Switch to English

పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ మూవీ రివ్యూ – ఆలోచింపజేసే పవర్ ప్యాక్డ్ ఫిల్మ్.!

Critic Rating
( 3.50 )
User Rating
( 3.40 )

No votes so far! Be the first to rate this post.

Movie వకీల్ సాబ్
Star Cast పవన్ కళ్యాణ్, నివేత థామస్, అంజలి, శృతి హాసన్, ప్రకాష్ రాజ్
Director వేణు శ్రీరామ్
Producer దిల్ రాజు - బోణి కపూర్
Music ఎస్. థమన్
Run Time 2 గంటల 35 నిమిషాలు
Release ఏప్రిల్ 9, 2021

దాదాపు మూడేళ్ళ గ్యాప్ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మళ్ళీ తెరపై కనిపించనున్న సినిమా ‘వకీల్ సాబ్‘. 2016 లో అమితాబ్ బచ్చన్ – తాప్సి ప్రధాన పాత్రల్లో వచ్చిన సూపర్ హిట్ ఫిల్మ్ పింక్ సినిమాకి రీమేక్ గా ఈ సినిమాని రూపొందించారు. తెలుగు అభిమానుల అభిరుచికి తగ్గట్టు, పవన్ కళ్యాణ్ పాత్రని పొడిగించి, ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కూడా జత చేసి చేసి చేసిన ఈ సినిమా పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు, తెలుగు సినీ ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో ఇప్పుడు చూద్దాం..

కథ:

ప్రజలకోసం ఏదైనా చేయాలి అని ఆరాటపడే కె సత్యదేవ్(పవన్ కళ్యాణ్) సామాన్యులకి న్యాయం జరగాలని లాయర్ అవుతాడు. అదే సమయంలో శృతి హాసన్ తో ప్రేమలో పది పెళ్లి చేసుకుంటాడు. ఆ తర్వాత లైఫ్ లో జరిగిన కొన్ని సంఘటనల కారణంగా తన లాయర్ వృత్తిని వదిలేస్తాడు. అలా వదిలేసి హైదరాబాద్ లోని ఓ ఏరియాలకు షిఫ్ట్ అవుతాడు. అదే ఏరియాలో ఉంటున్న అంజలి, నివేత థామస్ మరియు అనన్యలు ఎంపీ కొడుకు అండ్ బ్యాచ్ ని కొట్టి పారిపోయిన కేసులో నివేతని జైల్లో పెడతారు. ఎంపీ తన పలుకుబడితో నివేతకి బెయిల్ రాకుండా చేస్తుంటాడు. అంజలి వాళ్ళ కేసు ఎఫ్.ఐ.ఆర్ చూసిన సత్యదేవ్ వాళ్ళకి కొన్ని సూచనలు ఇచ్చి హెల్ప్ చేస్తాడు. అది తెలుసుకున్న ఎంపీ ఆ ముగ్గురు అమ్మాయిలకి హెల్ప్ చేసాడని సత్యదేవ్ ని భయపెట్టాలనుకుంటాడు. దాంతో సీరియస్ అయిన సత్యదేవ్ ఆ కేసుని టేకప్ చేస్తాడు. ఇక కోర్టులో నంద(ప్రకాష్ రాజ్)తో పోటా పోటీగా వాదించి తన క్లైంట్ నివేత ని సేవ్ చేశాడా? లేదా? అసలు ఏయే కేసుల్లో నివేత, అంజలి, అనన్యలను ఇరికించారు? అసలు సత్యదేవ్ ఫ్లాష్ బ్యాక్ ఏంటి? ఎందుకు తనకి ఇష్టమైన న్యాయవాది వృత్తిని వదిలేసాడు? ఏ సంబంధం లేని ఆ ముగ్గురు అమ్మాయిల కోసం ఎందుకు స్టాండ్ తీసుకున్నాడు అన్నదే కథ.

తెరమీద స్టార్స్..

ఆన్ స్క్రీన్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రెసెన్స్ బిగ్గెస్ట్ హైలైట్ అనేది సెపరేట్ గా చెప్పాల్సినక్కర్లేదు. మునుపెన్నడూ లేని విధంగా పవన్ కళ్యాణ్ మూడు డిఫరెంట్ లుక్స్ లో కనిపించి ప్రేక్షకులను సర్ప్రైజ్ చేస్తాడు. ఇక పెర్ఫార్మన్స్ పరంగా అయితే నెక్స్ట్ లెవల్ అని చెప్పాలి. ఇప్పటి వరకూ పవన్ కళ్యాణ్ చేసిన సినిమాల పెర్ఫార్మన్స్ అంతా ఒక ఎత్తైతే వకీల్ సాబ్ లో ఆయన చేసిన మెచ్యూర్ పెర్ఫార్మన్స్ సింప్లీ మైండ్ బ్లోయింగ్ అని చెప్పచ్చు. అటు ఎమోషనల్ సీన్స్, కాలేజ్ ఎపిసోడ్స్, కోర్టులో సీరియస్ గా ఉంటూనే హృద్యంగా వేసిన సెటైర్స్ ఇలా అన్నీ షేడ్స్ ఆడియన్స్ ని థ్రిల్స్ చేస్తాయి. ఇక సినిమాకి కీలకమైన ఎమోషనల్ సీన్స్ కి నివేత థామస్, అంజలి మరియు అనన్యలు ప్రాణం పోశారు. ముఖ్యంగా ‘మగువ మగువ’ ఫీమేల్ వెర్షన్ సాంగ్ లో నివేత థామస్ అయితే అందరి కళ్ళు చెమ్మగిల్లేలా చేస్తుంది. అంజలికి బలమైన కోర్టు సీన్ ఒక్కటే అయినప్పటికీ చాలా బాగా చేసింది. ఇక పవన్ కళ్యాణ్ కి పోటీ ఇచ్చే లాయర్ గా ప్రకాష్ రాజ్ నటన చాలా బాగుంది. కానీ ఎక్కడో పవన్ కళ్యాణ్ పెర్ఫార్మన్స్ ముందు తక్కువే అనిపిస్తుంది.

తెర వెనుక టాలెంట్..

ఆకలి మీదున్న సింహాం వేట దొరికినట్టు, అభిమాన హీరో పవన్ కళ్యాణ్ సినిమాకి మ్యూజిక్ చేయడం కోసం ఎదురుచూస్తున్న థమన్ కి వకీల్ సాబ్ వచ్చింది. థమన్ తన ప్రాణం పెట్టి పనిచేశాడు. పాటలు ఎంత పెద్ద హిట్ అయ్యాయో అందరికీ తెలుసు, కానీ సినిమా చూసాక పాటల కంటే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గురించి ఎక్కువగా మాట్లాడుకుంటాడు. ప్రతి సీన్ ని మ్యూజిక్ తో నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాడు. ముఖ్యంగా సెకండాఫ్ కోర్టు సీన్స్ కి అయితే అద్భుతః అనకుండా ఉండలేం.పి.ఎస్ వినోద్ విజువల్స్ కూడా అదిరిపోయాయి. మూడు డిఫరెంట్ లుక్స్ లో పవన్ కళ్యాణ్ ని సూపర్బ్ గా చూపించి అభిమానుల ఆకలిని తీర్చాడు. ప్రవీణ్ పూడి ఎడిటింగ్ కూడా బాగుంది. తెలుగుకు అనుగుణంగా జత చేసిన కొన్ని ఫైట్ సీక్వెన్స్ లను చాలా బాగా డిజైన్ చేశారు. ముఖ్యంగా ఇంటర్వల్ ఫైట్ అండ్ టాయిలెట్ ఫైట్స్ సీన్స్ ఆడియన్స్ కి హై ఫీల్ ఇస్తాయి.

వేణు శ్రీ రామ్ తెలుగు ప్రేక్షకుల కోసం చేసిన మార్పులు చేర్పులు అందరికీ నచ్చుతాయి. ఒరిజినల్ కథకి ఏ మాత్రం డామేజ్ కలగకుండా పవన్ కళ్యాణ్ పాత్రని ఎస్టాబ్లిష్ చేసిన విధానం చాలా బాగుంది. ఈ విషయంలో అతన్ని మెచ్చుకొని తీరాలి. కథనం పరంగా ఫస్ట్ హాఫ్ లో అక్కడక్కడా ఎక్కువ ఎస్టాబ్లిష్ చేస్తున్నారేమో అనే ఫీలింగ్ కలిగినా సెకండాఫ్ మొదలయ్యాక ఇక అన్నీ మర్చిపోయేలా చేశారు. సినిమా పూర్తయ్యే టైంకి సెకండాఫ్ తప్ప ఏం గుర్తుండదు. వేణు శ్రీరామ్ తన అభిమాన హీరో పవన్ కళ్యాణ్ ని తనకి, అభిమానులకు, సినీ ప్రేక్షకులకు నచ్చేలా చూపిస్తూనే, కథ నుంచీ పక్కకి వెళ్లకుండా, పవన్ కళ్యాణ్ లోని నటుణ్ని మరోసారి ప్రేక్షకులకు పరిచయం చేసి వాహ్ అనిపించుకున్నాడు. ముఖ్యంగా పలు చోట్ల జనసేనకి సంబందించిన అంశాలను పర్ఫెక్ట్ గా సన్నివేశాల్లో కలిపేసిన తీరు సూపర్బ్. దిల్ రాజు – బోణి కపూర్ నిర్మాణ విలువలు బాగున్నాయి.

విజిల్ మోమెంట్స్:

– పవన్ కళ్యాణ్ మైండ్ బ్లోయింగ్ పెర్ఫార్మన్స్
– ఉత్కంఠ రేపే సెకండాఫ్
– కోర్ట్ రూమ్ సీన్స్
– ఎమోషనల్ కనెక్షన్
– ఇంటర్వల్ అండ్ క్లైమాక్స్
– యాక్షన్ సీన్స్

బోరింగ్ మోమెంట్స్:

– ఫస్ట్ హాఫ్ అక్కడక్కడా బోర్ అనిపించడం
– కొన్ని రెగ్యులర్ సీన్స్

విశ్లేషణ:

మూడేళ్ళుగా ఆకలి మీదున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకి ‘వకీల్ సాబ్’ ఓ అద్భుతమైన వింధు భోజనం లాంటిది. నటుడిగా పవన్ కళ్యాణ్ లోని కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తూనే, లుక్స్ లో అభిమానులకి వింటేజ్ ఫీల్ ని కలగజేసారు. వకీల్ సాబ్ సినిమాలో మాస్ ఆడియన్స్ ఈల కొట్టే ఫైట్స్ అండ్ ఎలివేషన్స్ ఉన్నాయి, ఫామిలీ అండ్ క్లాస్ ఆడియన్స్ కనెక్ట్ అయ్యే ఎమోషనల్ టచ్ ఉంది, పేస్ మీద స్మైల్స్ తెప్పించే సెటైరికల్ డైలాగ్స్ ఉన్నాయి. పవన్ కళ్యాణ్ అభిమానులే కాదు, ప్రతి ఒక్క సినిమా అభిమాని సినిమా చూసాక భలే ఉంది, మార్పులు చేర్పులతో ఒరిజినల్ కంటే బాగా తీశారు అనే ఫీలింగ్ తోనే బయటకి వస్తారు.

చూడాలా? వద్దా?: పక్కాగా చూడచ్చు.

తెలుగుబులెటిన్.కామ్ రేటింగ్ : 3.5/5  

సినిమా

మెగాస్టార్ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా

మెగాస్టార్ చిరంజీవి వరస ప్రాజెక్ట్స్ ను సెట్ చేసుకున్న విషయం తెల్సిందే. కొరటాల శివ డైరెక్షన్ లో ఆచార్య చిత్రాన్ని దాదాపు పూర్తి చేసాడు. దీని...

మా అధ్యక్షురాలి రేసులోకి హేమ!

మా (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) ఎన్నికల హంగామా విడుదలైంది. మా అధ్యక్ష పీఠం కోసం ఈసారి భారీ పోటీ ఉండబోతోంది. ఎందుకంటే ఇప్పటికే ఇద్దరు ప్రముఖులు...

కమెడియన్‌ ను దర్శకుడిగా తీసుకు రాబోతున్న నాగ్‌

ఎంతో మంది దర్శకులను పరిచయం చేసిన అక్కినేని వారు మరో దర్శకుడిని పరిచయం చేసేందుకు సిద్దం అయ్యారు. ప్రస్తుతం సినిమా షూటింగ్‌ లు పునః ప్రారంభం...

రష్మిక ఇంటికి వెళ్లిన ఫ్యాన్‌.. పోలీసులు అరెస్ట్‌

హీరోలు మరియు హీరోయిన్స్‌ కు ఉండే అభిమానుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వారు తమ అభిమాన స్టార్స్ ను చూసేందుకు ఎంత దూరం అయినా వెళ్తారు....

ఫారెస్ట్‌ ఫ్రంట్ లైన్‌ హీరోస్‌ కోసం ఉపాసన

మెగా పవర్ స్టార్‌ రామ్‌ చరణ్‌ సతీమణి ఉపాసన కొణిదెల చేసే కార్యక్రమాలు అన్ని ఇన్నీ కావు. ఆమె చేస్తున్న షో లతో మరియు ఆమె...

రాజకీయం

నారా లోకేష్ పవర్ పంచ్: నడి రోడ్డు మీద కాల్చెయ్యమన్లేదు కదా.?

స్క్రిప్టు ఫాలో అవుతున్నారా.? లేదంటే, నిజంగానే నారా లోకేష్ రాజకీయ నాయకుడిగా తనలోని ‘పవర్ ఫుల్’ యాంగిల్ చూపిస్తున్నారా.? అన్న విషయాన్ని పక్కన పెడితే, ఈ మధ్య టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిలో...

ఇసుక వర్సెస్ మట్టి.. నెల్లూరు ‘బులుగు’ ఫైట్.!

ఇద్దరూ అధికార పార్టీకి చెందిన నేతలు. పైగా ప్రజా ప్రతినిథులు. అందునా, కీలకమైన పదవుల్లో వున్న వ్యక్తులు. ‘పవర్’ వుంటే, దోచెయ్యాల్సిందే కదా.. అన్నట్టు, తమకు తోచిన రీతిలో దోచేస్తున్నారట. అందులో ఒకరి...

డెల్టా ప్లస్ వచ్చేసింది.. రాజకీయం చూస్తే సిగ్గేస్తోంది.!

నవ్విపోదురుగాక మనకేటి సిగ్గు.? అన్నట్టుంది రాజకీయ నాయకుల తీరు. కొందరు రాజకీయ ప్రముఖులు కరోనా మొదటి వేవ్, కరోనా రెండో వేవ్ సమయాల్లో ప్రాణాలు కోల్పోయారు. ఆ కారణంగా ఉప ఎన్నికలూ వచ్చాయి....

కరోనా సమయంలో పరీక్షలా.. రఘురామ మరో లేఖ

ఏపీలో అధికార పార్టీ తిరుగుబాటు ఎంపీ రఘురామ కృష్ణరాజు లేఖాస్త్రాలు కొనసాగుతున్నాయి. నవ హామీలు-వైఫల్యాల పేరుతో ఇప్పటివరకు సీఎం జగన్ కు తొమ్మిది లేఖలు రాసిన ఆయన.. నవ ప్రభుత్వ కర్తవ్యాల పేరుతో...

విజయసాయిరెడ్డి స్థాయికి అశోక్ గజపతిరాజు దిగజారాల్సిందేనా.?

‘16 నెలలు జైల్లో వుండి వచ్చిన వ్యక్తికి అందరూ దొంగల్లానే కనిపిస్తారు.. ఇందులో ఆశ్చర్యపోవడానికేముంది.?’ అని ఒక్క మాటతో తన మీద వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలకు ‘దిమ్మ తిరిగి మైండ్...

ఎక్కువ చదివినవి

మంత్రి అనిల్.. ఎమ్మెల్యే కాకాణి.. సై అంటే సై..

నెల్లూరు జిల్లాలో అధికార పార్టీ నేతల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. మంత్రి అనిల్, పార్టీ జిల్లా అధ్యక్షుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్ రెడ్డి ఒకరిపై మరొకరు సై అంటే సై అంటున్నారు....

నితిన్ అప్పుడే ముగించేశాడు

యంగ్‌ హీరో నితిన్ బాలీవుడ్‌ అంధాదున్‌ రీమేక్‌ షూటింగ్‌ ను ఇటీవలే పునః ప్రారంభించాడు. కరోనా సెకండ్‌ వేవ్‌ కు ముందే ఈ సినిమా షూటింగ్‌ ముగియాల్సి ఉన్నా కూడా కొన్ని కారణాల...

కొడుక్కు సోనూసూద్‌ ఫాదర్స్ డేకు ఖరీదై గిఫ్ట్‌

కరోనా విపత్తు సమయంలో సామాన్యులకు దేవుడి మాదిరిగా మారిన సోనూసూద్‌ గత ఏడాది కాలంగా వందల కోట్లు ఖర్చు చేస్తూ పేదలకు తనవంతు సహకారం అందించాడు. పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహించిన...

ఎన్టీఆర్‌30 సీనియర్ హీరోయిన్‌

యంగ్‌ టైగర్ ఎన్టీఆర్‌ ఆర్ ఆర్‌ ఆర్‌ సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నారు. ప్రస్తుతం ఆచార్య సినిమాను చేస్తున్న కొరటాల శివ వెంటనే ఎన్టీఆర్‌ 30 సినిమా వర్క్...

నయన్ లో నచ్చే లక్షణాలు చెప్పిన విగ్నేష్ శివన్

సౌత్ ఇండియన్ టాప్ నటి నయనతార తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను తెచ్చుకుంది. ముఖ్యంగా లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు కేరాఫ్ అడ్రెస్ గా మారింది నయన్. ప్రస్తుతం దర్శకుడు విగ్నేష్ శివన్ తో...