Switch to English

వారు మంత్రులవడానికి పవన్ కళ్యాణ్ కారణమా.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,469FansLike
57,764FollowersFollow

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సొంత అభ్యర్థుల్ని గెలిపించలేకపోయినా, తాను సొంతంగా గెలవలేకపోయినా.. ఓడించాలనుకున్న వారిని గెలిపించడమేకాక.. వారు మంత్రులవడానికి పరోక్షంగా దోహదపడ్డాడు. వినడానికి విచిత్రంగా విన్నా ఇది వాస్తవం.. వివరాల్లోకి వెళితే.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొన్నప్పుడు.. ఎక్కువగా స్థానిక నేతల్ని టార్గెట్ చేసి విమర్శలు చేశారు. అలా చేసిన వారు.. పూర్వాశ్రమంలో ప్రజారాజ్యంపార్టీలో పనిచేసినవారే కావడం విశేషం.

తెలుగుదేశం నుండి అనకాపల్లి పార్లమెంట్ సభ్యుడిగా పనిచేసి .. ఎన్నికలకు ముందు వైఎస్సార్సీపీలో చేరిన అవంతి శ్రీనివాస్ ను పవన్ కళ్యాణ్ టార్గెట్ చేశారు. పార్లమెంట్ కాంటీన్ లో సబ్సిడీ రేట్లపై మీల్స్ తినడంలో అవంతి శ్రీనివాస్ కు వున్న శ్రద్ద.. విశాఖ రైల్వేజోన్ సాధించడంలో పెట్టడం లేదని విమర్శించారు. నిజానికి అంత అవమానకరంగా అవంతిని విమర్శించకుండా ఉండాల్సింది.. అని అప్పట్లోనే కొందరు వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్ విమర్శలను అవంతి శ్రీనివాస్ భరించాడు గానీ.. ప్రతిస్పందించలేదు.

ఇక ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవికి సన్నిహితంగా మెలిగిన కురసాల కన్నబాబును కాకినాడ రూరల్ ప్రాంతానికి వెళ్లిన సందర్భంగా పవన్ కళ్యాణ్ దారుణంగా విమర్శించారు. స్కూటర్ పై తిరిగే కన్నబాబు వందల కోట్లు ఏ విధంగా సంపాదించాడని పవన్ కళ్యాణ్ పబ్లిక్ మీటింగ్ లో చెప్పారు. దానికి కన్నబాబు ధీటుగా ప్రతిస్పందించాడు. అవంతి శ్రీనివాస్, కన్నబాబుల ఓటమికి జనసేన బాగానే కృషి చేసింది. ఆ క్రమంలో జనసేన.. తెలుగుదేశం పార్టీ ఓట్లు చీల్చింది. అవంతి, కన్నబాబుల మీద పవన్ పాలు పోసినట్లయింది. ఇద్దరు గెలిచారు.. వారిద్దరికీ జగన్ మంత్రి పదవులు కట్టబెట్టారు. పవన్ అనుకున్నదొక్కటి అయిందొక్కటి.

Related Posts

ఆర్జీవీ పంచ్‌.. పవన్‌ ఫ్యాన్స్‌ రివర్స్‌ పంచ్‌!

ఓడి గెలిచిన జనసేనాని పవన్‌ కళ్యాణ్‌

జనసేనానికి ‘మెగా’ గైడెన్స్‌ షురూ

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Chiranjeevi: చిరంజీవితో రష్యన్ సినిమా ప్రతినిధుల భేటీ.. చర్చించిన అంశాలివే

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)తో రష్యా నుంచి వచ్చిన మాస్కో సాంస్కృతిక శాఖ ప్రతినిధులు సమావేశమయ్యారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని చిరంజీవి...

Tollywood: ‘మిస్టర్.. మాట జారొద్దు..’ నటుడికి హీరోయిన్ ఘాటు రిప్లై

Tollywood: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ట్వీట్ వార్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ‘హాయ్...

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై సందీప్ రెడ్డి ఆగ్రహం.. కారణం...

Sandeep Reddy Vanga: 5ఏళ్ళ క్రితం సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘కబీర్ సింగ్’ (Kabir Singh)....

Jithender Reddy: ‘జితేందర్ రెడ్డి’ నుంచి మంగ్లీ పాట.. “లచ్చిమక్క” విడుదల

Jithender Reddy: బాహుబలి, మిర్చి సినిమాలతో నటుడిగా పేరు తెచ్చుకున్న రాకేష్ వర్రె హీరోగా నటించిన సినిమా ‘జితేందర్ రెడ్డి’ (Jithender Reddy). విరించి వర్మ...

Chiranjeevi: CCTలో 100వసారి రక్తదానం చేసిన మహర్షి రాఘవ.. అభినందించిన చిరంజీవి

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి 26ఏళ్ల క్రితం (1998 అక్టోబర్ 2) ప్రారంభించిన చిరంజీవి చారిటబుల్ ట్రస్టులో నేడు అద్భుతమే జరిగింది. ‘రక్తదానం చేయండి.. ప్రజల ప్రాణాలు...

రాజకీయం

21 అసెంబ్లీ సీట్లు.! జనసేన ప్రస్తుత పరిస్థితి ఇదీ.!

మొత్తంగా 21 అసెంబ్లీ సీట్లలో జనసేన పార్టీ పోటీ చేయబోతోంది.! వీటిల్లో జనసేన ఎన్ని గెలవబోతోంది.? పోటీ చేస్తున్న రెండు లోక్ సభ నియోజకవర్గాల్లో జనసేన పార్టీ ఎంత బలంగా వుంది.? ఈ...

గ్రౌండ్ రిపోర్ట్: నగిరిలో రోజా పరిస్థితేంటి.?

ముచ్చటగా మూడోసారి నగిరి నియోజకవర్గం నుంచి రోజా గెలిచే అవకాశాలున్నాయా.? అంటే, ఛాన్సే లేదంటోంది నగిరి ప్రజానీకం.! నగిరి వైసీపీ మద్దతుదారులదీ ఇదే వాదన.! నగిరి నియోజకవర్గంలో రోజాకి వేరే శతృవులు అవసరం...

పవన్ కళ్యాణ్‌కీ వైఎస్ జగన్‌కీ అదే తేడా.!

ఇతరుల భార్యల్ని ‘పెళ్ళాలు’ అనడాన్ని సభ్య సమాజం హర్షించదు. భార్యల్ని కార్లతో పోల్చడం అత్యంత జుగుప్సాకరం.! ఈ విషయమై కనీస సంస్కారం లేకుండా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...

కూలీలపై హత్యా నేరం మోపుతారా.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విజయవాడ నగరం నడిబొడ్డున హత్యాయత్నం జరిగిందంటూ వైసీపీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారం సందర్భంగా, గుర్తు తెలియని వ్యక్తి విసిరిన...

బి-ఫామ్స్ అందిస్తూ.. ప్రమాణం చేయించిన పవన్ కళ్యాణ్.!

రాజకీయాల్లో ఇదొక కొత్త ఒరవడి.. అనడం అతిశయోక్తి కాదేమో.! జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తున్న 21 మంది అసెంబ్లీ అభ్యర్థులు, ఇద్దరు లోక్ సభ అభ్యర్థులకు (తనతో కలుపుకుని) జనసేన అధినేత...

ఎక్కువ చదివినవి

వైసీపీ వద్దే వద్దు: ఉత్తరాంధ్ర గ్రౌండ్ రిపోర్ట్ ఇదీ.!

ఉత్తరాంధ్రలోని మూడు ఉమ్మడి జిల్లాలు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో ఓ చిన్నపాటి గ్రౌండ్ రిపోర్ట్.. ఆంధ్ర ప్రదేశ్ రాజకీయ వర్గాల్లో ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్స్‌కి కారణమవుతోంది.! అసలేంటా గ్రౌండ్ రిపోర్ట్.? ఎవరు చేశారోగానీ, ఈ గ్రౌండ్...

Andhra Pradesh: బీసీ ఓ బ్రహ్మ పదార్ధం

తెలుగు రాజకీయాల్లో తరుచు వినిపించే మాట ఓట్లు మావి సీట్లు మీవా ? వెనుకపడిన తరగతులకు రాజాధికారం. వెనుకపడిన తరగతుల కి ఇచ్చిన సీట్స్ ని ప్రతి రాజకీయ పార్టీ ప్రముఖంగా చెప్పటం,...

పవన్ కళ్యాణ్ వెళితేగానీ, తిరుపతి సెట్టవలేదా.?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తిరుపతి వెళ్ళారు, పార్టీ శ్రేణుల్లో తిరుపతి అసెంబ్లీ అభ్యర్థి విషయమై నెలకొన్న గందరగోళాన్ని సరి చేశారు.! జనసేన నేత, టిక్కెట్ ఆశించి భంగపడ్డ కిరణ్ రాయల్, పవన్...

పవన్ కళ్యాణ్‌కీ వైఎస్ జగన్‌కీ అదే తేడా.!

ఇతరుల భార్యల్ని ‘పెళ్ళాలు’ అనడాన్ని సభ్య సమాజం హర్షించదు. భార్యల్ని కార్లతో పోల్చడం అత్యంత జుగుప్సాకరం.! ఈ విషయమై కనీస సంస్కారం లేకుండా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...

మళ్ళీ అదే పెళ్ళిళ్ళ గోల.! గులక రాయి గట్టిగానే తగిలిందా.?

మళ్ళీ అదే పాత స్క్రిప్ట్.! ఇందులో తేడా ఏమీ వుండదు.! ఐదేళ్ళ పాలనలో రాష్ట్ర ప్రజలకు ఏం చేశారో చెప్పుకోవాలి.! మళ్ళీ అధికారంలోకి వస్తే ఏం చేస్తారో చెప్పుకోవాలి.! మద్య నిషేధంపై మాట...