సినీ నటుడిగా పవన్ కళ్యాణ్‌కి వున్న ఫాలోయింగ్ గురించి కొత్తగా చెప్పేదేముంది.? కామన్ మెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ పేరుతో ఓ గ్రూప్‌ని ఆయన చాన్నాళ్ళ క్రితం ప్రకటిస్తే, అలా ఆ ఫోర్స్‌ని ప్రకటించిన వెంటనే విరాళాలు పోటెత్తాయి. అయితే, పవన్ కళ్యాణ్ మాత్రం ఆ విరాళాల్ని తీసుకోలేదు. తనవంతుగా ఆ ఫోర్స్‌కి విరాళం మాత్రం అందించాడు. పవన్ కోరితే, విరాళాలు ఏ స్థాయిలో పోటెత్తుతాయో చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి.?
ఇక, ఇప్పుడు జనసేన విషయానికొద్దాం.. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు నేపథ్యంలో అభిమానులు సోషల్ మీడియా వేదికగా ‘విరాళాల కోసం’ ముందుకొచ్చారు. తమలో తాము కూడబలుక్కుని, పెద్ద మొత్తంలో జనసేనకు డొనేట్ చేయాలని ఫిక్స్ అయ్యారు. వారి అంచనాల్లో దాదాపు 100 కోట్లు దాటెయ్యాలనుకున్నారు. కానీ, పవన్ కళ్యాణ్ పుట్టినరోజునాడు జనసేన పార్టీకి అందిన విరాళం 3 కోట్లు మాత్రమేనట. ఈ విషయాన్ని స్వయంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్వయంగా వెల్లడించారు. ఇది తమ పార్టీగా భావించి జనసైనికులు అందించిన ఈ విరాళం చాలా గొప్పదని చెప్పారాయన.
సినిమా పరంగా ఫస్ట్ డే వసూళ్ళ లెక్క చూసుకున్నా, జనసేన పార్టీకి వచ్చిన 3 కోట్ల విరాళం చాలా చాలా తక్కువ. సోషల్ మీడియాలో మాత్రం, తాము ఎడా పెడా విరాళం ఇచ్చేశామని అభిమానులు ప్రకటించేసుకున్నారు. వాళ్ళు చెప్పిదాంట్లో ఎంత నిజం.? అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
కేవలం జన సైనికుల్ని (పార్టీ పరంగా రిజిస్టర్ అయిన వాళ్ళు) పరిగణనలోకి తీసుకుని పవన్ 3 కోట్లరూపాయల లెక్క చెప్పారా.? అన్న దిశగా కూడా పలు ఊహాగానాలు విన్పిస్తున్నాయి. రాజకీయ పార్టీలకు విరాళాలు కొత్తేమీ కాదు. బడా పారిశ్రామిక వేత్తలు పెద్దయెత్తున విరాళాలు ఇస్తుంటారు. అయితే, జనసేన పార్టీకి మాత్రం ఆ స్థాయిలో విరాళాలు అందడంలేదన్నది ఇన్‌సైడ్ సోర్సెస్ కథనం. మరోపక్క, విరాలాల విషయంలో జనసేన ప్రదర్శిస్తోన్న పారదర్శకత కూడా ఈ సమస్యకు కారణమన్న వాదనలూ లేకపోలేదు.
Also Read : జనసేనానీ.. అందుకే నువ్వు ‘దేవుడివి’ సామీ.!
