పవన్ కల్యాణ్ అప్పుడప్పుడు మాట్లాడుతుంటే సభల్లో నవ్వులు పూయాల్సిందే. కొన్ని సమస్యలను కూడా ఆయన చమత్కారంగా చెబుతుంటారు. తాజాగా పిఠాపురంలో ఆయన ఓ సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా పిఠాపురంనకు దేశంలోనే పేరు తీసుకువచ్చేలా పని చేద్దామంటూ ఆయన స్పష్టం చేశారు. అలాగే ఈ మధ్య తనకు ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నట్టు తెలిపారు. జేబు దొంగతనాలు, గంజాయి స్మగ్లింగ్ పెరుగుతున్నట్టు తన వద్దకు వచ్చిందన్నారు పవన్ కల్యాణ్. రహాలు పేట, ఇందిరా నగర్, అగ్రహారం ప్రాంతాల్లో గంజాయి స్మగ్లింగ్ పెరిగినట్టు తన దృష్టికి వచ్చిందన్నారు.
అయితే ఈ జేబు దొంగతనాలు నోటి మాట ద్వారా ప్రచారం జరిగి.. ఊర్లలో పవన్ కల్యాణ్ వచ్చిన తర్వాత దొంగతనాలు పెరిగాయి అంటే దరిద్రంగా ఉంటుందని.. పోలీసులు దాన్ని చూసుకోవాలంటూ చమత్కారంగా చెప్పారు. అయితే ఇలా పవన్ కల్యాణ్ సరదాగా చేసిన వ్యాఖ్యలను కొందరు వ్యూస్ కోసం తప్పుగా థంబ్ నైల్స్ పెట్టి యూట్యూబ్, సోషల్ మీడియాలో తప్పుగా ప్రచారం చేస్తున్నారు. పవన్ కల్యాణ్ వచ్చాకే దరిద్రం పట్టుకుంది అన్నట్టు థంబ్ నైల్స్ పెడుతున్నారు. కానీ పూర్తి వీడియో చూసిన వారికి మాత్రమే పవన్ అసలు ఏం అన్నాడు అనేది అర్థం అవుతుంది. కానీ ఇలా తప్పుడు థంబ్ నైల్స్ పెట్టేసరికి అది ప్రజల్లోకి తప్పుగా వెళ్లే అవకాశం ఉంటుందని జనసేన అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో భారీగా వైరల్ అవుతుంది.