Peddi: ‘పెద్ది’ అఫీషియల్ రిలీజ్ డేట్ వచ్చేసింది.. ‘జూన్ 4’న సినిమా విడుదల

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

92,669FansLike
57,764FollowersFollow

Peddi: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా వస్తున్న సినిమా ‘పెద్ది’. బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఇటివలే షూటింగ్ పూర్తి చేసుకుంది. దీంతో సినిమా అఫిషియల్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది చిత్ర యూనిట్. జూన్ 4వ తేదీ ప్రపంచవ్యాప్తంగా భారీగా సినిమా విడుదులవుతున్నట్టు టీమ్ ప్రకటించింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయి. జూన్ 25న విడుదలవుతున్నట్టుగా బుచ్చిబాబు ఓ సందర్భంలో చెప్పినా సినిమాకు ఉన్న డిమాండ్, అభిమానుల ఆకాంక్షల మేరకు జూన్ 4న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు మేకర్స్. జూన్ 3వ తేదీనే ప్రీమియర్స్ ఉంటాయని చిత్ర నిర్మాత సతీశ్ కిలారు ప్రకటించారు. వృద్ధి సినిమాస్ బ్యానర్లో, సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీస్ సమర్పణలో సినిమా తెరకెక్కుతోంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ ఈవెంట్లో దర్శక, నిర్మాతలు మాట్లాడారు.

బుచ్చిబాబు.. ‘ఏప్రిల్ 30న రానందుకు క్షమించండి. జూన్ 4న వస్తున్నందుకు ఆశీర్వదించండి. జూన్ 4న నా ప్రేమను చరణ్ గారిలో చూద్దురుగానీ. పెద్ది అందరికీ దగ్గరగా ఉంటాడు. పెద్దిని అందరి హృదయాల నుంచి తీసేయడం అంత సులువు కాదు. చాలా ఎమోషన్స్ ఉన్న సినిమా పెద్ది. సినిమా అందరినీ అలరిస్తుందనే బలమైన నమ్మకంతో ఉన్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు రామ్ చరణ్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. పెద్ది క్యారెక్టర్ ను అభిమానులు ఎంతో ఇష్టపడతా’రని అన్నారు.

సతీశ్ కిలారు.. ‘సినిమాను నిర్మించే అవకాశం నాకు ఇచ్చినందుకు రామ్ చరణ్ గారికి కృతజ్ఞతలు. ఒక్క సినిమా అనుభవం లేకపోయినా నాకు అవకాశం ఇచ్చిన రామ్ చరణ్ గారికి జీవితాంతం రుణపడి ఉంటాను. చాలా అంశాలు ఉన్న భారీ కథ ఇది. చిన్నా-పెద్దా ఇంటిల్లపాదినీ అలరించే సినిమా ఇది. పెద్ద కాన్వాస్ ఉన్న సినిమాను బుచ్చిబాబు అద్బుతంగా తెరకెక్కించారు. నటీనటులంతా చక్కగా నటించి ఇంత పెద్ద సినిమాను అద్భుతంగా వచ్చేందుకు కారణమయ్యారు. అందరికీ థ్యాంక్స్’ అని అన్నారు.

సుకుమార్.. ‘చాలా పెద్ద స్పాన్ ఉన్న కథ ఇధి. ఇంత పెద్ద స్క్రిప్ట్ రాసుకున్న బుచ్చిబాబును అభినందిస్తున్నాను. చాలా మంచి ఆలోచనతో కథ రాసుకున్నాడు. ఈ సినిమా క్లైమాక్స్ చిత్రీకరించాలంటే చాలా అనుభవమున్న దర్శకుడి వల్లే సాధ్యం. ఉప్పెనను అద్భుతంగా మలచిన బుచ్చిబాబుకు ఇది సాధ్యమైంది. చాలా ఎమోషన్స్ సినిమాలో ఉంటాయి. ఇంతటి అద్భుతమైన ఎమోషన్స్ ఉన్న సినిమా ఈమధ్య కాలంలో రాలేదని చెప్పగలను. రామ్ చరణ్ అద్భుతంగా నటించాడు. ఒక్కమాటలో చెప్పాలంటే ‘రంగస్థలం’ను మించి నటన ప్రదర్శించాడు. నటనలో చాలా హైట్స్ కి వెళ్లాడు. రై రై రారా పాటలో తన ఎనర్జీ చూస్తే మనసులో సినిమాపై ఎంతగా ఇష్టం పెంచుకున్నాడో అర్ధమవుతోంది. రంగస్థలం హిట్ కావాలని కోరుకున్నా. కారణం.. అందరిలో చిరునవ్వులు ఉండాలి.. అవి ఎప్పటికీ ఉండాలని. తొలి సినిమానే ఇంతటి భారీ సినిమాని నిర్మిస్తున్నందుకు సతీశ్ గారిని అభినందిస్తున్నా. అవకాశం ఇచ్చిన రామ్ చరణ్ గారికి కృతజ్ఞతల’ని అన్నారు. కార్యక్రమంలో సినిమాటోగ్రాఫర్ రత్నవేలు కూడా పాల్గొన్నారు.

సినిమా

సొంత ఊరికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న విజయ్ దేవరకొండ.. 180 మంది...

హీరో విజయ్ దేవరకొండ తన సొంత ప్రాంతానికి ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ విద్యారంగంలో మరో ప్రశంసనీయ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ది దేవరకొండ ఫౌండేషన్ ఆధ్వర్యంలో...

అచ్చంపేట వేదికగా విజయ్-రష్మిక మధుర క్షణాలు.. సోషల్ మీడియాలో ‘కపుల్ గోల్స్’...

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు స్కాలర్‌షిప్‌ల పంపిణీ కార్యక్రమం కోసం అచ్చంపేటకు వెళ్లిన సినీ జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న మరోసారి అభిమానుల దృష్టిని ఆకర్షించారు....

బుచ్చిబాబు క్షమాపణలపై అనంత శ్రీరామ్ వ్యాఖ్యలు.. ఆసక్తికర చర్చకు దారితీసిన స్పందన

పెద్ది సినిమాలో జాన్వీ కపూర్ పాత్రకు సంబంధించిన వివాదం నేపథ్యంలో దర్శకుడు బుచ్చిబాబు చేసిన క్షమాపణలపై ప్రముఖ గేయరచయిత అనంత శ్రీరామ్ స్పందించారు. ఈ విషయంపై...

పెద్ది చిత్రానికి మరో కొత్త ఆకర్షణ.. బుధవారం నుంచి ఎక్స్‌టెండెడ్ కట్

ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందుతున్న పెద్ది సినిమాకు ఇప్పుడు మరో ప్రత్యేక ఆకర్షణ జోడించబడుతోంది. చిత్ర బృందం తాజా ప్రకటన ప్రకారం, బుధవారం నుంచి...

Vijay Devarakonda: ఊరికిచ్చిన హామీని నిలబెట్టుకున్న విజయ్ దేవరకొండ

Vijay Devarakonda: ఇటివల హీరో విజయ్ దేవరకొండ ఓ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. విజయ్ తండ్రి స్వగ్రామమైన నాగర్ కర్నూల్ జిల్లా తుమ్మన్ పేటలోని...

రాజకీయం

సేన ప్రస్థానం.. జాతీయ సమైక్యత కోసం: ఢిల్లీలో జనసేన కీలక సమావేశం

జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ సోమవారం దేశ రాజధాని ఢిల్లీలో పార్టీ ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. "సేన ప్రస్థానం... జాతీయ...

తుని చిన్నారి ఆచూకీపై పవన్ కళ్యాణ్ ఆందోళన.. గాలింపును వేగవంతం చేయాలని ఆదేశం

కాకినాడ జిల్లా తుని మండలంలోని సీహెచ్ అగ్రహారంలో వారం రోజుల క్రితం అదృశ్యమైన చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ కోసం జరుగుతున్న గాలింపు చర్యలపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరోసారి సమీక్ష...

డీఎస్సీ వివాదం.. లోకేశ్‌ను టార్గెట్ చేస్తున్న వైసీపీపై రాజకీయ చర్చ

ఆంధ్రప్రదేశ్‌లో మెగా డీఎస్సీ నియామకాల అంశం మరోసారి రాజకీయ చర్చకు కేంద్రబిందువుగా మారింది. డీఎస్సీ ప్రక్రియలో అక్రమాలు జరిగాయని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సహా వైసీపీ నేతలు ఆరోపిస్తుండగా, కూటమి...

పైకి సింగిల్‌ సింహం… లోపల డబుల్‌ గేమ్‌?

రాజకీయాల్లో మాటలు ఒకలా, వ్యూహాలు మరోలా ఉండటం కొత్త విషయం కాదు. అయితే "సింహం సింగిల్‌గా వస్తుంది" అనే నినాదాన్ని ఎన్నో ఏళ్లుగా ప్రచారం చేసుకున్న వైసీపీ ఇప్పుడు రాజకీయ వాస్తవాల ముందు...

వెన్నుపోటు ఎవరు చేశారు?.. వైసీపీపై అప్పసాని రాజేష్ విమర్శలు

ఏపీలో ఎన్‌డిఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తైన సందర్భంగా నిర్వహిస్తున్న కార్యక్రమాల నేపథ్యంలో వైసీపీపై,  తెలుగుదేశం  పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అప్పసాని రాజేష్ తీవ్ర విమర్శలు చేశారు. ‘రెండేళ్ల నమ్మకం,...

ఎక్కువ చదివినవి

విధ్వంస పాలన నుంచి రాష్ట్రాన్ని ప్రజలే కాపాడారు: సీఎం చంద్రబాబు

తిరుపతిలో నిర్వహించిన కూటమి విజయోత్సవ సభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విస్తృతంగా మాట్లాడారు. తన రాజకీయ ప్రయాణం తిరుపతిలోనే ప్రారంభమైందని, ఇదే రోజున ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి రెండేళ్లు పూర్తయ్యాయని...

NBK 111: బాలకృష్ణ బర్త్ డే స్పెషల్.. కొత్త సినిమా గ్లింప్స్ వచ్చేసింది..

NBK 111: బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న 111వ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. బాలకృష్ణతో 2003లో తెరకెక్కించిన ‘వీరసింహారెడ్డి’తో సక్సెస్ సాధించిన దర్శకుడు గోపీచంద్ మలినేని మళ్లీ ఈ సినిమాకు దర్శకత్వం...

Daily Horoscope: కర్కాటకకు శుభవార్తలు.. ధనుస్సుకు ప్రయాణాల్లో జాగ్రత్త

జూన్ 14 , 2026 ఆదివారం రాశిఫలాలు: చాంద్రమాన పంచాంగం ఆధారంగా జూన్ 14, 2026 ఆదివారం నాటి రాశిఫలాలు ఇవి. ఉద్యోగం, వ్యాపారం, కుటుంబం, ఆర్థిక వ్యవహారాలు మరియు ఆరోగ్యానికి సంబంధించిన సూచనలను...

Daily Horoscope: కర్కాటక రాశికి కుటుంబ సంతోషం.. ధనుస్సు రాశికి కొత్త అవకాశాలు

జూన్ 10 , 2026 బుధవారం రాశిఫలాలు:  ఈరోజు చంద్ర మాన పంచాంగం ఆధారంగా 12 రాశుల వారికి గ్రహస్థితులు మిశ్రమ ఫలితాలను సూచిస్తున్నాయి. ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక వ్యవహారాలు, కుటుంబ జీవితం మరియు...

త్రివిక్రమ్ లైనప్‌లో ప్రభాస్.. చర్చలు జోరుగా!

స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం వెంకటేష్‌తో తన తదుపరి చిత్రాన్ని రూపొందించే పనిలో బిజీగా ఉన్నారు. కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునేలా, అదే సమయంలో కమర్షియల్ ఎలిమెంట్స్‌తో కూడిన కథను సిద్ధం చేస్తున్నట్లు...