Switch to English

ఓటిటి రివ్యూ: అనగనగా ఓ అతిథి – పైన పటారం లోన లొటారం.!

Critic Rating
( 1.50 )
User Rating
( 1.00 )

No votes so far! Be the first to rate this post.

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,464FansLike
57,764FollowersFollow
Movie అనగనగా ఓ అతిథి
Star Cast పాయల్ రాజ్ పుత్, చైతన్య కృష్ణ
Director దయాల్ పద్మనాభన్
Producer రాజా రామ్మూర్తి - చిదంబరం నటేశన్
Music అర్రోల్ కోరెల్లి
Run Time 1 గంట 32 నిముషాలు
Release నవంబర్ 20, 2020

తెలుగు ఓటిటి ప్లాట్ ఫామ్ అయిన ఆహా వరుసగా స్టార్స్ తో మూవీలు, సీరీస్ లు, షోలతో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ‘RX 100’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు హాట్ బ్యూటీగా గుర్తుండిపోయిన పాయల్ రాజ్ పుత్ ప్రధాన పాత్రలో చేసిన ఆహా ఫిల్మ్ ‘అనగనగా ఓ అతిథి’. ఆహాలో రిలీజైన ఈ సినిమా ఏ మేర మెప్పించిందో ఇప్పుడు చూద్దాం..

కథ:

అనగనగా ఓ ఊరు, ఆ ఊరికి 3 మైళ్ళ దూరంలో పొలాల మధ్య ఓ ఒంటిల్లు గుడిసె.. ఆ ఒంటిల్లు సుబ్బయ్య(ఆనంద చక్రపాణి ) కుటుంబానికి పలు సమస్యలు ఉంటాయి. సుబ్బయ్య భార్య అన్నపూర్ణ(వీణ సుందర్) వాళ్ళకి ఓ కుమార్తె మల్లిక(పాయల్ రాజ్ పుత్). వయసులో ఉండే మల్లి మీదే అప్పు ఇచ్చిన వాళ్ళందరి కన్ను. అలాంటి సమయంలో ఊరు ఊరు తిరుగుతూ ఆ ఊరి గురించి విశేషాలు రాసే జర్నలిస్ట్ అంటూ శ్రీను(చైతన్య కృష్ణ) ఆ ఇంటి మీదగా వెళుతూ, ఆ రాత్రికి అక్కడ బస చేయడానికి అడగగా, మల్లి కుటుంబం కూడా ఒప్పుకుంటుంది. కానీ అతని దగ్గర ఉన్న డబ్బు చూసిన మల్లి కుటుంబానికి, అతన్ని చంపేసి ఆ డబ్బు కాజేస్తే తమ కష్టాలన్నీ తీరిపోతాయని, అందుకే చంపేయాలని నిర్ణయించుకుంటారు. ఇక అక్కడి నుంచి ఏం జరిగింది? మల్లి కుటుంబం ఆ కృష్ణని చంపిందా? లేదా? అసలు ఆ కృష్ణ ఎవరు? అనేదే అసలైన కథ.

తెర మీద స్టార్స్..

ఇప్పటి వరకూ గ్లామరస్ గానే కనిపించిన పాయల్ రాజ్ పుత్ మొదటిసారి పూర్తి విభిన్నమైన, డీ గ్లామర్ పల్లెటూరి అమ్మాయి పాత్రలో కనిపించింది. అలాగే అసహనం – ఆశ తో రగిలిపోతున్న అమ్మాయిగా అద్భుతమైన హావభావాలను పలికించింది. గ్లామరే కాదు, సూపర్బ్ పెర్ఫార్మర్ అని కూడా అనిపించుకుంది. చైతన్య కృష్ణ కూడా తనకి ఇచ్చిన పాత్రలో బాగా చేసాడు. తల్లి తండ్రుల పాత్రలో కనిపించిన ఆనంద చక్రపాణి, వీణ సుందర్ లు సపోర్టింగ్ రోల్స్ లోమెప్పించారు. ఆన్ స్క్రీన్ నటన పరంగా అందరూ ది బెస్ట్ ఇచ్చారు.

తెర వెనుక టాలెంట్..

మోహన్ హబ్బు రాసిన కన్నడ నాటకం ‘కరాళ రాత్రి’ ఆధారంగా దయాల్ పద్మనాభన్ ఈ సినిమా కథని రాశారు. కథా పరంగా వచ్చే క్లైమాక్స్ ట్విస్ట్ అండ్ మెసేజ్ అందరినీ మెప్పిస్తుంది. కానీ కథా పరంగా మొదటి నుంచీ రాసుకున్న ఎమోషన్ కనెక్ట్ కాకపోవడం వలన క్లైమాక్స్ లో ఎమోషన్ వర్కౌట్ కాలేదు. కథ, కథనాల పరంగా సినిమా మొదటి నుంచి పెద్ద ఆసక్తికరంగా లేకుండా సాగుతుంది. అలాగే డైరెక్టర్ ఓ దృశ్య కావ్యం చెప్పినట్టు ఎక్కువగా విజువల్ నేరేషన్ తో చెప్పాలనుకున్నాడు. ప్రతి షాట్, ప్రతి ఫ్రేమ్ అంతే బ్యూటిఫుల్ గా తీసుకున్నాడు. కానీ ఆ విజువల్స్ ధ్యాసలో పడి, కథని సాగదీసేసారు. కనీసం పాత్రల మధ్య జరిగే అంతర్మధన సంఘర్షణని, ఎమోషన్స్ ని సరిగా చూపించి ఉంటే కథకి ఎమోషనల్ డ్రైవ్ అయినా ఉండేది. కానీ అది లేకపోవడం వలన క్లైమాక్స్ లో మల్లి ఫ్యామిలీ తీసుకునే నిర్ణయం అసంతృప్తిగా ఉంటుంది. మొత్తంగా దయాల్ పద్మనాభన్ కథ – కథనం – దర్శకత్వం గురించి చెప్పాలంటే, కథలో మెసేజ్ ఉంది, కానీ ఎమోషన్స్ మిస్ అయ్యాయి, కథనంలో ఆసక్తికన్నా సాగదీతే ఎక్కువుంది, దర్శకుడిగా నటన, విజువల్సే కాదు ప్రేక్షకుడిగా కూడా ఒకసారి ఆలోచించాల్సింది.

కాశీ నడింపల్లి రాసిన మాటలు చాలా బాగున్నాయి. ఒక్క మాటలోనే ఆశ – వాస్తవానికి సంబందించిన అర్థాలు వచ్చేలా మాటలు రాయడం చాలా కష్టం, కానీ కాశీ చాలా బాగా రాశారు. రాకేష్. బి విజువల్స్ మరియు అర్రోల్ కోరెల్లి మ్యూజిక్ కూడా సినిమాకి హెల్ప్ అయ్యింది. ఎడిటింగ్ లో సినిమాని ఒక 30 నిమిషాలు లేపేసి ఒక గంట సినిమాగా షార్ప్ గా చెప్పి ఉంటే బాగుండేది. ఆర్ట్ వర్క్ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

విజిల్ మోమెంట్స్:

– పాయల్ రాజ్ పుత్ పెర్ఫార్మన్స్
– కాశీ నడింపల్లి డైలాగ్స్
– విజువల్స్ అండ్ మ్యూజిక్

బోరింగ్ మోమెంట్స్:

– కథలో కనెక్షన్ మిస్ అవ్వడం
– బోరింగ్ కథనం
– ఎమోషన్స్ తో కట్టిపడేయలేకపోవడం
– డైరెక్షన్
– రన్ టైం
– ఎడిటింగ్

విశ్లేషణ:

అనగనగా ఓ అతిథి సినిమాలో మంచి కథా వస్తువు ఉంది, కానీ దాన్ని సరిగా మెటీరియలైజ్ చేయలేదు, కథనంలో ఆసక్తి లేదు, ఎమోషనల్ గా డైరెక్ట్ చేయలేదు. కేవలం పాయల్ రాజ్ పుత్ గ్లామర్, స్టార్ పవర్ ని చూపించి సేల్ చేయాలనుకున్నారు కానీ చూసిన ఎవరికీ సినిమా నచ్చకపోగా, ఇంత స్టార్ పవర్ అండ్ పెర్ఫార్మర్స్ ని పెట్టుకొని కాస్త కంటెంట్ ఉన్న సినిమాలు తీయండయ్యా, ఎంత ఓటిటి అయితే మాత్రం ఇంత బోరింగ్ సినిమాలు తీయాలా అనే ఫీలింగ్ వస్తుంది. చివరిగా ‘అనగనగా ఓ అతిథి ‘చూసిన ప్రేక్షకుల పాలిట ‘అనగనగా ఓ శత్రువు’లా మారింది.

చూడాలా? వద్దా?: పాయల్ రాజ్ పుత్ అండ్ ట్రైలర్స్ ని చూసి మోసపోకండి.

తెలుగుబులెటిన్.కామ్ రేటింగ్: 1.5/5

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Ram Charan: ‘రామ్ చరణ్ అంటే ఇష్టం..’ మాజీ మిస్ వరల్డ్...

Ram Charan: 2017లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న భారతీయరాలు ‘మానుషి చిల్లార్’. (Manushi Chillar) ఇటివల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej)...

Trivikram: త్రివిక్రమ్ @25..! మనల్ని మనకే పరిచయం చేసే మాటల మాంత్రికుడు..

Trivikram: అక్షరాలు పదాలు.. పదాలు వాక్యాలు.. వాక్యాలు భావులుగా రాయడం రచయితలకు మాత్రమే సాధ్యం. అయితే.. వాటిని ఎంత భావయుక్తంగా రాస్తారనేదే ప్రశ్న. ఎందరో రచయితలు...

Nani: ‘జెర్సీ’ @5..! ధియేటర్లో సినిమా చూసిన నాని.. ఎమోషనల్ పోస్ట్

Nani: నాని (Nani) హీరోగా గౌతమ్ తిన్ననూరి (Gowtham Thinnanuri) దర్శకత్వంలో వచ్చిన ‘జెర్సీ’ (Jersey) విడుదలై నిన్నటికి 5ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సినిమాను...

Upasana: ఆవకాయ పట్టిన అత్తమ్మ.. ఆటపట్టించిన ఉపాసన.. వీడియో వైరల్  

Upasana: టాలీవుడ్ (Tollywood) లో మెగా ఫ్యామిలీ (Mega Family) అంటే ఒక సందడి. ఒక బ్రాండ్. ముఖ్యంగా చిరంజీవి (Chiranjeevi). ఆయనొక ఇన్ స్పిరేషన్...

Puri Jagannadh: ఎవరు కొడితే బొమ్మ బ్లాక్ బస్టరవుద్దో.. అతనే ‘పూరి...

Puri Jagannadh: సినిమాకి హీరోకి ఉండే క్రేజే వేరు. సరైన సినిమాపడి స్టార్ స్టేటస్ వస్తే ఫ్యాన్స్ పెరుగుతారు.. డెమీ గాడ్ కూడా అయిపోతాడు. హీరో...

రాజకీయం

గ్రౌండ్ రిపోర్ట్: మంగళగిరిలో నారా లోకేష్‌కి సానుకూలమేనా.?

‘ఓడిపోయాడు, నియోజకవర్గం మార్చేస్తాడు..’ అంటూ నారా లోకేష్ గురించి నానా రకాల ప్రచారమూ జరిగింది. 2019 ఎన్నికల్లో నారా లోకేష్ రిస్క్ తీసుకుని మరీ, మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారని టీడీపీ చెబుతుంటుంది. అందులో...

చిరంజీవిపై ‘మూక దాడి’.! వైసీపీకే పెను నష్టం.!

వైఎస్ వివేకానంద రెడ్డికే అక్రమ సంబంధాలు అంటగట్టిన ఘన చరిత్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది.! వైఎస్ షర్మిలా రెడ్డిని కాస్తా మెరుసుపల్లి షర్మిల శాస్త్రి.. అంటూ ఎగతాళి చేసిన ఘనత వైసీపీకి కాక...

ఏపీలో బీజేపీని ఓడించేయనున్న బీజేపీ మద్దతుదారులు.!

ఇదో చిత్రమైన సందర్భం.! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి, ఆ పార్టీ మద్దతుదారులే శాపంగా మారుతున్నారు. అందరూ అని కాదుగానీ, కొందరి పైత్యం.. పార్టీ కొంప ముంచేస్తోంది.! టీడీపీ - బీజేపీ...

వ్యూహకర్తల మాటే శాసనం.. వారిదే పెత్తనం

దేశ రాజకీయాల్లో వ్యూహకర్తల పాత్ర రోజురోజుకి పెరిగిపోతోంది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించి ఎత్తుకు పై ఎత్తులు వేసే రోజులు పోయాయి. మరి ముఖ్యంగా ప్రచార పర్వాన్ని వ్యూహకర్తలే శాసిస్తున్నారు....

కులాంతరంలో కూడా రాజకీయ క్రీడ.!

ప్రజల నుంచి ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోవాలి అంటే.. ప్రజలందరికి మంచి చెయ్యటం వ్యక్తులకి సాధ్యం కాదు. అందుకని మనుషులని ఎదో ఒకరకంగా కూడగట్టాలి. ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలు, రైతులు, కార్మికులు, విద్యార్థులు,...

ఎక్కువ చదివినవి

ఎలక్షన్ కమిషన్ నెక్స్ట్ టార్గెట్ ఏపీ సీఎస్, డీజీపీ!

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలన్న ఉద్దేశంతో ఫిర్యాదులు అందిన పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఇప్పటికే బదిలీ...

నర్సాపురం అసెంబ్లీ గ్రౌండ్ రిపోర్ట్: ఎడ్జ్ జనసేన పార్టీకే.!

2024 ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నర్సాపురం కూడా ఒకింత హాట్ టాపిక్ అవుతున్న నియోజకవర్గమే. నర్సాపురం లోక్ సభ నియోజకవర్గం అలాగే, ఆ పరిధిలోని నర్సాపురం అసెంబ్లీ నియోజకవర్గం.. ఈ...

Puri Jagannadh: ఎవరు కొడితే బొమ్మ బ్లాక్ బస్టరవుద్దో.. అతనే ‘పూరి జగన్నాధ్’

Puri Jagannadh: సినిమాకి హీరోకి ఉండే క్రేజే వేరు. సరైన సినిమాపడి స్టార్ స్టేటస్ వస్తే ఫ్యాన్స్ పెరుగుతారు.. డెమీ గాడ్ కూడా అయిపోతాడు. హీరో స్టయిల్స్, మేనరిజమ్స్ ఫాలో అవుతారు ఫ్యాన్స్....

చిరంజీవిపై ‘మూక దాడి’.! వైసీపీకే పెను నష్టం.!

వైఎస్ వివేకానంద రెడ్డికే అక్రమ సంబంధాలు అంటగట్టిన ఘన చరిత్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది.! వైఎస్ షర్మిలా రెడ్డిని కాస్తా మెరుసుపల్లి షర్మిల శాస్త్రి.. అంటూ ఎగతాళి చేసిన ఘనత వైసీపీకి కాక...

అవినాష్ వర్సెస్ సునీత.! కడపలో వైసీపీ ఖేల్ ఖతం.!

సీబీఐ ఛార్జిషీట్‌లో పేర్కొన్న అంశాల్నే ప్రస్తావిస్తున్నారు మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీతా రెడ్డి.! 2019 ఎన్నికల సమయంలో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగితే, సీబీఐ విచారణ కోసం...