.. పూనకం. అది డ్యాన్స్ కాదు.. తాండవం.. అది చరణ్ కాదు.. చిరంజీవి 2.0’… బాబూ చరణూ.. ఏందయ్యా అది. ఆ డ్యాన్స్ ఏందీ.. నీ కథేందీ? మీ నాన్న డ్యాన్స్ తోనే దశాబ్దాలుగా ఉక్కిరిబిక్కిరైపోతున్న మాకు నువ్వైతే అసలు ఊపిరే ఆడనిచ్చేట్టులేవుగా. వామ్మో.. అసలా డ్యాన్స్ సూత్తాంటే కళ్లు ఆర్పబుద్ది కావట్లా.. ఎక్కడ ఏ స్టెప్ మిస్సైపోతామోనని. అసలు నువ్వేసిన డ్యాన్స్ స్పీడ్ ని అందుకోవడానికి మా కళ్లు పోటీ పడుతున్నాయిగా. కాళ్లతో అంత మ్యాజిక్కా! మీ నాన్న చిరంజీవి డ్యాన్స్ చూసి ఎలక్ట్రిఫైయింగ్ డ్యాన్స్ అనేవాళ్లం.. ఇప్పుడు నీకేం పేరు పెట్టాలో అర్ధం కావట్లా. నిన్ను చూసి మీ నాన్న మురిసిపోవుడు కాదు, ఫ్యాన్స్ గా మాకు ముచ్చటేసేత్తంది. మీ నాన్న నిజంగానే నీ రూపంలో ఇండస్ట్రీకి ఓ డైమండే ఇచ్చాడుగా..! —— ‘రాత్రి నుంచి సగటు మెగాభిమాని, చరణ్ అభిమాని మనసులో నెమరవేసుకుంటున్న మాటలివే’నని ఘంటాపథంగా చెప్పొచ్చు.
‘చికిరి’ పాటతో ప్రపంచాన్ని ఊపేసారు రామ్ చరణ్. ఇప్పు డు రెండో పాటగా ‘రై రై రారా..’ విడుదలైంది. పాట మొదలవడమే కరెంట్ షాకిచ్చినట్టు అయిపోతోంది. సగటు చిరంజీవి క్యాంప్ అభిమానిని పక్కన పెడితే ఇతర హీరో అభిమానులు సైతం మురిసిపోతున్న పాట అనేది వినిపిస్తోన్న మాట. ఈ పాట ఇండస్ట్రీని షేక్ చేస్తోందని చెప్పాలి. ఏ.ఆర్.రెహమాన్ బీట్స్ అండ్ వాయిస్, అనంత శ్రీరామ్ లిరిక్స్, జానీ మాస్టర్ డ్యాన్స్ కి రామ్ చరణ్ తన గ్రేస్ తో వేసిన స్టెప్స్ చరణ్ కెరీర్ డ్యాన్సులు ఒకెత్తు.. ‘పెద్ది’లో ఒకెత్తని చెప్పొచ్చు. రెహమాన్ మార్క్ బీట్స్ కి రామ్ చరణ్ నవ్వుతూనే మెరుపు వేగంతో వేసిన స్టెప్స్ నభూతో.. అనాల్సిందే.
‘చికిరి’ పాటతోనే అంచనాలు పెంచుకుంటే.. ‘రై రై రారా’ పాటతో ఇక ఆగలేం అన్నట్టుగా ఉంది ఫ్యాన్స్ పరిస్థితి. పాట దేశవ్యాప్తంగా మరింతగా మోగిపోద్దనడంలో సందేహం లేదు. దర్శకుడు బుచ్చిబాబు కుకింగ్ ఎవరికీ అర్ధం కావట్లేదు కానీ, హై ఎండ్ ఎక్స్ పీరియన్సెడ్ గా హీరో క్యాపబిలిటీతో సినిమా తెరకెక్కించే బ్రిలియంట్ అనిపిస్తున్నాడు.. పాటలో కనిపిస్తోంది. రత్నవేలు సినిమాటోగ్రఫీ మరో హైలైట్. ఇక జానీ మాస్టర్ అయితే.. చరణ్ కోసమే దాచిపెట్టాడన్నట్టు ఆ కొరియోగ్రఫీకి సలాం అనాల్సిందే. పాటలతోనే బీభత్సం జరిగిపోతుంటే విడుదలయ్యాక ఇంకెన్ని వండర్స్ క్రియేట్ చేస్తదోననే ఆసక్తిని పెంచేశారు మేకర్స్. ఆ సిల్వర్ స్క్రీన్ మ్యాజిక్కేంటో చూడాలంటే.. మరో 59 రోజులు ఆగాలి.
