సూపర్ స్టార్ రజినీకాంత్ నుండి సినిమా వస్తోందంటే ఆ హంగామా ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. అయితే రజినీ గత సినిమాలు అనుకున్న రేంజ్ లో ఆడకపోవడం వలనో మరొకటో కారణం కానీ పెద్దన్న చిత్రానికి మాత్రం అనుకున్న స్థాయిలో బజ్ లేదు. దర్శకత్వంలో వచ్చిన పెద్దన్న ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
కథ:
విలేజ్ ప్రెసిడెంట్ అయిన వీరన్న (రజినీకాంత్)కు తన చెల్లెలు కనకమహాలక్ష్మి (కీర్తి సురేష్) అంటే పంచప్రాణాలు. మహాలక్ష్మి చదువు పూర్తవ్వడంతో జమిందార్ (ప్రకాష్ రాజ్) తమ్ముడితో పెళ్లి సంబంధం కుదురుస్తాడు వీరన్న. అయితే పెళ్లి రోజున మహాలక్ష్మి తన కాలేజ్ ఫ్రెండ్ తో కోల్కతా వెళ్ళిపోతుంది. ఆరు నెలల తర్వాత వీరన్న తన చెల్లెలు పడుతోన్న బాధలు తెలుసుకుని తనకొక నీడలా ఉంటూ తన కష్టాలు ఒక్కొక్కటిగా తీరుస్తాడు. అయితే మహాలక్ష్మి పెళ్లయ్యాక ఎదుర్కొనే కష్టాలు ఏంటి? ఎలా వీరన్న ఆ సమస్యలను అధిగమించాడు అన్నది పెద్దన్న మిగిలిన కథ.
పెర్ఫార్మన్స్:
రజినీకాంత్ తన ఎనర్జిటిక్ పెర్ఫార్మన్స్ తో ఇంప్రెస్ చేసాడు. అటు ఫ్యామిలీ సీన్స్ కానీ ఇటు యాక్షన్ సీన్స్ కానీ రజినీకాంత్ అన్ని వైపులా మెప్పించాడు. కీర్తి సురేష్ హీరో చెల్లెలి పాత్రలో రాణించింది. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్ లో ఆమె పెర్ఫార్మన్స్ బాగుంది. అన్న-చెల్లి థ్రెడ్ ను దర్శకుడు బాగానే మలిచాడు. నయనతార చూడటానికి బాగుంది కానీ ఆమె పాత్ర నిడివి చాలా తక్కువ. అభిమన్యు సింగ్, జగపతి బాబు విలన్లుగా కనిపించారు. ఖుష్బూ, మీనా, ప్రకాష్ రాజ్ లను సరిగా ఉపయోగించుకోలేదు. హీరో అసిస్టెంట్ గా కమెడియన్ సూరి పాత్ర పర్వాలేదు.
సాంకేతిక నిపుణులు;
విశ్వాసంతో అందరినీ మెప్పించిన శివకు రజినీకాంత్ ను డైరెక్ట్ చేసే అద్భుత అవకాశం వచ్చింది. అయితే శివ మాత్రం దాన్ని సరిగా ఉపయోగించుకోలేదు అనిపిస్తుంది. చాలా చాలా పాత కథను ఈ సినిమా కోసం ఎంచుకున్నాడు. దానికి తోడు టేకింగ్ ఐతే మనల్ని 80లలోకి తీసుకెళ్తుంది. అన్న-చెల్లెలి అనుబంధం మీద కథ ఎవర్ గ్రీన్ ఏ కానీ దానికి బెటర్ వెర్షన్ స్క్రీన్ ప్లే ను రాసుకుని ఉంటే బాగుండేది. తెలుగు డైలాగ్స్ బాగానే ఉన్నా డబ్బింగ్ పూర్తిగా గాడి తప్పినట్లు అనిపిస్తుంది.
డి. ఇమ్మాన్ సంగీతంలో గోల ఎక్కువైంది. పాటలు అన్నీ కూడా మాస్ మసాలా తమిళ్ సాంగ్స్ ను రిప్రెసెంట్ చేసాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అదే తరహాలో సాగింది. సినిమాటోగ్రఫీ పర్వాలేదు. ఎడిటింగ్ కూడా అంతే. యాక్షన్ సన్నివేశాల్లో గ్రాఫిక్ సీన్స్ అస్సలు బాలేవు. రజినీకాంత్ వంటి స్టార్ సినిమా నుండి ఈ స్థాయి ఔట్పుట్ ను ఆశించలేం.
పాజిటివ్ పాయింట్స్:
- రజినీకాంత్
- కీర్తి సురేష్
నెగటివ్ పాయింట్స్:
- పాత కథ, నరేషన్
విశ్లేషణ:
పెద్దన్న ఒక రొటీన్ ఫ్యామిలీ డ్రామా. ఫ్యాన్స్ వరకూ సెకండ్ హాఫ్ లో కొంత వెసులుబాటు ఉందేమో కానీ మిగిలిన వారికి ఈ చిత్రం అంతగా రుచించకపోవచ్చు. రజినీకాంత్, కీర్తి సురేష్ మధ్య థ్రెడ్ కొంత ఊరటనిస్తోంది. మొత్తంగా చూసుకుంటే పాత కథ, రొటీన్ నరేషన్ తో సాగిన పెద్దన్న ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేదు.
తెలుగు బులెటిన్ రేటింగ్: 2/5